NewsOrbit
న్యూస్ సినిమా

Kanana Ranaut: ది ఫ్యామిలీ మేన్2.. సమంత నటనకు కంగనా ప్రశంసలు..!

kanana ranaut praised samantha

Kanana Ranaut: కంగనా రనౌత్ Kanana Ranaut బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ అనే పేరు తెచ్చుకుంది. చేసే సినిమాలైనా, ట్విట్టర్ లో పోస్టులైనా, రాజకీయ నేతలపై తిరుగాబాటైనా ఆమెది ఒకటే పంధా. అందుకే ఫైర్ బ్రాండ్ అనే పేరు ఆమెకు పర్ఫెక్ట్ యాప్ట్. ఇప్పుడు ఆ ఫైర్ బ్రాండ్ టాలీవుడ్ గోల్డెన్ లెగ్ సమంతను ప్రశంసల్లో ముంచెత్తుతోంది. సమంత నటించిన వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ ట్రైలర్ ఇటివలే విడుదలైంది. ఈ ట్రైలర్ లో సమంత పాత్రకు విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. డీ గ్లామర్ లుక్ లో సూసైడ్ బాంబర్ గా సమంత తన పాత్రకు తగ్గట్టు ఒదిగిపోయిన తీరుకు సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ లిస్టులో ఇప్పుడు కంగనా రనౌత్ చేరింది.

kanana ranaut praised samantha
kanana ranaut praised samantha

ఇన్ స్టా వేదికలో స్పందించిన కంగనా.. ‘దిస్ గర్ల్ హేస్ మై హార్ట్’ అని తన వాల్ పై రాసి సమంత లుక్ సంబంధించిన ‘ఐ విల్ కిల్ దెమ్‘ అని ఉన్న స్క్రీన్ షాట్ ను జత చేసింది. దీనిపై సమంత కూడా రిప్లై ఇస్తూ ‘థాంక్యూ’ అని రిప్లై ఇచ్చింది. ఆమధ్య రిలీజ్ అయిన కంగనా తలైవి టీజర్ లో కంగనా నటనను మెచ్చుకుంటూ సమంత ట్వీట్ చేసింది. ‘బ్రేవెస్ట్ యాక్టర్ ఆఫ్ అవర్ జనరేషన్’ అంటూ ఆమె నటనను కొనియాడింది. ఇప్పుడు మరోసారి వీరిరువురూ ఒకరిపైమరొకరు అభిమానాన్ని మరోసారి చాటుకున్నట్టైంది. ఏప్రిల్ కూడా సమంతను.. ‘ఎపిటోమ్ ఆఫ్ ఉమెన్ ఎంపవర్ మెంట్’ అంటూ పొగిడింది కంగనా.

ఇప్పటికే సమంత క్యారెక్టర్ కు వస్తున్న రెస్పాన్స్, ఫ్యామిలీ మేన్ వెబ్ సిరీస్ పై ఉన్న అంచనాలను రెట్టింపు చేసిందనే చెప్పాలి. ఈ పాత్ర పోషించేందుకు పెద్ద కసరత్తే చేసానని చెప్తోంది సమంత. దర్శకులు రాజ్, డీకే ఇద్దరూ ఈ పాత్రపై బాగా శ్రద్ధ పెట్టి డిజైన్ చేశారట. పాత్ర స్వభావాన్ని అర్ధం చేసుకునేందుకు సెట్లో ఇద్దరిలో ఎవరు అందుబాటులో ఉంటే వారి సలహాలు తీసుకుని నటించినట్టు చెప్పుకొచ్చింది. ఔట్ ఆఫ్ టాలీవుడ్ లో నటించాననే ఫీలింగ్ తనకు కలగలేదని చెప్పుకొచ్చింది. జూన్ 4న అమెజాన్ ప్రైమ్ లో ఈ వెబ్ సిరీస్ రిలీజ్ కానుంది.

author avatar
Muraliak

Related posts

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

Vijay Devarakonda: రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో ప్రశాంత్ నీల్ మూవీ..?

sekhar

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

Pushpa 2: అల్లు అర్జున్ “పుష్ప 2” నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్..!!

sekhar

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

Zwigato OTT: థియేటర్లలో విడుదలైన రెండు నెలలకు ఓటీటీలోకి వచ్చేస్తున్న కపిల్ శర్మ అవార్డు విన్నింగ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Hanuman Tv contest: టీవీలో హనుమాన్ సెల్ఫీ కాంటెస్ట్.. విజేతలకు దిమ్మ తిరిగే గిఫ్ట్స్..!

Saranya Koduri

Jai Hanuman New Poster: హనుమాన్ జయంతి సందర్భంగా సరికొత్త పోస్టర్ను రిలీజ్ చేసిన జై హనుమాన్ టీం.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Nindu Noorella Saavasam April 232024 Episode 218: ఆయన అంటే నీకు ఇష్టమేనా అంటున్న అరుంధతి, ఆయనతో పెళ్లి నా అదృష్టం అంటున్న భాగమతి..

siddhu

Malli Nindu Jabili April 23 2024 Episode 630: పిల్లల కోసం హాస్పిటల్ కి వెళ్లిన అరవింద్ మాలినికి షాకింగ్ న్యూస్..

siddhu

Paluke Bangaramayenaa April 23 2024 Episode 208: ఆడది పుడితే అప్పుగా కనిపిస్తుందా ఈ సృష్టిని ప్రతి సృష్టి చేసేది ఆడదేరా అంటున్న నాగరత్నం..

siddhu