Kangana Ranaut: కంగనా రనౌత్… బాలీవుడ్ లో పరిచయాలు అక్కరలేని పేరు ఇది. తరచు కంగనా వివాదాలలో చిక్కుకుంటూ ఉండడం వలన ఆమెకు ఫైర్ బ్రాండ్ అన్న పేరు కూడా ఉంది. ఆమె అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సఫలం అయ్యారు కంగనా Kangana Ranaut. అనతికాలంలోనే కంగనా స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. ఎక్కడ అన్యాయం జరిగినా కంగనా వెంటనే స్పందిస్తుంది. ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో అవకాశాలకు ఏమాత్రం కొదవ లేదని చెప్పాలి.

ప్రభాస్ హీరోగా నటించిన ‘ఏక్ నిరంజన్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది కంగనా రనౌత్. అయితే ఆమె ఎక్కువగా పెద్దవాళ్ళతో వివాదాలలో చిక్కుకుంటూ ఉండడం వలన తగిన మూల్యం చెల్లిస్తూనే ఉంటుంది. ఇటీవల ముంబై ని పాకిస్తాన్ తో పోల్చి వివాదాలలో ఇరుక్కుంది ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ. దీని ఫలితంగా అక్రమంగా నిర్మించిన కార్యాలయం అంటూ బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కంగనా ‘మణికర్ణిక’ కార్యాలయాన్ని కూల్చివేసిన సంగతి తెలిసిందే. అప్పటిలో అది సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఈ విషయంలో తనకు న్యాయం చెయ్యమంటూ ఆమె చివరికి బోంబే హైకోర్టును ఆశ్రయించింది. ఎప్పటికప్పుడు ఏదొక వివాదంతో కంగనా వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది.
ఇదిలా ఉండగా ఈ మధ్య కంగనా రనౌత్ తన రూట్ మార్చినట్లు స్పష్టం అవుతోంది. గత కొన్ని రోజులగా ఏ వివాదాలతోను తెరపైకి రాలేదు ఈమె. కంగనా తన దృష్టిని వివాదాలవైపు నుంచి దేవాలయాల మీదకు మళ్లించి ప్రశాంతంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కంగనా పూరి జగన్నాథుడిని దర్శించుకుని కొన్ని ప్రత్యేక పూజల్లో ఆమె పాల్గొన్నట్లు సమాచారం. ఆమె రాకతో అక్కడి ఆలయ అధికారులు మరియు పూజారులు ఆమెకు ఘనంగా సాంప్రదాయబద్దంగా స్వాగతం పలికి ఆమెకు దర్శన భాగ్యం కల్పించిన్నారు.