NewsOrbit
Telugu Cinema న్యూస్ సినిమా

Kangana Ranaut: కంగనా షో విన్నర్ ఎవరూ ఊహించివుండరు.. బిత్తరబోయిన మిగిలిన కంటిస్టెంట్స్?

Kangana Ranaut:కంగనా రనౌత్ పేరు చెబితే, బాలీవుడ్ బడా బాబులు కాస్త వణుకుతారు. ఎందుకంటే ఆ మాటలకు ఎవరన్నా వణకాల్సిందే. సూటిగా, సుత్తిలేకుండా, వున్నది ఉన్నట్టు మాట్లాడటం ఆమె నైజం. ఆ మనస్తత్వమే ఆమెను వివాదాలకు దగ్గరగా ఉంచుతుంది. అవును… ఆమె ఓ అద్భుతమైన నటి. అందుకే ఎవరు ఎన్ని పన్నాగాలు పన్నినా, ఆమె బాలీవుడ్లో తిరుగులేని తారగా దూసుకుపోయింది. ఇకపోతే మన బాలీవుడ్‌ క్వీన్ మొదటి సారి హోస్ట్ గా మారి చేసిన షో లాకప్ అన్న సంగతి అందరికీ తెలిసినదే. కొన్ని రోజుల క్రితం ప్రారంభమైన ఈ షో బిగ్ బాస్ రియాల్టీ షోలాగే ఉండేలా డిజైన్ చేసి, కొన్ని మార్పులు చేర్పులతో సరికొత్తగా స్టార్ట్ చేసారు.

Kangana Ranaut: ముగిసిన సీజన్ 1?

ఇక ఈ షో అనతికాలంలోనే మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. ఎందుకంటే అక్కడ వున్నది ఎవరు మరి? మన ఫైర్ బ్రాండ్ కదూ. ఈ షో మొదటినుండి మంచి ఉత్కంఠతతో సాగుతూ నార్త్ లో మంచి TRP రేటింగ్ సాధించింది. ఈ లాకప్ షో ఆల్ట్ బాలాజీ, ఎమ్ఎక్స్ ప్లేయర్ OTTలలో టెలికాస్ట్ అయింది. కాగా ఈ షో చాలా కాంట్రవర్సీగా నడిచింది. ఇందులో పార్టిసిపేట్ చేసిన కంటెస్టెంట్స్, వాళ్ళు చెప్పిన విషయాలు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసినదే. ఎంతో గ్రాండ్ గా లాంచ్ అయిన లాకప్ షో సీజన్ 1 తాజాగా విజయవంతంగా ముగిసింది.

విన్నర్ అతడే!

ఇక చివరికి, ఈ షోలో విజేతని తాజాగా మన క్వీన్ ప్రకటించింది. ఎంతో తీవ్రమైన ఒత్తిడితో కూడిన సస్పెన్స్ తరువాత విజేత షెల్ లో నుండి బయటకు వచ్చాడు. అవును.. మునావర్ ఫరూఖీ, నటి పాయల్ రోహత్గీ, అజ్మా ఫల్లా, అంజలి అరోరా, శివమ్‌ శర్మ ఫైనల్ కి చేరుకోగా హోస్ట్ కంగనా రనౌత్‌ ‘మునావర్ ఫరూఖీ’ని విన్నర్ గా ప్రకటించింది. లాకప్ షో విన్నర్ అయినందుకు విజేత మునావర్‌ ఫరూఖీ ట్రోఫీతో పాటు 20 లక్షల రూపాయలు, మారుతీ సుజుకి ఎర్టిగా కారు, ఇటలీకి ఫ్రీ ట్రిప్‌ను కూడా సంపాదించాడు. లాకప్ షో రన్నరప్ గా నటి పాయల్ రోహత్గీ నిలవడం గమనార్హం. దాంతో సీజన్ 1 ముగియడంతో అభిమానులు సీజన్ 2 కోసం ఎదురు చూస్తున్నారు.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

Prime Video Top Trending Movies: ప్రైమ్ వీడియోలో అదరగొడుతున్న క్రైమ్ ‌ థ్రిల్లర్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

Aavesham OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న సాహిత్ ఫాజల్ తమిళ్ బ్లాక్బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Family Star OTT: ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసుకున్న ఫ్యామిలీ స్టార్.. ఎప్పుడంటే..!

Saranya Koduri

Monkey Man OTT Release: రెండో కంటికి తెలియకుండా ఓటీటీలోకి వచ్చేసిన శోభిత ధూళిపాళ యాక్షన్ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Manjummel Boys OTT: మంజుమ్మల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్ ఆ విషయంలో క్లారిటీ.‌.. ప్రేమలు లాగా కాకుండా జాగ్రత్తలు..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 24 2024 Episode 219: మనోహరి చూస్తూ ఉండగా భాగమతి మెడలో తాళి కట్టిన అమరేంద్ర..

siddhu

Malli Nindu Jabili Apil 24 2024 Episode 631: గౌతమ్ ఉద్యోగం తీసేయించిన అరవింద్, జీవితంలో తల్లిని కాలేను సంతోషమేగా మల్లి అంటున్నా మాలిని..

siddhu

Paluke Bangaramayenaa April 24 2024 Episode 210: పీటల మీద కూర్చొని సీతారాముల కళ్యాణం జరిపించిన స్వర అభిషేక్..

siddhu

Madhuranagarilo April 24 2024 Episode 346: శ్యామ్ ని అవమానించి ఇంట్లో నుంచి వెళ్ళిపొమటున్న మధుర..

siddhu