NewsOrbit
న్యూస్

జగన్ దే రైట్ అంటున్న బీజేపీ… అచ్చెన్న మరింత చిక్కుల్లో!

జగన్న్ దే రైట్… అవినీతిని సహించకూడదు, విచారణలు జరగాల్సిందే అని జనసేన అంటే… అవినీతి విషయంలో అరెస్టులు చేయడం, విచారణలు చేయడం మంచి నిర్ణయమని బీజేపీ స్పందిస్తుంది. జగన్ అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులైనా గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని వెలికితీయలేకపోయాడు.. ఒక అసమర్ధ ముఖ్యమంత్రి అని రెచ్చగొట్టినట్లు మాట్లాడిన కన్నా లక్ష్మీ నారాయణ.. అచ్చెన్నాయుడు వ్యవహారంలో స్పందించారు. ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందని.. అవినీతికి పాల్పడే వారు ఎవరైనా అరెస్ట్ చేయాల్సిందేనని స్పష్టంం చేస్తున్నారు.

ఇదే విషయంపై స్పందించిన సోము వీర్రాజు… టీడీపీ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్‌ సబబేనని అన్నారు. ప్రతి పక్షనేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టిన ఆయన… బీసీలందరూ బయటకు వచ్చి నిరసన తెలపాలని మాట్లాడటం దారుణమని సోము వీర్రాజు పేర్కొన్నారు. ఇదే క్రమంలో… ఈఎస్‌ఐ కుంభకోణంలో అచ్చెన్నాయుడు పాత్ర రుజువైందని అభిప్రాయపడిన బీజేపీ అధికార ప్రతినిధి లక్ష్మీపతి రాజా… తప్పు చేసిన వాళ్లు శిక్ష అనుభవించాల్సిందేనని స్పష్టం చేశారు. అవినీతికి పాల్పడిన సొమ్మును అచ్చెన్నాయుడు నుంచి రికవరీ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

ఇక ఇదే విషయంలో బీజేపీ కేంద్రమాజీ మంత్రి సీనియర్ నాయకురాలు పురంధేశ్వరి కూడా స్పందించారు. ఈ కుంభకోణం కోట్ల రూపాయలదని.. అచ్చెన్నాయుడి పాత్ర ఉన్నట్లు తనకు తెలియదని తెలిపింది. అవినీతి చేస్తే అరెస్ట్ చేయడం కరెక్టేనని.. అవినీతికి పాల్పడిన వారిని బీజేపీ క్షమించే ప్రసక్తే లేదని పురంధేశ్వరి తెలిపింది. ఇక ఈఎస్ఐ కుంభకోణంలో అచ్చెన్నాయుడి పాత్ర ఒక్కడిదే ఉంటుందని తాను అనుకోవడం లేదని.. చంద్రబాబు ప్రభుత్వంలోని మరికొందరు పెద్ద తలకాయల పాత్ర ఉండే అవకాశాలు కొట్టిపారేయలేమని జీవీఎల్ అనుమానం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు లోకేష్ కు తెలియకుండా ఈ కుంభకోణం జరిగి ఉంటుందని తాను అనుకోవట్లేదన్న ఆయన… సమగ్ర దర్యాప్తు జరిపి నిజాలను జగన్ ప్రభుత్వం వెలికితీయాలని కోరారు.

Related posts

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju