Vaddura Sodharaa: కన్నడ హీరో రిషి “వద్దురా సోదరా” సినిమాతో తెలుగు తెరకి పరిచయం అవుతున్నాడు.. సినిమా టైటిల్ ను కింగ్ నాగార్జున నటించిన మన్మధుడు సినిమా పాటని టైటిల్ గా ఎంచుకున్నారు నిర్మాతలు.. తాజాగా వద్దురా సోదరా సినిమా ఫస్ట్ లుక్- మోషన్ పోస్టర్ ను విడుదల చేసారు మేకర్స్..!! మీరు తీపి రుచి మరచిపోయినప్పుడు చేదు తీపి అవుతుంది. ఇది తీపి, చేదు కలబోసిన సినిమా అంటూ విడుదల చేసిన వద్దురా సోదరా మోషన్ పోస్టర్ అందర్నీ ఆకట్టుకుంటోంది..!!

Read More: International Yoga Day: అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు..!!
నా గర్ల్ ఫ్రెండ్ తనకు ఇష్టం లేని వాడిని పెళ్లి చేసుకున్నప్పుడు నేను లేకుండా తను ఎప్పుడూ సంతోషంగా ఉండలేను అని చెప్పింది. అప్పటినుంచి నేను కూడా సంతోషంగా ఉండడం మానేసాను. కానీ ఇప్పుడు ఒక సంతోషపు ముసుకు వేసుకొని బ్రతుకుతున్నాను. పైకి సంతోషంగా ఉన్నా లోపల బాధతో మిగిలిపోయాను.. అని చెబుతూన్నా ఇంట్రడ్యూసింగ్ వీడియో సస్పెన్స్ తో ముగించారు మేకర్స్..
ఈ చిత్రానికి ఇస్లాహుదీన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో రిషి సరసన ధన్య బాలకృష్ణన్ నటిస్తోంది. ఈ చిత్రాన్ని స్వేచ్ఛ క్రియేషన్స్, స్టాబ్ ఫాబ్ ప్రొడక్షన్ పతాకాలపై ధీరజ్ మొగిలినెని, సూర్య వంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నాగభూషణ్ ,గ్రీష్మ శ్రీధర్, మహదేవ్ ప్రసాద్, భవాని ప్రకాష్, అపూర్వ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి విష్ణు ప్రసాద్ దిలీప్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ప్రసన్న శివరామన్ సంగీతం సమకూరుస్తున్నారు. వినూత్న ప్రేమకథతో తెలుగు కన్నడ భాషలలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.. ఈ ద్విభాషా ప్రేమ కథ ప్రేక్షకులను మెప్పిస్తుందని మోషన్ పోస్టర్ చెప్పకనే చెబుతోంది.