Kantara: రీసెంట్గా మన తెలుగు రాష్ట్రాలలోని థియేటర్స్‌లో విడుదలైన ‘కాంతార’ కన్నడ డబ్బింగ్ సినిమా బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. మొదట ఒక్క కన్నడ భాషలోనే విడుదలైన ఈ సినిమా 2 రోజుల క్రితం తెలుగుతో పాటు హిందీ, తమిళంలో కూడా విడుదలై ఇప్పుడు భారీగా కలెక్షన్లు వసూలు చేస్తోంది. రిలీజ్ అయినా రోజు నుంచే లాభాల బాటలో నడుస్తున్న ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవడానికి కారణం ఈ సినిమాలోని బెస్ట్ కంటెంట్ అని చెప్పొచ్చు.
Kantara: సేమ్ స్టోరీ
ఈ సినిమా చూసిన వాళ్లంతా మరోసారి కంటెంట్ గురించి మాట్లాడటం మొదలు పెట్టారు. కంటెంట్ మంచిగా ఉంటే సినిమా ఫెయిల్ అవుతుందని బాధపడాల్సిన అవసరం ఉండదని అంటున్నారు. ‘కాంతార’ కన్నడ సినిమానే అయినా కూడా ఈ సినిమాలో మన తెలుగు చరిత్ర ఉందనే విషయం ఆ సినిమా చూసిన వాళ్ళకే అర్థం అవుతుంది. ముఖ్యంగా కాంతార సినిమాలో సమ్మక్క, సారక్కల కథ ఉందని చాలా మందికి తెలీదు. సమ్మక్క, సారక్క అడవిలో జీవించే ప్రజల కోసం కాకతీయులతో పోరాడి చిలకళగుట్టలో అదృశ్యమయ్యారు. అచ్చం అదే కథకు కొలంను జత చేసి తెరకెక్కించాడు డైరెక్టర్ రిషభ్ శెట్టి.
సూపర్ హిట్
రాజులు, దేవుళ్ల కాన్సెప్ట్‌తో రూపొందించిన ఈ నేచురల్ ఫిలిం సూపర్ హిట్ అయింది. దీన్నిబట్టి విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తీసినా ప్రేక్షకులు ఆ సినిమాలను ఆదరిస్తారని మరోసారి నిరూపితమయింది. మన డైరెక్టర్స్ కూడా సెర్చ్ చేస్తే ఇలాంటి చారిత్రాత్మక కథలు చాలానే దొరుకుతాయి. అలాంటి కథలను సినిమా రూపంలో ప్రేక్షకులకు అందిస్తే ఇప్పటి తరానికీ మన చరిత్ర గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి టాలీవుడ్ డైరెక్టర్స్ అందరూ అలాంటి కథలను ఎంచుకుంటే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.