బీజేపీ సీనియర్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డారు. బెంగళూరు నుండి కలుబుర్గి కి యడ్యూరప్ప హెలికాఫ్టర్ లో వెళుతుండగా సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో పైలట్ అప్రమత్తమైయ్యారు. వెంటనే స్పందించి హెలికాఫ్టర్ ను జెవారీలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు పైలట్. దీంతో యడ్యూరప్ప కు పెద్ద ప్రమాదం తప్పినట్లు అయ్యింది. దీంతో బీజేపీ నేతలు ఊరిపిపీల్చుకున్నారు.

ఈ ఏడాది కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కలుబుర్గి పర్యటన ఖరారు అయ్యింది. ఈ నెల 12న ప్రధాని మోడీ కలుబుర్గిలో పర్యటించనున్నారు. కాగా ప్రధాని పర్యటన ఏర్పాట్లను పరిశీలించేందుకు యడ్యూరప్ప కలుబుర్గి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. హెలికాఫ్టర్ దిగాల్సిన హెలిపాడ్ గ్రౌండ్ లో ప్లాస్టిక్, ఇతర వ్యర్ధా పదార్ధాలు ఉండటంతో హెలికాఫ్టర్ ల్యాండింగ్ సమయంలో సమస్యలు తలెత్తాయి. పైలట్ చివరి నిమిషంలో చాకచక్యంగా హెలికాఫ్టర్ ను ల్యాండ్ చేయకుండా ముందుకు తీసుకువెళ్లారు. అనంతరం అధికారులు క్లీయరెన్స్ ఇవ్వడంతో సురక్షింగా కిందకు ల్యాండ్ చేశారు. దీంతో బీజేపీ నేతలు ఊపిరిపీల్చుకున్నారు.
ఏపిలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల
