IAS: గొడవ పడ్డ ఇద్దరు మహిళా ఐఏఎస్ లకు కర్నాటక ప్రభుత్వం షాక్ ట్రీట్మెంట్ !తెలుగమ్మాయి రోహిణి సింధూరికీ తప్పని బదిలీ!!

Share

IAS: ఇద్దరు మహిళా ఐఏఎస్ అధికారుల పరస్పర విమర్శలతో ఇరుకున పడ్డ కర్నాటకలోని ఎడియూరప్ప ప్రభుత్వం ఆ ఇద్దరికీ షాక్ ట్రీట్మెంట్ ఇచ్చింది.మైసూరు జిల్లా డిప్యూటీ కమిషనర్ రోహిణి సింధూరి ,మైసూర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శిల్పా నాగ్ లను బదిలీ చేసింది.మైసూరు జిల్లా నూతన కలెక్టర్‌గా డా.బగాది గౌతమ్, కార్పొరేషన్‌ కమిషనర్‌గా జి.లక్ష్మీకాంత్‌ రెడ్డిలను కర్నాటక ప్రభుత్వం నియమించింది. గౌతమ్, లక్ష్మీకాంత్‌రెడ్డి వెనువెంటనే పదవీ బాధ్యతలు స్వీకరించారు.కాగా రోహిణి సింధూరి ని రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్‌గా బదిలీ చేశారు. గ్రామీణాభివృద్ధి– పంచాయతీ రాజ్‌లో ఈ గవర్నెన్స్‌ డైరెక్టర్‌గా శిల్పానాగ్‌ను నియమించారు.

Karnataka govt gives shock treatment to two women IAS
Karnataka govt gives shock treatment to two women IAS

మహిళా ఐఏఎస్ ల వివాదమేంటంటే?

రోహిణి సింధూరి,శిల్పా నాగ్ ల మధ్య ఏ కారణంగా గొడవ మొదలైందోగానీ ఆకస్మాత్తుగా శిల్ప తన పోస్ట్ కి రాజీనామా చేస్తున్నట్లు మీడియా సమావేశం పెట్టి మరీ ప్రకటించారు.రోహిణి సింధూరి వేధింపుల వల్లే తాను ఉద్యోగం నుండి వైదొలుగుతున్నట్లు ఆమె వెల్లడించారు.ప్రకటించారు. “రోహిణి సింధూరి నాకు అడుగడుగునా అడ్డుతగులుతున్నారు . మైసూరులో స్వేచ్ఛగా పనిచేసే వాతావరణం ఏమాత్రం లేదు.. అందుకే నేను సివిల్‌ సర్వీసు ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాను”అని శిల్పా నాగ్ ప్రకటించడం సంచలనం రేపింది.

రోహిణి సింధూరి ఎవరంటే?

మన తెలుగమ్మాయి రోహిణి సింధూరి మైసూరు జిల్లా డిప్యూటీ కమిషనర్గా పనిచేస్తున్నారు.విధి నిర్వహణలో మహా కచ్చితంగా ఉంటారని మంత్రుల్నే లెక్కచేయరని రోహిణి సింధూరికి ఇమేజ్ ఉంది.హాసన్ జిల్లా డిప్యూటీ కమిషనర్ గా వుండగా ఆమెకి ఆ జిల్లా ఇన్ఛార్జి మంత్రి మంజుకు మధ్య వార్ జరిగింది.ఆ జిల్లాలో సాగుతున్న అక్రమ ఇసుక తవ్వకాలను రోహిణి సింధూరి ఉక్కుపాదంతో అణిచేయడ౦ రాజకీయ నాయకులకు ఇబ్బందికరంగా తయారైంది.రాజీలేని ధోరణితో వ్యవహరిస్తున్న రోహిణికి చెప్పేందుకు కూడా ఎవరూ సాహసించని పరిస్థితుల్లో మంత్రి మంజు నాయకత్వంలో పలువురు రాజకీయ ప్రముఖులు అప్పటి ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు మొరపెట్టుకొని ఆమెను హసన్ నుండి ట్రాన్సఫర్ చేయించారు.

అయితే మొండి ఘట్టమైన రోహిణి సింధూరి హైకోర్టు ఏపి అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్కు వెళ్లి హసన్ లోనే కొనసాగే విధంగా ఆర్డర్లు తెచ్చుకుంది.తదుపరి పరిణామాల్లో ఆమె మైసూరుకు బదిలీ అయ్యారు.ప్రజల్లో అయితే ఆమెకు మంచి ఇమేజ్ ఉంది. ఈ నిక్కచ్చితనం వల్లే ఆమెకు శిల్పకు మధ్య విభేదాలు వచ్చాయని అంటున్నారు.కార్పొరేషన్ కు చెందిన పన్నెండు కోట్ల రూపాయల నిధుల లెక్కలను రోహిణి సింధూరి అడగడం వల్లే శిల్పానాగ్ ఆమెపై ఆరోపణలు చేసిందన్న కథనాలు మీడియాలో వచ్చాయి.అయితే ప్రభుత్వం డ్యామేజీ రిపేరింగ్ చర్యల్లో భాగంగా ఆ ఇద్దర్నీ కూడా బదిలీ చేసేసిందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

 


Share

Related posts

Madhu Priya : వావ్ బంగారం లాంటి వీడియో – తన కొడుకుతో కలిసి పాట పాడిన మధు ప్రియ – లవ్లీ సీన్ డోంట్ మిస్

bharani jella

Mansas Trust: మాన్సాస్ ట్రస్ట్ వివాదం..! హైకోర్టు తీర్పుపై దేవాదాయ మంత్రి వెల్లంపల్లి స్పందన ఇదీ..!!

somaraju sharma

రాజధాని ఉద్యమానికి ఎన్‌ఆర్‌ఐల చేయూత

somaraju sharma