Karthi : కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ టాలీవుడ్ లో స్ట్రైట్ సినిమా చేయబోతున్నాడా..అవునని ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. తమిళ స్టార్ హీరో సూర్య సోదరుడిగా ఎంట్రీ ఇచ్చిన కార్తీ కోలీవుడ్ లో స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. దాంతో సొంత నిర్మాణ సంస్థలలో నటించడమే కాకుండా బయట నిర్మాణ సంస్థలలో నటించే అవకాశాలు అందుకుంటున్నాడు. ఇటీవల ఖైదీ తో భారీ హిట్ అందుకున్న కార్తీ ఆ తర్వాత సుల్తాన్ సినిమాతోనూ పాన్ ఇండియన్ స్థాయిలో హిట్ అందుకున్నాడు.
కన్నడ బ్యూటీ రష్మిక మందన్న ఈ సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. కార్తీ నటించిన తమిళ సినిమాలు తెలుగులో కూడా డబ్ అయి మంచి కమర్షియల్ హిట్ సాధిస్తున్నాయి. మంచి వసూళ్ళు రాబడుతున్నాయి. చెప్పాలంటే కార్తీకి తెలుగు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది. ఇక తెలుగులో నాగార్జునతో కలిసి నటించిన ఊపిరి సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. వాస్తవంగా ఈ సినిమాలో కార్తీ ప్లేస్ లో జూనియర్ ఎన్.టి.ఆర్ నటించాల్సింది.
Karthi : కార్తి – నాగ చైతన్యలతో ఓ సినిమా రాబోతుందని ప్రచారం జరిగింది.
కానీ ఆ అదృష్టం కార్తీకి దక్కిది. దాంతో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని మరింత దగ్గరయ్యాడు. కాగా నాగార్జున సొంత నిర్మాణ సంస్థ అన్నపూర్ణ ప్రొడక్షన్స్ లో కార్తీ సినిమా ఉండబోతోందనే మాట ఫిల్మ్ సర్కిల్ లో వినిపిస్తోంది. నాగార్జున మంచి బిజినెస్ మ్యాన్. ఆయనకి కథ నచ్చి అది ఎవరికి సెట్ అవుతుందో వాళ్ళతో సినిమా నిర్మించడానికి ఏమాత్రం ఆలోచించడు. ఇప్పుడు కూడా కార్తీకి సూటయ్యే ఓ కథ నాగార్జున వద్దకి వచ్చిందట. అందుకే నేరుగా కార్తీతో నాగార్జున ఈ ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నాడట. ఇక ఇంతక ముందు కూడా కార్తీ – నాగ చైతన్యలతో ఓ సినిమా రాబోతుందని ప్రచారం జరిగింది.