Karthika Deepam APR 4 Today Episode: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. సౌర్య కోసం. హిమ వెతకడం, హిమ మీద పగ తీర్చుకోవాలని సౌర్య అనుకోవడం… మరోపక్క సౌర్య నిరూపమ్ ని. ఇష్టం పడడం, హిమ ఏమో నిరూపమ్ తో చనువుగా ఉండడం, ప్రేమ్ మాత్రం హిమను ప్రేమించడం ఇలా రకరకాల ట్విస్ట్ లతో కార్తీక దీపం సీరియల్ ముందుకు కొనసాగుతూ పోతుంది.మరి ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందామా. హిమ పెళ్లి గురించి సౌందర్య మాట్లాడగా సౌర్య దొరికేవరకు పెళ్లి ప్రస్తావన తేవద్దు అంటూ హిమ నానమ్మ తాతయ్యలకు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది.హిమ మాటలు విన్న సౌందర్య దేవుడిని సౌర్య ఎక్కడున్నా త్వరగా కనిపించేలా చేయి అని కోరుకుంటుంది.
Karthika Deepam Serial : మోనిత ఇంట్లో ఉన్న కార్తీక్, ఆనంద్ ల ఫోటో చూసి షాక్ అయిన సౌర్య..!
Karthika Deepam APR 4 Today Episode:హిమ కనిపించేలా చేయమని దేవుణ్ణి కోరుకున్న సౌర్య:
మరోవైపు సౌర్య గుడికి వెళ్లి ఎలాగైనా హిమను కనిపించేలా చెయ్యి దాని మీద ఎలాగయినా పగ తీర్చుకోవాలి అని కోరుకుంటుంది.పూజారి వచ్చి మీ కోరిక త్వరలోనే తిరుతుంది అని అంటాడు.ఇక సౌర్య కొబ్బరికాయ కొడుతుండగా అటుగా వస్తున్న సప్న తలకు కొబ్బరి ముక్క తగులుతుంది. ఇక స్వప్న కోపంగా వచ్చి జ్వాల మీద అరుస్తుంది. చూసుకోలేదు అని జ్వాల అన్నాగాని వినిపించుకోకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. కాసేపు వారిద్దరి మధ్య కొంత ఘర్షణ జరుగుతుంది.
Karthika Deepam APR1 Today Episode: బస్తిలో కార్తీక్ ఫొటోకు దండం పెడుతున్న హిమను సౌర్య చూసేస్తుందా..?
సౌర్యను చెంప దెబ్బ కొట్టిన స్వప్న :
సీన్ కట్ చేస్తే స్వప్న తో పాటు గుడికి వచ్చిన ప్రేమ్ అక్కడ గుడిలో ఫోటోలు తీస్తు ఉంటాడు.అది గమనించిన సౌర్య ప్రేమ్ ను ఫోటోలు తీయ్యొద్దు అంటుంది. ప్రేమ్ ఎందుకు అని అడిగితే ఏయ్ ఎక్సట్రా అంటుంది సౌర్య. దాంతో ఈలోపు అక్కడకు స్వప్న వచ్చి సౌర్యను గట్టిగా చెంపమీద కొట్టి నా కొడుకునే ఎక్సట్రా అంటావా అంటుంది. హ మళ్ళీ మళ్ళీ అంటాను అంటుంది సౌర్య. ఏంటి ఈవిడ మీ అమ్మా అంటే సత్య సార్ పెళ్ళామా అంటుంది. ప్రేమ్ అమ్మని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత స్వప్న ఈ అలగా జనాలతో నీకేంటి రా అంటే దాంతో సౌర్య ఒక్కసారిగా స్వప్నను కొట్టడానికి చేయి లేపుతుంది.
Karthika Deepam Mar 31 Today Episode: రక్త సంబంధం అంటే ఇదే కాబోలు..ఆటోలో కళ్ళు తిరిగి పడిపోయిన హిమ.. టెన్షన్ లో సౌర్య..!
గుడిలో నిరూపమ్, హిమను చూసి స్వప్న షాక్ :
ఇంతలో అక్కడకు నిరూపమ్ వచ్చి సౌర్య చెయ్యిని పట్టుకుంటాడు.ఓయ్ డాక్టర్ సాబ్ మీరు ఏంటి ఇక్కడ అంటుంది.నిరూపమ్ తో హిమకుడా గుడికి వస్తుంది.ఇక స్వప్న మాత్రం ఈ అమ్మయి నీకెలా తెలుసురా అని అంటుంది.అయిన నేను రమ్మంటే గుడికి రావు.. తను రమ్మంటే మాత్రం వచేస్తావా అని కోపంతో అంటుంది స్వప్న.పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు అని ఇకనుంచి నిరూపమ్ తిరగవద్దు అని హిమకు వార్నింగ్ ఇస్తుంది.
Karthika Deepam Mar 30 Today Episode: తింగరి ఎవరు అనేది సౌర్యకు తెలిసిపోయిందా.. తనపై కోపాన్ని ఇలా తీర్చుకొనుందా..?
హిమ నిరూపమ్ ని ప్రేమిస్తుందా..?
ప్రేమ్ మాత్రం అమ్మను కంట్రోల్ చేసి గుడి నుంచి ఇంటికి తీసుకుని వెళ్తు వెనక్కి తిరిగి నిరూపమ్ ను హిమను చూసి కొంపదీసి హిమ నిరూపమ్ ను ప్రేమించడం లేదు కదా అని అనుకుంటాడు.గుళ్లో జరిగిన విషయం హిమ తాతయ్య, నానమ్మ లకు చెప్పి అత్తయ్యకు మీరు అంటే ఎందుకు అంత కోపం అంటుంది. ఇలోపే స్వప్న సౌందర్య ఇంటికి. వచ్చి నానా హంగామా చేస్తుంది.నాకు మమ్మీ లేదు. డాడీ ఒక్కడే ఉన్నాడు అని ఆనందరావుతో అనడంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.