Karthika Deepam: డాక్టర్ సాబ్ తో బయటికి వెళ్ళడం లేదని ఫీల్ అవుతున్న జ్వాల… మరోవైపు జ్వాలను చూసి నవ్వుకున్న మోనిత కొడుకు..!

Share

Karthika Deepam: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది.ఇక ఈరోజు ఎపిసోడ్ లో హిమ,జ్వాల, నిరుపమ్ ముగ్గురూ కూడా కలిసి నాగార్జునసాగర్ వెళ్లాలని అనుకుంటారు.ఇక జ్వాల డాక్టర్ సాబ్‌తో బయటికి వెళ్తున్నా అని తలుచుకుంటూ ఊహల్లో తేలిపోయింది.మరోవైపు నిరుపమ్ ఇంట్లో డిన్నర్ చేస్తూ ఉంటుంది.స్వప్న కూడా ప్రేమగా వడ్డిస్తూ ఉంటుంది. అప్పుడే నిరుపమ్ సత్య, ప్రేమ్‌ల గురించి టాపిక్ తీసుకుని వస్తాడు.

నిరూపమ్ కి పెళ్ళి సంబంధాలు చూస్తున్న స్వప్న :

నిరూపమ్ మాటలకు స్వప్నకి కోపం వస్తుంది. కానీ నిరూపమ్ మాత్రం మనం చాలా బాగా తింటూ ఉంటున్నాం.. పాపం ప్రేమ్, డాడీ అక్కడ తినడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు కదా మమ్మీ..’ అంటాడు నిరుపమ్ బాధగా. దాంతో స్వప్న రగిలిపోతూ వాళ్ళ గురించి నా దగ్గర మాట్లాడకు అని చెప్తుంది. మమ్మీ నువ్వు కొంచెం పంతం తగ్గించుకుంటే డాడీ,నువ్వు,
నేను,ప్రేమ్ మనమంతా కలిసి చక్కగా ఉండొచ్చుగా అంటాడు నిరుపమ్. ‘ఇంకోసారి అలా అనొద్దు నిరుపమ్ అని కోప్పడుతుంది. ఇక నిరూపమ్ తో రేపు ఏ పని పెట్టుకోకురా.. మా ఫ్రెండ్ వాళ్ల అమ్మాయిలు వస్తున్నారు’ అంటుంది. అంటే డైరెక్ట్ గా నిరూపమ్ కు పెళ్లి చూపులు అనే విషయం చెప్పకుండా ఇలా ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మాయిలు వస్తున్నారు అని చెబుతుంది

అమ్మ మీద కోపంతో నిరూపమ్ చేసిన పని :

ఇంతలో నిరూపమ్ మమ్మీ రేపు మేము బయటికి వెళ్తున్నాం కదా ఇంట్లో ఉండడం కుదరదు అంటాడు.ఎక్కడికి? ఎవరితో?’ అంటుంది స్వప్న. ‘హిమ, నేను, జ్వాల ముగ్గురం కలిసి నాగార్జునసాగర్ వెళ్తున్నాం’ అంటాడు నిరుపమ్.ఆ మాటకు స్వప్న మరింత రగిలిపోతుంది. ‘రేపు నువ్వు ఉండాల్సిందే’ అంటూ పెద్ద గొడవే చేసి. వెళ్ళిపోతుంది. ఇక నిరుపమ్ కూడా తినకుండానే ప్లేట్ విసిరికొట్టి లోపలకిి వెళ్లిపోతాడు.సీన్ కట్ చేస్తే జ్వాల సత్యకు భోజనం తీసుకుని వెళ్లి ‘సార్ రేపు నేను ఊరు వెళ్తున్నాను రేపు ఒక్కరోజు మీరు హోటల్లో తినేస్తారా ప్లీజ్’ అంటుంది. సరేనమ్మా అంటాడు సత్య.

స్వప్న చేసిన పనికి కోపంలో సౌందర్య:

మరునాడు ఉదయాన్నే నాగార్జున సాగర్ వెళ్ళాడనికి అందంగా రెడీ అవుతారు హిమ, జ్వల లు. ఇక హిమ బయటికి వెళ్లేసరికి నిరుపమ్ వస్తాడు. ‘సారీ హిమా నేను రాలేను హాస్పిటల్ లో. అర్జెంటు పని ఉంది అంటాడు. సర్లే బావ మరోసారి వెళ్దాం లే.. ఈ విషయం జ్వాలకి కూడా చెప్పేసి వస్తాను’ అంటూ హిమ అంటుంది. ఇంతలో అక్కడకు సౌందర్య వచ్చి ‘ఇప్పుడు నిజం చెప్పు నిరుపమ్’ అని అడుగుతుంది.మమ్మీ ‘రేపు ఎక్కడికీ వెళ్లొద్దు..’ అని తన మీద ఒట్టుపెట్టుకున్న విషయం చెబుతాడు నిరుపమ్. దాంతో సౌందర్య కోపంతో రగిలిపోతుంది. అదేంటి అలా తయారు అయింది అని కోపడుతుంది.

ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిందని బాధలో జ్వాల :

మరోపక్క జ్వాల ఆటో తీసుకుని రవ్వ ఇడ్లి ఉంటే టిఫిన్ బండి దగ్గరకు వెళ్తుంది. జ్వాలని చూసిన ఆనంద్ ‘చాలా అందంగా రెడీ అయ్యావ్ ఏంటి సంగతి అంటాడు. ఆ తింగరీ, డాక్టర్ సాబ్, నేను నాగార్జున సాగర్ వెళ్తున్నాం రా అంటుంది జ్వాల. మరి నన్ను తీసుకుని వెళ్ళారా అంటూ అలుగుతాడు రవ్వ ఇడ్లీ.‘అరే.. ఈసారి పోదాం లేరా.. ఫీల్ అవ్వకు’ అని కవర్ చేస్తుంది జ్వాల. ఇంతలో హిమ వచ్చి మీ డాక్టర్ సాబ్‌కి ఏదో ఆపరేషన్ చేయాల్సిన పని పడిందట జ్వాలా.. మనం మరో రోజు వెళ్దాం’ అని చెబుతుంది. దాంతో జ్వాల కాస్త ఫీల్ అవుతుంది.
ఇక సౌందర్య.. ఆవేశంగా సత్య దగ్గరకు వెళ్లి.. ‘సత్యం.. నిరుపమ్‌కి స్వప్న సంబంధాలు చూస్తుందట.. ఆపుదాం పదా’ అంటుంది. వద్దు అత్తయ్యా నేను రాను మీరు వెళ్లి ఆపండి అంటాడు.

హిమ బొమ్మ గియించడానికి గీత దగ్గరకు తింగరిని తీసుకువెళ్లిన జ్వాల :

సీన్ కట్ చేస్తే ఎలాగో ప్రోగ్రాం క్యాన్సిల్ అయింది కదా పదా ఆటో ఎక్కు అని హిమను ఆ గీత ఆర్టిస్ట్ దగ్గరకు తీసుకుని వెళ్తుంది సౌర్య. పాపం హిమ తప్పనిసరి పరిస్థితులలో ఆటో ఎక్కుతుంది.ఇక జ్వాల.. హిమ చేయి పట్టుకుని మరీ గీత క్యాబిన్ దగ్గరకు తీసుకుని వెళ్తుంటే హిమ మాత్రం మనసులో చాలా మదనపడుతుంది. ఇప్పుడు ఆమె నా బొమ్మ గీసి చూపిస్తే సౌర్య రీయాక్షన్ ఎలా ఉంటుందో అని ఆలోచిస్తుంది.నిజం తెలిసి కూడా చెప్పనందుకు నామీద మరింత కోపం పెంచుకుంటుందా? ఏం చెయ్యాలి నేను అనుకుంటుంది.


Share

Recent Posts

గుండెకు హత్తుకునే సినిమాలు చేయాలి అంటున్న బండ్ల గణేష్..!!

మహమ్మారి కరోనా వైరస్ వచ్చాక ప్రపంచంలో అనేక మార్పులు చోటు చేసుకోవడం తెలిసిందే. ఈ వైరస్ దాటికి అనేక రంగాలు కుదేలు అయిపోయాయి. ముఖ్యంగా సినిమా రంగం…

21 mins ago

నేను గొర్రెల మంద టైప్ కాదు జబర్దస్త్ షోపై అనసూయ వైరల్ కామెంట్స్..!!

యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టెలివిజన్ రంగంలో మరియు సినిమా రంగంలో ఇప్పుడు ఓటీటీలో వరుస ఆఫర్లు అందుకుంటూ సక్సెస్ ఫుల్ కెరియర్ కొనసాగిస్తుంది.…

1 hour ago

వరంగల్ “లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో హీరో విజయ్ దేవరకొండపై పొగడ్తల వర్షం కురిపించిన పూరి..!!

ఆదివారం వరంగల్ లో "లైగర్" ప్రమోషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులతోపాటు సినిమా యూనిట్ సభ్యులు హాజరయ్యారు. హీరో విజయ్ దేవరకొండ తో…

2 hours ago

“లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో మైక్ టైసన్ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పిన పూరి..!!

"లైగర్" ప్రమోషన్ కార్యక్రమాలు చాలా చురుగ్గా జరుగుతున్నాయి. ఆగస్టు 25వ తారీకు సినిమా విడుదలవుతున్న తరుణంలో ఆగస్టు 13 వరకు ఉత్తరాదిలో విజయ్ దేవరకొండతో పాటు హీరోయిన్…

3 hours ago

హీరోయిన్ల‌కే అసూయ పుట్టిస్తున్న బ‌న్నీ స‌తీమ‌ణి.. లెటేస్ట్ పిక్స్ చూస్తే మైండ్‌బ్లాకే!

అల్లు వారి కోడ‌లు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స‌తీమ‌ణి స్నేహా రెడ్డి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బ‌న్నీ, స్నేహాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2011లో…

4 hours ago

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం .. తెలుగు రాష్ట్రాల్లో ఆ కుటుంబాలకు గుడ్ న్యూస్

దేశ వ్యాప్యంగా సోమవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు ప్రభుత్వాలు సిద్ధమైయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు…

5 hours ago