karthika deepam: మోనిత చేసిన పనికి రగిలిపోతున్న కార్తీకదీపం ఫ్యాన్స్ …!

Share

karthika deepam: రెండు తెలుగు రాష్ట్రాలలో కార్తీక దీపం సీరియల్ ను ఆదరించే వారు చాలామందినే ఉన్నారు. కార్తీకదీపం సీరియల్ వస్తుందంటే చాలు అన్ని పనులు పక్కన పెట్టి మరి సీరియల్ లో మునిగిపోతారు. దీప, కార్తీక్ ఇద్దరూ కలవాలని అందరు ఎప్పటినుంచో కోరుకుంటూన్నారు.ప్రేక్షకుల బాధని అర్ధం చేసుకుని వారి ఇరువురుని కలిపినట్టే కలిపి మళ్ళీ విడదీసేసారు. దీనితో ప్రజలు ఆగ్రహానికి గురి అవుతున్నారు.ఇప్పుడు ఏమి జరుగుతుందో తెలియని అయోమయంలో పడి పోయారు. అసలు సీరియల్ ఎటువైపు వెళుతుందో కూడా తెలియడం లేదు.

Vomting Sensation: వాంతులు అవుతాయని ప్రయాణం చేయటం మానేస్తున్నారా..!? అయితే ఈ జాగ్రత్తలు పాటించండి చాలు..

దీపకు పది మార్కులు ఇచ్చిన డాక్టర్ బాబు :

ఈరోజు ఎపిసోడ్ లో దీప అందరికి భోజనం వడ్డిస్తూ ఉండగా నా వంటకు ఎన్ని మార్కులు ఇస్తారు అని అడగగా సౌందర్య తొమ్మిది మార్కులు అని చెబుతుంది.ఆ తరువాత డాక్టర్ బాబును అడిగితే కాసేపటికి పదికి పది అంటాడు. దీప మాత్రం నవ్వుతూ మీరు అన్నీ అబద్ధాలు చెబుతున్నారు డాక్టర్ బాబు అంటుంది. అసలు దీప బిహేవియర్ ఏంటో అని అర్ధం కాకా ముగ్గురు ఆలోచనలో పడతారు.

Tea Or Coffee: టీ, కాఫీ లలో ఏది మంచిది..!?
సీన్ లోకి ఆదిత్య :

సీన్ కట్ చేస్తే చెల్లాచెదురుగా పడి ఉన్న ఇంటిని చదరమని ప్రియమణిని పిలిచి క్లాస్ పీకుతుంది మోనిత .అసలు ఇంత హడావిడి చేస్తున్నారు ఇంటికి ఎవరు వస్తున్నారమ్మా అని మోనితను ప్రియమణి అడుగుతుంది. ఈలోపు ఆదిత్య ఎంటర్ అవుతాడు ఆదిత్య వచ్చి అన్నయ్య ఎక్కడ? అన్నయ్య వస్తాడని చెప్పావ్ అంటాడు. అలా చెప్పకపోతే నువ్వు నా ఇంటికి ఎందుకు వస్తావ్ అని అంటుంది. నీతో కొన్ని విషయాలు చెప్పాలి అందుకే రమ్మన్నా అంటుంది. ఆదిత్య చిరాకుగా మోనిత మాటలు వినడు. నాకు బాబు పుట్టాడు అని మోనిత ఆదిత్యకు చూపిస్తుంది. తన డెలివరీ టైంలో కార్తీక్ స్వయంగా వచ్చి భర్తహోదాలో సంతకం చేశాడు తెలుసా అని జరిగింది మొత్తం చెబుతుంది. ఆదిత్య నేను నమ్మను అంటే..దోషనివారణ పూజలో కార్తీక్, అత్తయ్య కూడా ఉన్నారు చూడు అని ఫోటోలను చూపిస్తుంది.నిజానికి అందరికి చెప్పినట్లు ఈ గర్భం ఆర్టిఫీషియల్ ఇన్సెమ్యూనేషన్ కాదు మీ అన్నయ్యే బాగా తాగి వచ్చి నాకు గర్భం చేసాడు. అందిరి పరువు పోతుందని నేనే అలా చెప్పాను అని ఆదిత్యకు ఎక్కేస్తుంది.


Amaravathi: మూడు రాజధానులకు ప్రజామోదం..! ఇదే సాక్షం అంటున్న మంత్రి కన్నబాబు..!!

నడి రోడ్డుపై అన్నని నిలదీసిన తమ్ముడు :

మోనిత మాటలు విన్న ఆదిత్య దీప గురించి తలుచుకుంటూ బైక్ తీస్తాడు.కార్తీక్ (Karthik) ఎక్కడినుంచో వస్తూ కార్ ట్రబుల్ ఇవ్వడంతో రోడ్ మీద ఆగుతాడు. అదే రూట్ లో వస్తున్న ఆదిత్య కార్తీక్ ను చూసి చూడగానే రెచ్చిపోతాడు. మోనిత ఇంటికి వెళ్లాను, తను నాకంతా చెప్పేసింది, నా కంటే పెద్దో‍‍డివైపోయావ్, లేకపోతే కాలర్ పట్టుకోని కడిగేయాలని ఉంది అని అంటాడు.ఇంటి పురువు నడిరోడ్డుమీద పెట్టావ్ అసలు దీప వదినను ఏం చేస్తావ్, వదిలేస్తావా అంటాడు. కార్తీక్ కోపంతో ఆదిత్యను కొట్టబోతే కొట్టు అన్నయ్య కొట్టు, నువ్వు చేసిన ఎదవ పనులును ప్రశ్నిస్తే నడిరోడ్డుమీద కొడతావా అంటాడు.మోనిత చావుబతుకుల్లో ఉంది అంటే మానవత్వంతో మమ్మీ తీసుకెళ్లింది అంటాడు కార్తీక్. మరి ఈ విషయాలు వదినకు తెలుసా అంటే తెలుసు అంటాడు కార్తీక్. మొత్తానికి మోనిత అన్నదమ్ముల మధ్య చిచ్చు రాజేసిందనే చెప్పాలి. !


Share

Related posts

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమా తక్కువ టైం లో కంప్లీట్ చేయటం కోసం హరీష్ శంకర్ సరికొత్త ప్లాన్..??

sekhar

మెహబూబ్ కి కళ్ళు చెదిరే ఛాన్స్ ఇచ్చిన మెగాస్టార్..??

sekhar

ఫైనల్ గా మహేశ్ భట్ తో తనకి ఉన్న రిలేషన్ ఎంతో బయటపెట్టిన రియా?

GRK