NewsOrbit
న్యూస్

Karthika Deepam Feb 14 Today Episode: దీప, కార్తీక్ ల పెళ్లిని మోనిత అడ్డుకుంటుందా..?

Karthika Deepam Feb 14 Today Episode: బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూసే కార్తీక దీపం లేటెస్ట్ సీరియల్ ఎపిసోడ్ ఈరోజు విడుదల కాదు. మళ్ళీ తిరిగి ఈరోజు అంటే సోమవారం రోజున టెలికాస్ట్ అవుతుంది. మరి కార్తీక దీపం సీరియల్ సోమవారం ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఒక లుక్ వేద్దామా.అందరూ సౌందర్య ఇంట్లో కూర్చుని ఎంచక్కా మాట్లాడుకుంటుంటే అప్పుడే సౌర్య ఆనంద్ అచ్చం చూడటానికి నాన్నలాగే ఉన్నాడు కదా అని అంటుంది. దీంతో దీప,సౌందర్య తప్పు సౌర్య అలా అనకూడదు అంటారు.

Neha Shetty: డీజే టిల్లు హీరోయిన్ భావోద్వేగం.. నేడు నా హృదయం ముక్కలైంది?

Karthika Deepam Feb 14 Today Episode: ఆనంద్ అచ్చం కార్తీక్ లాగానే ఉన్నాడు అన్నా సౌర్య :

వీడు కూడా ఇప్పటి నుంచి మన ఇంటి సభ్యుడే అని సౌందర్య అనగానే ఇప్పటి నుంచి మేము ఆనంద్ ను తమ్ముడు అనే పిలుస్తాం అంటుంది హిమ. మనమంతా ఎక్కడికైనా వెళ్లి పార్టీ చేసుకుందామా అంటే ఇంట్లోనే మనం గ్రాండ్ పార్టీ చేసుకుంటున్నాం అని చెబుతుంది సౌందర్య. దీంతో ఏం పార్టీ అని అందరూ అడుగుతారు..మరోవైపు కార్తీక్ ఇంటికి వెళ్లి బయటి నుంచి ఓ లుక్కేసుకొని వెళ్తుంది మోనిత.ఇల్లంతా రంగుల లైట్స్ తో వెలిగిపోవడంతో అది చూసి మోనిత షాక్ అవుతుంది. అయినా కార్తీక్ వచ్చిన విషయం తనకు తెలియక వెళ్ళిపోతుంది.

Assembly Polls 2022: మూడు రాష్ట్రాల్లో ప్రారంభమైన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్..
దీప, కార్తీక్ లకు మరోసారి పెళ్లా?? మోనిత జరగనిస్తుందా..?

సీన్ కట్ చేస్తే కార్తీక్, దీప పెళ్లి రోజు వేడుకల కోసం అందరూ రెడీ అవుతుంటారు. పిల్లలు అయితే అమ్మానాన్నలకు పెళ్లి రోజు విషెస్ చెప్పడానికి గ్రీటింగ్ కార్డ్స్ రెడీ చేస్తుంటే ఇంతలో సౌందర్య వచ్చి ఏంటవి అంటే అసలు విషయం చెప్తారు. నానమ్మ డాడీ పెళ్లిని ఘనంగా చేశారు కదా అని అంటే మాకు మీ డాడీ పెళ్లి చేసే అదృష్టం మాకు దక్కలేదు అని వాళ్లిద్దరూ గుడిలో పెళ్లి చేసుకొని వచ్చారు అంటుంది.అప్పుడు దీప ఇంట్లో కాలు పెట్టే అప్పుడు దీప పట్ల సౌందర్య ప్రవర్తించిన తీరు తలుచుకుని బాధపడుతుంది సౌందర్య.ప. దీప గొప్పదనాన్ని అర్థం చేసుకున్నాను. దీప కాబట్టి పెద్దోడిని ఓపికగా భరించింది అని అనుకుంటుంది సౌందర్య.పిల్లలు పెళ్లిరోజు అని మీ అమ్మా నాన్నలకు చెప్పకండి వాళ్ళకి సర్ప్రైజ్ పార్టీ ఇద్దాం అంటుంది సౌందర్య. ఇక ఇంటినంతా డెకరేట్ చేయడంతో కార్తీక్ షాక్ అయ్యి మమ్మీ.. ఏంటిది ఈ హడావుడి ఏంటి అని అడుగుతాడు.దీంతో పెళ్లి రోజు శుభాకాంక్షలు పెద్దోడా అని అంటుంది సౌందర్య.

దీప దగ్గర సౌందర్య తీసుకున్న మాట ఏంటి.?

ఈరోజు మా మ్యారేజ్ డే కదా మరిచిపోయాను అంటాడు కార్తీక్. అప్పుడు నీ పెళ్లిని మేము చూడలేకపోయాం కదా.. అందుకే ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నాం అంటుంది సౌందర్య.మరోవైపు దీప కూడా పెళ్లి కూతురుగా రెడీ అవుతుంది.దీపను చూసి సౌందర్య ముచ్చటపడుతుంది.ఏంటి అత్తయ్య ఎందుకు ఇలా రెడీ అవ్వమన్నారు అంటే..పెళ్లి రోజు శుభాకాంక్షలు దీప అంటుంది సౌందర్య. పెళ్లికి ముందు ఆ తర్వాత కూడా నీకు కష్టాలే వచ్చాయి. నీ కష్టాలన్నీ ఇంతటితో పోవాలని ఆ ఈశ్వరుడిని కోరుకుంటున్నాను అని అంటుంది సౌందర్య. అలాగే మమ్మల్ని ఇంకెప్పుడూ వదిలిపెట్టి వెళ్లమని ఒట్టేసి చెప్పు అంటుంది సౌందర్య.ఇక మోనిత ఇంట్లో కూర్చుని తెగ ఆలోచిస్తూ ఉంటుంది.

మోనితకు అసలు నిజం. తెలిసి కోపంతో ఏమి చేసిందంటే..?

మోనిత ఇంట్లో పనిచేస్తున్న లక్ష్మణ్ భార్య అరుణ బయట బట్టలు ఆరవేస్తుంటే అప్పుడే బిచ్చగాడు అయిన మహేష్ అక్కా అంటూ ఎంట్రీ ఇస్తాడు.. ఇక లక్షణ్ భార్య తాగుమోతు సచ్చినోడా మళ్ళీ దాపరించావా అంటూ తిడుతుంది అరుణ.నువ్వు మారవురా అని చెప్పి అక్కడి నుంచి మోనిత ఇంట్లోకి వెళుతుంది.మహేష్ కూడా అరుణతో పాటు మోనిత ఇంట్లోకి వెళ్తాడు. అక్కడ మోనిత బిచ్చగాడును చూసి ఎవరు ఈ తాగుబోతు అని అడుగుతుంది నా తమ్ముడు అమ్మా తాగుబోతు చచ్చినోడు అని చెబుతుంది అరుణ.నమస్తే మేడమ్ అంటాడు మహేశ్. దీంతో చీ పక్కకెళ్లు అంటుంది మోనిత. ఇంతలో ఇంట్లో కార్తీక్ ఫోటోను చూస్తాడు మహేశ్. అక్క ఈ సారు ఫోటో ఇక్కడ ఉందేంటి అని అడుగుతాడు మహేశ్.కార్తీక్ నీకు తెలుసా అని షాక్. లో కుర్చీ లో నుంచి పైకి లేస్తుంది.మరోవైపు కార్తీక్, దీప పెళ్లి రోజు వేడుకలు ఘనంగా జరుగుతుంటాయి.కార్తీక్, దీపకు మళ్లీ పెళ్లి చేయిస్తుంది సౌందర్య. ఇంతలో మోనిత అక్కడికి వచ్చి ఆ పెళ్లిని చూసి చప్పట్లు కొడుతుంది. మోనితను చూసి అందరూ కూడా షాక్ అవుతారు. కార్తీక్, దీపలను చూసి మోనిత రచ్చ రచ్చ చేయనుంది అనే విషయం అర్ధం అవుతూనే ఉంది.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!