Karthika Deepam Feb 7 Today Episode: కార్తీక దీపం సీరియల్ కోసం బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తూ ఉంటారు. ఎందుకంటే కార్తీక దీపం సీరియల్ అంటే ప్రేక్షకులకు అంత అభిమానం మరి. అలాగే ఈ సీరియల్. కూడా రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ ప్రేక్షకుల ఆదరణ పొందుతుంది.
గత ఎపిసోడ్ లో మోనిత, భారతి ఇద్దరూ కూడా డాక్టర్ అంజలి వాళ్ళ పాప బర్త్డే డే ఫంక్షన్ కి వస్తారు అదే సమయంలో అక్కడికి దీప, కార్తీక్ వంటలు చేయడానికి రావడం, కార్తీక్ నా భర్త అని మోనిత చెప్పడం, ఇక అంజలి కార్తీక్ గారు మా హాస్పిటల్ కి వచ్చారని చెప్పడంతో మోనితకి కార్తీక్ గురించి ఆజూకి తెలిసిందని సంబరపడుతుంది. ఫంక్షన్ అయ్యాక కార్తీక్ ను వెతుకుదాం అనుకుని వంటలు చేసే దగ్గరికి వెళ్లి అక్కడ ఉన్న కార్తీక్ ను చూసి షాక్ అవుతుంది. అక్కడితో గత ఎపిసోడ్ అయిపోతుంది.ఇక ఈరోజు ఎపిసోడ్ కూడా ఇదే సీన్ తో ఓపెన్ అవుతుంది.
Taliban’s: నడిరోడ్డు పై వాళ్లకి నరకం చూపించేస్తున్న తాలిబాన్ లు..!!
Karthika Deepam Feb 7 Today Episode: కార్తీక్ ను చుసిన మోనిత ఏమి చేయనుదంటే..?
ఇక మోనిత చిరాకు పడుతూ వంటలు చేసే దగ్గరకు వెళుతుంది.అక్కడ వంట చేస్తున్న కార్తీక్ ను చూసి షాక్ అయ్యి వెంటనే ఆ విషయాన్ని భారతికి చెప్పడానికి లోపలికి వెళుతుంది. మోనిత మాటలు విని భారతి కూడా చూడడానికి వస్తుంది. కానీ అక్కడ మాత్రం కార్తిక్ ఉండడు.అదే షర్ట్ వేసుకుని వేరే వంట మనిషి ఉంటాడు.దాంతో భారతి, మోనితని ఎవర్నో చూసి కార్తీక్ అంటావేంటి అని తిట్టి అక్కడి నుంచి మోనితను తీసుకుని వెళుతుంది. మోనిత భారతిని తీసుకుని వచ్చే సమయానికి నిజంగానే కార్తీక్ అక్కడ ఉండడు. సీన్ కట్ చేస్తే దీప ఇంట్లో వాళ్లందరికి టీ ఇవ్వడానికి లోపలికి వెళుతుంది.
Virat Kohli: వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన క్రికెటర్ విరాట్ కోహ్లీ..!!
భారతి, మోనితలను చుసిన దీప..వాళ్ళకి కనపడకుండా తప్పించుకుంటుందా..?
సరిగ్గా ఆ సమయామలోనే భారతి ఫోన్ మాట్లాడుతూ ఉండగా భారతికి దీప టీ ఇవ్వడానికి వెళ్లి భారతిని చూసి సైలెంట్ గా అక్కడ నుంచి తప్పుకుంటుంది.అలాగే అక్కడే ఉన్న క మోనితను కూడా చూసేస్తుంది దీప.ఎలాగోలా అక్కడినుంచి దీప తప్పించుకొని కార్తీక్ దగ్గరికి వచ్చి మోనిత, భారతిలను చూశానని వాళ్ళు ఇక్కడే ఉన్నారని చెప్పి ఎలాగైనా మనం ఇక్కడ నుంచి తప్పించుకోవాలి అని చెబుతుంది. వంటలు మధ్యలో ఆపేసి ఎలా వెళ్తాము దీప.మనకు ఇంత సహాయం చేసిన డాక్టర్ అంజలికి ఇచ్చిన మాట తప్పుదామా అది కరెక్ట్ కాదు అని చెబుతాడు. దీప మాత్రం కంగారు పడుతూనే వాళ్ళు ఎక్కడ చూస్తారో అని నాకు భయంగా ఉంది అని అంటుంది. అప్పుడు కార్తీక్ వంటలన్నీ త్వరగా పూర్తి చేసి వెళ్దాం అంటాడు.
మోనితకు కేక్ ఇచ్చిన కార్తీక్:
ఇక ఇద్దరు కలిసి వంటలన్నీ పూర్తి చేస్తారు.ఇంతలో అంజలి కార్తీక్ దగ్గరకు వచ్చి కేక్ తిని భోజనం చేసి వెళ్ళండి అని చెబుతోంది. దాంతో కార్తీక్ తన మెడలో కండువాను మాస్క్ లా కట్టుకొని పార్టీ దగ్గరకు వెళతాడు. ఇక అంజలి ఏమో కార్తీక్ ను అందరికి కేక్ ఇవ్వమని చెబుతుంది. ఈ క్రమంలోనే కార్తీక్, మోనితకు కేకు ఇస్తాడు మోనిత కేక్ తీసుకుని కార్తీక్ ను చూసి అంతా నా భ్రమ అనుకుంటుంది.ఇక మోనిత మాత్రం అందరి ముందు డాక్టర్ అంజలిని మీరు హార్ట్ ఆపరేషన్ చేసిన అమ్మాయి ఎవరు? ఆ పాప తాలూకు వివరాలు, వాళ్ళ అమ్మానాన్నల గురించి ఇన్ఫర్మేషన్ చెబుతారా అని అడుగుతుంది.అందుకు అంజలి ఇందాక మీకు కేక్ ఇచ్చి, వంటలు చేశారే వాళ్లే ఆ పాప తల్లిదండ్రులు అని చెప్పడంతో మోనిత షాక్ అవ్వడంతో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.