Karthika Deepam Feb2 Today Episode: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తున్న సీరియల్ కార్తీక దీపం సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ వస్తుంది. నత్త నడకగా సాగుతున్న కార్తీక దీపం సీరియల్. సౌర్య ఆరోగ్య పరిస్థితి బాగోలేని కారణంగా ఒక్కసారిగా ఉపందుకుంది. మరి ఈరోజు ఎపిసోడ్ లో కార్తీక దీపం సీరియల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో చూద్దామా..శౌర్యని హాస్పిటల్ కి తీసుకెళ్లిన కార్తీక్, దీప కంగారు పడుతుంటారు. ఏ డాక్టరూ కూడా సౌర్యకు ట్రీట్మెంట్ చేయడానికి ముందుకు రావడం లేదు. ఇంతలో కార్తీక్ సొంత ట్రీట్మెంట్ మొదలుపెడతాడు.ఇక తన క్యాబిన్ లో కూర్చున్న డాక్టర్ అక్కడ సీసీ ఫుటేజీ ఆధారంగా కార్తీక్ వాళ్ళను చూసి వాళ్ళు ఏం చేస్తున్నారో అని ఆశ్చర్యపోతుంటుంది.
Growth : ఒక ఇల్లు సిరి సంపదలు ,సుఖ సంతోషాలతో తుల తూగులంటే ఈ అంశాలు మీద దృష్టి పెట్టవలిసిందే !!
Karthika Deepam Feb2 Today Episode: సౌర్య కి ట్రీట్మెంట్ మొదలుపెట్టిన కార్తీక్ :
కార్తీక్ ఎవరికీ కనిపించకుండా దీప వాళ్లను అడ్డుగా ఉండమని చెబుతాడు. అక్కడున్న నర్స్ వచ్చి ఏం చేస్తున్నారు..మీరు ట్రీట్మెంట్ ఎలా చేసుకుంటారని క్వశ్చన్ చేస్తుంది. ఇంతలో అక్కడకు వచ్చిన డాక్టర్ మీరు ఇక్కడ ఏం చేస్తున్నారని అడిగి అక్కడున్న స్టాఫ్ నర్స్ పై అరుస్తుంది. హాస్పిటల్ కి వచ్చి అన్నీ మీరే చేసుకుంటే మేం ఎందుకు ఇక్కడ ఎందుకు అంటుంది.మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోండంటుంది డాక్టర్…మరోవైపు మోనిత.. ఆదిత్య ఎప్పటిలాగానే ఒకరికొరు తిట్టుకుంటూ ఉంటారు. ఆ ఇంటికి మరో వారసుడిని ఇచ్చాను అంటూ తన స్టైల్లో వాగుతూ ఉంటుంది. నీకు-మాకు ఎలాంటి సంబంధం లేదు.నాకు మా దీపక్కలా ఓపిక లేదు, నేను మా అమ్మ భాగ్యం టైప్.. ఇక్కడి నుంచి పో అని క్లాస్ వేస్తుంది శ్రావ్య.ఇంకా మోనిత మీ అన్నయ్య, వదిన, పిల్లల్ని వెతక్కుండా గాలికి తిరిగుతున్నారేంటి… మీరే ఎక్కడైనా దాచి పెట్టారా.. మీరంతా ఏం చేసినా ఆ ఇంట్లోకి రావడాన్ని ఆపలేరు.పదిరోజుల్లో కార్తీక్, బాబులతో మీ ముందు ఉంటానని శపథం చేస్తుంది.
Prabhas: ఇక నుండి ఇంటర్నేషనల్ స్థాయిలో ప్రభాస్ సినిమాలు..!!
అసలు ఆ వేరే డాక్టర్ ఎవరు… ఏమి చెప్తాడు?
మరోపక్క డాక్టర్ దగ్గరకు వెళ్లిన దీప-కార్తీక్ ..శౌర్యకి ట్రీట్మెంట్ చేయాలని అడుగుతారు .సొంత వైద్యం చేసుకుని ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారని మండిపడుతుంది. కాసేపు బతిమలాడడంతో మరో డాక్టర్ కి రిఫర్ చేస్తానని చెప్పి డబ్బు ఏర్పాట్లు చేసుకోండి అంటుంది. డాక్టర్ ధనుంజయ్ దగ్గరకు పాపను తీసుకెళ్లండి అని చెబుతుంది. అటు హాస్పిటల్లో శౌర్య పరిస్థితి చూసిన డాక్టర్ ధనుంజయ్…పరిస్థితి సీరియస్ గానే ఉందంటాడు. గతంలో ఇలాంటి ట్రీట్మెంట్ జరిగిందా అంటే హార్ట్ కి సర్జరీ జరిగిందని చెబుతాడు కార్తీక్. ఎవరు చేశారని అడిగితే… డాక్టర్ కార్తీక్ చేశారని చెబుతారు.మీ పాపకి అంత పెద్ద డాక్టర్ ఎలా చేశారు, ఆయన అపాయింట్ మెంట్ కూడా దొరకదు అంటారు. స్పందించిన దీప … కార్తీక్ గారి ఇంట్లో వంటమనిషిగా చేశానంటుంది దీప. అయితే ఈ సర్జరీ చేయడం నా వల్ల కాదు. ఆయనే మళ్లీ రావాలంటాడు.
కార్తీక్ మళ్ళీ డాక్టర్ లాగా మారతాడా
సీన్ కట్ చేస్తే.. కార్తీక్, దీప పక్కకు వెళ్లి మాట్లాడుకుంటారు. ‘ఏంటి దీపా నువ్వు.. నేను ఉన్న స్థితిలో.. ఇప్పుడు సౌర్యకు ఆపరేషన్ ఎలా చెయ్యగలను అనుకుంటున్నావ్?’ అని ఎమోషనల్ అవుతాడు కార్తీక్. వెంటనే దీప ఏడుస్తూ.. చేతులెత్తి దన్నం పెడుతూ.. ‘కార్తీక్ని పెళ్లి చేసుకున్న దీపగా కాకుండా.. సౌర్యకు తల్లిగా అడుగుతున్నాను.. నా కూతురికి ప్రాణ బిక్ష పెట్టండి..’ అంటుంది. కార్తీక్ అప్పటికీ వినిపించుకోపోవడంతో.. ‘మీ కాళ్లు పట్టుకుంటాను..’ అంటూ కార్తీక్ కాళ్ల మీద పడిపోతుంది దీప.