NewsOrbit
న్యూస్

Karthika Deepam Highlights: కార్తీక దీపం సీరియల్ ఈ వారం హై లెట్స్ మీకోసం…!

Share

Karthika Deepam Highlights: కార్తీక దీపం సీరియల్ కధనం ఈ వారం ప్రేక్షకులను బాగా అలరించిందనే చెప్పాలి. ఎప్పటికప్పుడు సరికొత్త కధనంతో ముందుకు సాగుతూ వెళ్తుంది.మరి ఈ వారం కార్తీకదీపం సీరియల్లో జరిగిన హై లైట్స్ ఏంటో ఒక లుక్ వేద్దామా..సౌర్య ఆరోగ్య పరిస్థితి బాగోలేకపోవడంతో డబ్బులు. కోసం ఊరంతా తిరుగుతాడుఇంతలో రుద్రాణి మనుషులు. వచ్చి అక్క నిన్ను తీసుకురమ్మని అంటుంది రా అంటే కార్తీక్నా కూతురుకు ఒంట్లో బాగాలేదు రాను అంటే రౌడీలు వినరు. ఇక తప్పేది లేక కార్తీక్ రుద్రాణి దగ్గరకు వెళ్తాడు.

సంతకం పెట్టాను కదా నేను మీ డబ్బులు కడతాను. నా బిడ్డ ఆరోగ్యం బాలేదని చెప్పడంతో రుద్రాణి ఆగండి సారు అని 5 లక్షలు తెచ్చి ఇస్తుంది. తీసుకుని నీ కూతురుక ట్రీట్ మెంట్ చేయించుకో అంటుంది. నాకు డబ్బులు అవసరం లేదు అని వెళ్ళిపోతాడు. కార్తీక్ ఇంటికి వెళ్లి శౌర్యను అంబులెన్సులో ఆసుపత్రికి తీసుకెళ్తారు.కానీ ఆసుపత్రిలో శౌర్యను చేర్చుకోరు.

Devatha Serial: దేవత సీరియల్ వచ్చేవారం జరిగేది ఇదే..! రాధ దేవిని కలవడానికి మాధవ్ ని ఒప్పిస్తుందా..!?

Karthika Deepam Highlights:  రుద్రాణి మాటలు విని హిమ ఏమి చేసిందంటే?

అప్పుడే అక్కడికి రుద్రాణి వస్తుంది. నేను చెప్పేదాకా వాళ్లు ఆసుపత్రిలో జాయిన్ చేసుకోరు అంటుంది. మీరు కట్టాలిసిన పాత బాకీ మొత్తం రద్దు చేస్తాను. అలాగే శౌర్య ట్రీట్ మెంట్ కోసం కూడా డబ్బులు ఇస్తాను. ఇంకా ఈ డబ్బు కూడా నాకు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు.కానీ అందుకు బదులుగా నాకు హిమను ఇవ్వండి చాలు అంటే దీప డబ్బులు వద్దు అంటుంది.మరోపక్క శౌర్య పరిస్థితి విషమించడంతో తనకు ఎలాగైనా ట్రీట్ మెంట్ చేయించాలని అనుకున్న హిమ అమ్మా నాన్నలకు చెప్పకుండా రుద్రాణి దగ్గరకు వెళ్లి నేను ఇక్కడే మీతోనే ఉంటాను అంటుంది. దయచేసి శౌర్యకు ట్రీట్ మెంట్ చేయించండి అని రుద్రాణిని బతిమిలాడుతుంది. హిమను చూసి రుద్రాణి చాలా సంతోషిస్తుంది.

Devatha Serial: దేవత సీరియల్ వచ్చేవారం జరిగేది ఇదే..! రాధ దేవిని కలవడానికి మాధవ్ ని ఒప్పిస్తుందా..!?

హిమను వెతుక్కుంటూ రుద్రాణి ఇంటికి వచ్చిన దీప :

హిమను వెతుక్కుంటూ దీప రుద్రాణి ఇంటికి వస్తుంది అక్కడ హిమను చూసి ఆవేశంగా రుద్రాణికి సమాధానం చెప్పి హిమని తీసుకుని వెళ్లిపోతుంది.ఊర్లో కనిపించిన ప్రతి ఒక్కర్ని వడ్డీకి డబ్బులిస్తారా అని అడుగుతుంది. కానీ ఎవ్వరు సహాయం చేయరు.ఇక సౌర్యను మరో హాస్పిటల్లోకి తీసుకుని వెళ్తారు.అప్పారావ్ చెప్పిన అడ్రస్ ప్రకారం దీప హాస్పిటల్ కి వెళుతుంది. కానీ ఎంతసేపటికి సౌర్యను హాస్పిటల్లో ఎవ్వరు పట్టించుకోరు.సౌర్యను చూసి దీప, హిమ ఒక్కటే ఏడుస్తూ ఉంటారు.

Deepti Sunaina: ఇంటర్నెట్‌ను ఊపిస్తోన్న దీప్తి హాట్ హాట్ ఫొటోలు.. అమ్మడు అస్సలు తగ్గడం లేదు.!

కార్తీక్ నేను డాక్టర్ అనే నిజం చెప్పేస్తాడా..?

ఇప్పుడే వస్తాను ఇక్కడే ఉండండని చెప్పి కార్తీక్ బయటకు వెళ్లి తన దగ్గరున్న డబ్బులతో శౌర్యకి కావలిసిన మందులు కొని తెస్తాడు.ఎవరు పట్టించుకోకపోవడంతో కార్తీక్ ఎవరికీ కనిపించకుండా దీప వాళ్లను అడ్డుగా ఉండమని సొంతంగా ట్రీట్మెంట్ మొదలుపెడతాడు .ఇంతలో అక్కడకు వచ్చిన డాక్టర్ మీరు ఇక్కడ ఏం చేస్తున్నారని అడిగి అక్కడున్న స్టాఫ్ నర్స్ పై అరుస్తుంది. డాక్టర్…మరోవైపు మోనిత.. ఆదిత్య ఎప్పటిలాగానే ఒకరికొరు తిట్టుకుంటారు.

ఇక మోనిత పదిరోజుల్లో కార్తీక్, బాబులతో మీ ముందు ఉంటానని శపథం చేస్తుంది.మరోపక్క డాక్టర్ దగ్గరకు వెళ్లిన దీప-కార్తీక్ ..శౌర్యకి ట్రీట్మెంట్ చేయమని కాసేపు బతిమలాడడంతో మరో డాక్టర్ కి రిఫర్ చేస్తానని చెప్పి డబ్బు ఏర్పాట్లు చేసుకోండి అంటుంది. డాక్టర్ ధనుంజయ్ దగ్గరకు పాపను తీసుకెళ్లండి అని చెబుతుంది.సౌర్యను చూసిన డాక్టర్ ఈ సర్జరీ చేయడం నా వల్ల కాదు.కార్తీక్ గారే మళ్లీ రావాలంటాడు. నేను ఆయన ఇంట్లో వంట చేశాను. ఎలాగయినా ఆయన్ని తీసుకొస్తాను అంటుంది దీప.

Lata Mangeshkar : దిగ్గజ గాయని లతా మంగేష్కర్ ఇక లేరు… శోక సంద్రంలో మునిగిన సంగీత ప్రపంచం!
డాక్టర్ గా మారిన కార్తీక్… కూతురు ప్రాణాలు కాపాడతాడా..?

సీన్ కట్ చేస్తే.. కార్తీక్, దీప పక్కకు వెళ్లి డాక్టర్ బాబు మీకు చేతులెత్తి దన్నం పెడుతూ.. ‘కార్తీక్‌ని పెళ్లి చేసుకున్న దీపగా కాకుండా.. సౌర్యకు తల్లిగా అడుగుతున్నాను.. నా కూతురికి ప్రాణ బిక్ష పెట్టండి..’ అంటుంది.మరోపక్క మోనిత ఇంటికి భారతి వస్తుంది.నా ఫ్రెండ్ అంజలి వాళ్ళ పాప పుట్టినరోజు ఊరు వెళ్తున్న నువ్వు వస్తావా అంటే సరే నేను కూడా వస్తానంటుంది.మరోవైపు శౌర్యకి ఆపరేషన్ చేయడానికి కార్తీక్ సిద్ధమవుతాడు. డాక్టర్ కార్తీక్ గారు వచ్చారని ఓ నర్స్ వెళ్లి డాక్టర్ అంజలికి చెబుతుంది. కార్తీక్ డాక్టర్ లాగా వచ్చి సౌర్యకు ఆపరేషన్ చేసి తన కూతురు ప్రాణాలను కాపాడుకుంటాడు.మరోపక్క డాక్టర్ అంజలి ఈరోజు మా పాప పుట్టినరోజు మా ఇంట్లో మీరు వంటలు చేస్తారా అని దీపవాళ్ళను అడిగితే సరే అంటారు.

వంటలు చేస్తున్న కార్తీక్ ను మోనిత చూస్తుందా..?

ఇటు మోనిత, భారతి కూడా అంజలి వాళ్ళ పాప బర్త్ డే ఫంక్షన్ కి ఆంజలి వాళ్ళ ఇంటికి వస్తారు.మరోవైపు కార్తీక్ , దీపలు అంజలికి ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళ ఇంట్లో వంట చేయడానికి బయలు దేరుతారు.మోనిత మెడలో ఉన్న మంగళసూత్రాన్ని  అంజలి చూసి మీకు పెళ్లి అయ్యిందా అని అడుగుతుంది.మోనిత, అంజలికు డాక్టర్ కార్తీక్ నా భర్త అని చెప్పగానే షాక్ షాక్ అవుతుంది.ఆ తర్వాత అంజలి డాక్టర్ కార్తీక్ గారు మా హాస్పిటల్ కి వచ్చి ఒక సర్జరీ కూడా చేసారని చెబుతుంది. దాంతో మోనిత కూడా ఆశ్చర్యపోతుంది.ఇక కార్తీక్ అదే ఊర్లో ఉన్నడని తెలిసిన మోనిత ఆనందానికి అవధులు ఉండవు. వంటలలో ఉప్పు, కారం సరిపోయిందో లేదో చూడండి అని భారతికి చెప్పి అంజలి వెళ్ళిపోతుంది ఇక మోనిత వంటల దగ్గరికి వెళ్ళి అక్కడ వంటలు చేస్తున్న కార్తీక్ ను చూసి షాక్ అవుతుంది.


Share

Related posts

RRR: ఎన్టీఆర్ క్రేజ్‌కు తట్టుకోలేకపోతున్న టాలీవుడ్ హీరోలు..

GRK

Ghani: పవన్‌కు ‘తమ్ముడు’, వరుణ్‌కు ‘గని’..అంటూ అంచనాలు పెంచేసిన మేకర్స్..

GRK

Panchayat polls : హోంమంత్రి ఇలాకాలో ఘర్షణలు

somaraju sharma