NewsOrbit
న్యూస్

Karthika Deepam Highlights: ఈ వారం కార్తీకదీపం సీరియల్ హై లైట్స్ మీకోసం!

Karthika Deepam Highlights: బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూసే కార్తీకదీపం సీరియల్ ఈ వారం ఎంతో రసవత్తరంగా సాగింది. మరి ఈ వారం కార్తీకదీపం సీరియల్ హై లైట్స్ ఏంటో ఒకసారి చూద్దామా.. ఆనంద్ మోనిత కొడుకు అని దీప నిజం తెలుసుకున్న దీప ఆనంద్‌ని పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. అత్తయ్యకు కూడా ఈ విషయం తెలిసే ఉంటుంది అని దీపకు అర్ధం అవుతుంది.నిజం తెలిసి మాకు చెప్పలేక తనలో తానే ఎంత బాధపడుతున్నారో అంటూ దీప బాధపడుతుంది.మరోవైపు ఇంటికి వచ్చిన మోనితను దీప గోరంగా అవమానిస్తుంది అది తలుచుకుని మోనిత కోపంతో రగిలిపోతుంది.ఇంటికి వచ్చిన మోనిత బాబు ఉన్న బొమ్మ ఉయ్యలను బయట పడేయమని విన్నికి చెప్తుంది.సీన్ కట్ చేస్తే ఆనంద్ గురించి తలుచుకుంటూ పైన కుర్చీలో వీళ్లంతా ఆనంద్ మోనిత కొడుకని తెలియక ప్రేమని పెంచేసుకుంటున్నారు’ అంటూ తలపట్టుకుంటుంది.

Karthika Deepam Today Episode: సౌందర్య ప్లాన్ మాములుగా లేదుగా.. మోనితకు దిమ్మతిరిగడం గ్యారంటీ..!

Karthika Deepam Highlights: మోనిత వ్యూహంలో చిక్కుక్కున దీప,సౌందర్య :

ఇక దీప ఆనంద్‌ని తీసుకుని సౌందర్య దగ్గరకు వచ్చి సౌందర్య కాళ్ల దగ్గర కూర్చునివీడు మోనిత కొడుకు అని మీకు ముందే తెలుసు కదా అత్తయ్యా అంటూ ఏడుస్తుంది. అంతేకాకుండా మోనిత బిడ్డ మన దగ్గర ఉన్నాడనే తెలిసి కార్తీక్ తో నాటకం ఆడుతుందని చెప్పడంతో సౌందర్య షాక్ అవుతుంది.ఇద్దరు కూడా మోనిత పన్నిన పద్మవ్యూహం నుండి ఎలా బయటపడాలో తెలియక ఏడుస్తూ ఉంటారు.

Karthika Deepam Mar 4 Today Episode: మోనిత నటి అయితే సౌందర్య మహా నటి అని ఈ సీన్ చూస్తేనే అర్ధం అవుతుంది..!!
కార్తీక్ ను ఇంటికి రప్పించుకున్న మోనిత.!

మరోపక్క మోనిత కార్తీక్‌కి దగ్గర అవ్వడానికి కాలు నొప్పి చేసిందని నాటకం కార్తీక్ ను ఇంటికి రమ్మని అడుగుతుంది. ఇంటికి వస్తే బాబుకు సంబందించిన కొన్ని ఆధారాలు ఇస్తానని చెప్పడంతో కార్తీక్ మోనిత ఇంట్లో అడుగుపెడతాడు. కార్తీక్ కు మోనిత పూలతో ఆహ్వానం చెబుతుంది. కానీ కార్తీక్ మాత్రం ఇంట్లోకి రావడంతోనే గుళ్లో బాబుకు పూజ చేసిన ఫోటో చూసి కోపంతో మోనిత మీద అరుస్తాడు. నా ఆనందం కోసం అది పెట్టుకున్నాను అంటుంది. సరే ‘కార్తీక్ మనం ఆసుపత్రికి వెళ్లాలి అక్కడొక లిస్ట్ తీసుకోని బాబును ఎవరు ఎట్టుకెళ్లారో తెలుసుకోవాలి అని ఇద్దరు వెళ్తారు.ఇక కార్తీక్, మోనితలు దగ్గరలో ఉన్న ఆసుపత్రుల్లో ఆ రోజు డెలివరీకి వచ్చిన వాళ్ల లిస్ట్‌లు తీసుకుంటూ ఉంటారు.అయితే మోనిత ముందుగానే ఆ లిస్ట్ లో నుంచి శ్రీవల్లి కోటేష్‌ల పేర్లు తీసేస్తుంది.

ఆనంద్ ను తనకు ఇచ్చేయమని కార్తీక్ ను అడిగిన మోనిత :

ఇక మోనిత ఒకవేళ బాబు దొరకకపోతే మీ ఇంట్లో పెంచుకుంటున్న బాబుని నాకు ఇచ్చెయ్యండి’ అంటూ షరతు పెడుతుంది.దాంతో కార్తీక్ ఆవేశంతో నోరుముయ్ మోనితా పిచ్చి పిచ్చిగా మాట్లాడకు వాడు మా ప్రాణం అంటాడు.వాడ్ని వదిలి మా ఇంట్లో వాళ్లు ఒక్క క్షణం కూడా ఉండలేరు అనేసి వెళ్లిపోతాడు కార్తీక్. దాంతో మోనిత నవ్వుకుంటూ నాక్కూడా కావలిసింది అదే కదా అనుకుంటుంది.

మోనిత చేసిన పనికి చెంప పగలకొట్టిన దీప :

మరోపక్క మోనిత కార్తీక్ ఇంటికి వచ్చాడనే ఆనందంతో బస్తి వాళ్లకు చీరలు పంచిపెడుతుంది. ఆ విషయాన్నీ వారణాసి దీపకు కాల్ చేసి చెప్తాడు.మోనిత ఏమో చీరలు పంచుతూ మై డియర్ బస్తీవాసులారా’ అంటూ ఈరోజు మా వారు అయిన కార్తీక్ మా ఇంటికి వచ్చారు అందుకే ఈ సంబరం చేస్తున్న అంటుంది. ఇంతలో దీప అక్కడకు వచ్చి మోనిత చెంప పగలకొట్టి కార్తీక్ నాకు మాత్రమే భర్త అని అంటుంది.ఇక మోనిత మాత్రం కార్తీక్‌తో నేను పెట్టుకున్న డీల్ ప్రకారం నా బాబుని వెతికి ఇవ్వండి లేదంటే మీ ఇంట్లో ఉన్న బాబుని నాకు ఇవ్వండి’ అంటుంది మోనిత.

సౌందర్య ప్లాన్ మాములుగా లేదుగా.?

మోనిత మాటలు. తల్చుకుని దీప ఏడుస్తుంటే సౌందర్య ఓదార్చుతో ఒక ప్లాన్ చెబుతుంది ప్లాన్ ప్రకారం.ఉదయాన్నే సౌందర్య బస్తీకి వెళ్లి లక్ష్మణ్, అరుణ అందరినీ కలిసి రేపు గుళ్లో మా కార్తీక్ వాళ్లకి తాడికొండలో దొరికిన బాబుని పిల్లలు లేని తల్లిదండ్రులకు దత్తత ఇస్తున్నాం మీరు తప్పకుండా రావాలి అని చెప్పి అక్కడనుండి వెళ్ళిపోతుంది.
సీన్ కట్ చేస్తే లక్ష్మణ్ ద్వారా ఈ దత్తత గురించి తెలుసుకుని గుడికి వచ్చి గొడవ పడుతుంది

Karthika Deepam Mar 5 Today Episode: మోనిత ఎవరికీ మొక్షాన్ని ఇస్తుందో… ప్రమాదపు అంచుల్లో కార్తీక్ కుటుంబం ఉంది అని హెచ్చరించిన పూజారి..!
దత్తత విషయం తెలిసి షాక్ అయిన కార్తీక్ :

నిజానికి దత్తత విషయం కార్తీక్ కూడా మోనిత చెప్పేదాకా తెలియదు. ఏంటి మమ్మి అని అంటే నిజమే అంటుంది సౌందర్య.‘ఈ దత్తతను నేను ఒప్పుకోను అని మోనిత అంటే నువ్వు ఎవరే ఒప్పుకోవడానికి ఇది జరిగి తీరుతుంది’ అంటుంది సౌందర్య కోపంగా.. ‘నేను ఆ బాబు కన్న తల్లిని’ అంటూ మోనిత అసలు నిజం చెప్పేస్తుంది. అది విని కార్తీక్‌తో సహా అంతా షాక్ అవుతారు. కార్తీక్ కు అసలు విషయం చెప్పి సౌందర్య బాబును మోనితకు ఇచ్చి కార్తీక్ కు ఇచ్చిన మాట ప్రకారం మా కుటుంబం నుంచి దూరంగా వెళ్ళిపో అంటుంది.

ఆనంద్ లేడని తెలిసి హిమ ఏమి చేసిందంటే..?

ఇక ఆనంద్ ను మోనితకు ఇచ్చేసి ఇంటికి వస్తారు అందరు. ఇంతలో హిమ వచ్చి తమ్ముడు ఎక్కడా అని అడుగుతుంది.తమ్ముడిని వాళ్ల బంధువులు వచ్చి తీసుకెళ్లారని సౌందర్య చెప్పడంతో షాక్ అవుతుంది హిమ.తమ్ముడికి బంధువులు ఎవ్వరూ లేరుకదా, అయినా మీరెలా ఇస్తారు, అమ్మా మనం వెళ్లి తెచ్చుకుందాం అని ఏడుస్తుంది.ఎంతమంది చెప్పిన హిమ వినదు. ఇక సౌందర్య మాత్రం.పిల్లల్ని తీసుకుని కొన్నాళ్లు ఎక్కడికైనా వెళ్లిరండి అని చెబుతుంది.ఇంకా మోనిత గుడిలో సౌందర్య అన్నమాటలు తలుచుకుని కోపంతో రగిలిపోతు గన్ తీస్తుంది.ఇక కార్తీక్ పిల్లలతో కలిసి విహారయాత్రకు వెళతారు. అంతా సంతోషంగా ఉన్నప్పటికీ హిమ మాత్రం ఇంకా ఆనంద్ ను గుర్తుచేసుకుంటూ బాధపడుతుంటుంది.దీప చెప్పిన మాటలకు హిమ కన్విన్స్ అవుతుంది. కార్తీక్ మాత్రం హిమ అలక. తీర్చడానికి డ్రైవింగ్ నేర్పిస్తా రమ్మంటూ హిమకు డ్రైవింగ్ నేర్పిస్తాడు.

ప్రమాదం అంచుల్లో దీప, కార్తీక్, పిల్లలు :

ఇక సౌందర్య, ఆనందరావులు గుడిలో పూజారితో అన్ని కష్టాలు పడి ఇప్పుడే తేరుకున్నాం అంటారు. కర్మ ఫలం అనుభవించక తప్పదంటాడు పూజారి.కార్తీక్ వాళ్ళు చిక్ మంగుళూర్ వెళ్లారు అనడంతో నాకెందుకో మనసులో ఏదో కీడు శంకిస్తోంది వాళ్ళని జాగ్రత్తగా ఉండమని చెప్పండి.వీలైతే వెనక్కు రమ్మని చెప్పండని చెప్పేసి వెళ్లిపోవడంతో ఈ వారం ఎపిసోడ్ ముగుస్తుంది.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju