Karthika Deepam Jan 10 today episode: రుద్రాణిని ఎదిరించి కార్తీక్ దీపకు పనిచ్చిన దేవుడు..!!కార్తీక్ పనోడిగా, దీప వంటలక్కగా..మారానున్నారా..??

karthika deepam highlights
Share

Karthika Deepam Jan 10 today episode: కార్తీక దీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ ఎంతో ఉత్కంఠ భరితంగా ముందుకు సాగుతుంది. పిల్లలకు అన్నం పెట్టడానికి లంచ్ బాక్స్ తీసుకుని వెళ్లిన కార్తీక్ చేతిలో నుంచి అనుకోకుండా క్యారేజ్ కింద పడిపోతుంది.పాపం కార్తీక్ పిల్లల ఆకలి తీర్చాలని ఓ హొటల్‌కి వెళ్లి ఓ ప్లేట్ మీల్స్ ఇవ్వండి అని డబ్బులు సాయంత్రానికి తెచ్చి ఇస్తాను అంటాడు. అయితే అతడు ‘డబ్బులు లేకపోతే ఎలా అని వెళ్లు వెళ్లవయ్యా’ అని పంపించే ప్రయత్నం చేస్తాడు.మరోపక్క దీప జంతికలు ఎవరు కొనకపోవడంతో నిరాశ చెందుతూ ఉంటే అప్పుడే రుద్రాణి వచ్చి ‘నా డబ్బులు తీర్చకపోతే పిల్లల్లో ఒకరిని తీసుకుంటాను’ అంటుంది. అ మాట విని దీప కోపంతో ఊగిపోయి చెయ్యి కూడా పైకి లేపి కొట్టినంత పని చేసి కళ్ళు ఎర్ర చేసి వెళ్లిపోతుంటే… ఎలా తీరుస్తావు దేవుడా వస్తాడా.. అంటే దేవుడో వస్తాడో… దేవతో వచ్చిదో అని వెళ్లి పోతుంది.

Singer Sunitha: సునీత విడుదల చేసిన ఈ వీడియో చూసి మీ కంట్లో నీళ్ళు తిరగకపోతే ఛాలెంజ్.. ఏడ్చి తీరతారు!

Karthika Deepam Jan 10 today episode: హోటల్లో పనోడిగా కార్తీక్:

ఇక ఈరోజు ఎపిసోడ్ లో బొంబాయి భోజన హోటల్ ఓనర్‌ని కార్తీక్ చాలా బతిమలాడతూ ఉంటే ఈలోపు ఆ హోటల్‌లో పనిచేసే పనివాడు.‘అన్ని పనులు నేనే చేసుకోవాలి’ అంటూ విసుక్కుంటూ ఉండగా ఈలోపు ఓనర్ ‘పనోళ్లు దొరకాలి కదరా’ అంటాడు. అది విన్న కార్తీక్ ఆ పని ఏదో నేను చేస్తాను అని అంటాడు. ‘పని అంటే.. ప్లేట్స్ కడగాలి,కూరగాయలు కట్ చెయ్యాలి’ బల్లలు తుడవాలి అంటాడు. సరే చేస్తా అని చెప్పి నాకు ముందు ఓ పేట్ మీల్స్ కావాలి’ అని దాన్ని తీసుకుని స్కూల్‌కి వెళ్తాడు.పాపం అప్పటికి పిల్లలు ఆకలి తట్టుకోలేక కుళాయినీళ్లు తాగుతుంటే అది చూసిన కార్తీక్ బాధపడతాడు.పిల్లల్ని పిలిచి.. అన్నం తినిపిస్తాడు. ‘నాన్నా మీకు డబ్బులు ఎక్కడివి? ఎలా కొన్నారు అంటే ప్రశ్నలు వేస్తే మాట మారుస్తాడు కార్తీక్.మరోవైపు హిమ, సౌర్య ఇద్దరూ కూడా ‘నాన్నా నీకు ఆకలిగా ఉంది కదా తినమని ఇద్దరూ అన్నం తినిపిస్తారు. అక్కడ సీన్ చూస్తే కాస్త ఎమోషనల్ గా ఉంటుంది.

Intinti Gruhalakshmi: నందు కి భార్య గా మారిన తులసి.. లాస్యను నువ్వు రెండో భార్యవి మాత్రమే.. ఆనందంలో నందు..
హోటల్లో వంటలక్క గా మారిన దీప:

మరోపక్క దీప అదే బొంబాయి భోజన హోటల్‌కి జంతికలు అమ్మడానికి వెళ్తుంది. ఇవి తిని చూడండి సార్ నచ్చితే డబ్బులు ఇవ్వండి. అంటూ తను చేసిన పిండివంటలను హోటల్ ఓనర్‌కి ఇస్తుంది.అవి తిన్న అతడు అమ్మా చాలా రుచిగా ఉన్నాయి,బాబుని ఎత్తుకుని ఉన్నావ్ ముందు కూర్చుని మంచినీళ్లు తాగు’ అని మర్యాదగా మాట్లాడతాడు. దాంతో దీప కూర్చుని వాటర్ తాగుతూ ఉంటుంది. ఇంతలో కార్తీక్ హోటల్ లో పని చేయడానికి బయట నుంచి లోపలికి వస్తూ ఉంటాడు. దీప పిండివంటలు తిన్నా హోటల్ యజమాని మా హోటల్‌లో వంట చేస్తారా..?’ అంటాడు. దాంతో దీప చాలా సంతోషంగా ‘పని ఇస్తానంటే కాదంటానా అండీ చేస్తాను.మీరు ఎప్పుడు పనిలో చేరమంటే అప్పుడే చేరతాను అంటుంది. కానీ నేను ఇక్కడ పని చేస్తున్నట్లు ఆ రుద్రాణికి తెలియకుండా ఉంటే చాలు’ అంటుంది. దాంతో ఆ పెద్దాయన అమ్మా ఆ రుద్రాణి అంటే మాకూ పడదు.మీరు కంగారు పడాల్సిన పనిలేదు’ అంటాడు. దాంతో దీప బయలుదేరూతూ ఉండగా ఎదురుగా కార్తీక్ వస్తుంటాడు. ఇద్దరూ ఒకర్ని ఒకరు చూసుకుంటారేమో అనుకుంటారు కానీ సరిగ్గా కార్తీక్ రావడం చూసి హోటల్. లో పని వాడు కార్తీక్‌ని పక్కకు లాగి ఏందయ్యా ఇంతలేటు.. రా.. కూరగాయలు తరుగు’ అంటూ పని అప్పగిస్తాడు. దానితో దీప, కార్తీక్ ఒకరిని ఒకరుచూసుకోరు.

రుద్రాణికు వార్నింగ్ ఇచ్చిన దీప :

మరోపక్క దీప ఇంటికి వచ్చేసరికి సౌర్య హిమలని రుద్రాణి ముద్దు చేస్తూ ప్రేమగా మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. అది చుసిన దీప రుద్రాణి గారు’ అని అరిచి.. పిల్లల జోలికి రావద్దని వార్నింగ్ ఇస్తుంది. ఇక మరోవైపు సౌందర్య, ఆనందరావులు..భారతి చెప్పినట్లే.. ప్రకృతి వైద్యశాలకు వెళ్లేందుకు బయలుదేరతారు. అప్పుడే మోనిత కారు సౌందర్య ఇంటి ముందు ఆగుతుంది కానీ వాళ్లంతా బయటికి రావడం చూసి.. కారు వెనక్కి తీసుకుని వీళ్లంతా ఎక్కడికి వెళ్తున్నారు?కార్తీక్ సమాచారం ఏదైనా తెలిసిందా?’ అని మనసులో అనుకుంటుంది.


Share

Related posts

ఏ వయసులో అయినా రమ్యకృష్ణ స్పీడ్ తగ్గించేది లేదు…. ఇంతకీ ఈ ఫోటో చూశారా?

arun kanna

జపాన్ లో ప్రభాస్ క్రేజ్ ముందు .. ఏపీ , తెలంగాణా ఫాన్స్ కూడా పనికిరారు !

GRK

Bigg Boss Telugu 5: గ్యారెంటీగా అతడే టైటిల్ విన్నర్ అంటున్న ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్..!!

sekhar