Karthika Deepam Jan 12 Today Episode: మోనిత దీపను, కార్తీక్ ను చూడనుందా…?? మళ్ళీ కధ మొదటికే వస్తుందా..?

Share

Karthika Deepam Jan 12 Today Episode: కార్తీక దీపం సీరియల్ రోజు రోజుకు ఎంతో ఆసక్తికరంగా ముందుకు సాగుతూ ఉంది. నిన్నటి ఎపిసోడ్ లో సౌందర్యవాళ్ళు తాడికొండ గ్రామానికి చేరగా వాళ్ళని ఏతుకుంటూ మోనిత కూడా అదే గ్రామానికి వస్తుంది ట్విస్ట్ ఏంటంటే అదే గ్రామంలో కార్తీక్, దీప కూడా ఉంటారు. మోనిత మాత్రం ప్రియమణిది అదే ఊరు కదా అని ఆ ఊరంతా వెతుకుతూ ఉంటుంది. ఇక్కడితో నిన్నటి ఎపిసోడ్ పూర్తి అయింది. ఇక ఈరోజు ఎపిసోడ్ ఇంట్లో ఉన్న ఆదిత్యకి కాఫీ తీసుకొచ్చి ఇచ్చిన శ్రావ్యతో.

Intinti Gruhalakshmi: నందూ తులసి చేసిన వంట తిన్నాడని లాస్యకు తెలుస్తుందా..!? శృతి తల్లి కాబోతుందా..!?

Karthika Deepam Jan 12 Today Episode: బాధలో ఆదిత్య, శ్రావ్య :

మమ్మీ వాళ్లు లేచారా, కాఫీ ఇచ్చావా అని అడిగి ఒక్క క్షణం అలా ఆగిపోయి వాళ్ళు ఇంట్లో లేరు కదా అని బాధపడతాడు ఆదిత్య. ఒకప్పుడు ఆనందంగా ఉండే మనం చెట్టుకు ఒక్కళ్ళం పుట్టకి ఒక్కళ్ళం లాగా చెల్లాచెదురైపోయాము అని కన్నీళ్లు పెట్టుకుంటాడు. బాధపడొద్దు ఆదిత్య అంతా సర్దుకుంటుందని చెబుతుంది శ్రావ్య. మరోపక్క మోనిత ప్రియమణి కోసం వెతుకుతూ అది వెళ్లిపోయినప్పటి నుంచీ కనీసం ఫోన్ చేయలేదు.కొంపతీసి మీ కార్తీకయ్య పార్టీలో చేరావా అనుకుని నిన్ను ఎలాగయినా పట్టుకుంటాను అని అందర్నీ ఆరాతీస్తుంది.

Pawan Kalyan: పొత్తుల అంశంపై ఒక్క మాటలో తేల్చేసిన జనసేనాని పవన్ కళ్యాణ్..ఎవరి మైండ్ గేమ్‌లో పడవద్దంటూ నేతలకు కీలక సూచన..
అయ్యో.. దీపను మోనిత చూసేస్తుందా..?

ఇంతలో దీప బాబుని తీసుకుని అటువైపుగా వెళ్తుంది. మోనిత దగ్గరకు వెళ్లగానే బాబు ఏడుపు మొదలెడతాడు. అయ్యో ఎవరో పిల్లాడు ఏడుస్తున్నాడే..నా ఆనందరావు కూడా ఇలానే ఏడ్చేవాడు కదా అని. అనుకుంటుంది. బాబు ఏడుస్తున్నాగాని ఎవరో ఆ తల్లి పట్టించుకోవడం లేదేంటని బాబుని వెతుకుతూ వెళుతుంది.కనిపించకపోయేసరికి ఆకలేస్తుంది ఇక్కడేదైనా హోటల్ ఉందో లేదో అనుకుంటుంది మోనిత.

సైకిల్ తొక్కుతూ భోజనం పార్సిల్స్ ఇవ్వనున్నాడా కార్తీక్..??

మళ్ళీ సీన్ బొంబాయి హోటల్లో ఓపెన్ అవుతుంది. ఆ హోటల్లో సర్వర్ గా చేరిన కార్తీక్ గతంలో తనకు జరిగిన సన్మానాలు గుర్తుచేసుకుంటాడు. ఈలోపు హోటల్ యజమాని ప్లేట్లు క్లీన్ చేయి, హోటల్ నీటిగా ఉంచాలి అని అసలు నువ్వు ఏం చదువుకున్నావ్ అని అడుగుతాడు కార్తీక్ ను. చూస్తుంటే పెద్దింటోడిలా కనిపిస్తున్నావ్ అని అంటే రేపటి నుంచి అలా కనిపించను అంటాడు కార్తీక్.మీది ఏ ఊరు అంటే విజయనగరం అని చెబుతాడు కార్తీక్. కొన్ని పార్సిళ్లు తీసుకెళ్లి సైకిల్ పై తీసుకుని వెళ్లి ఇవ్వాలని చెబుతాడు. సరే అని మొహం బాధగా పెట్టి వెళ్ళిపోతాడు. ఈలోపు హోటల్ లో పనిచేసే ఒక వ్యక్తి నేను నీకు సీనియర్ ని నా పేరు అప్పారావు, కొందరు అప్పు అంటారు మరికొందరు మాత్రం అప్పిగా అంటారా అంటాడు కార్తీక్. నువ్వు నన్ను అప్పిగా అని పిలవొచ్చు..నేను నిన్ను బావా అంటా అంటాడు. ఇంతలో హోటల్ యజమాని ఒరే అప్పిగా కస్టమర్స్ వచ్చారు చూసుకో అంటాడు.

బొంబాయి హోటల్లో మోనితను చూసి షాక్ లో ఉన్న కార్తీక్.?

కార్తీక్ ను ముందు పంపుదాం అనుకుని ఆగు నేను వెళతాను అంటాడు.హోటల్ లో మోనితనుచూసి సినిమా హీరోయిన్ లా ఉంది..అర్జెంట్ గా విగ్గు కొనుక్కోవాలి అనుకుంటూ వెళ్లి షూటింగ్ ఎక్కడ జరుగుతోంది మేడం అనగానే..షూటింగ్ ఏంటి అన్న మోనితతో సరే ఏం తింటారు మేడం అని అడిగి లిస్ట్ చెబుతాడు. ఆ వాయిస్ విని మోనిత వాయిస్ లాగా ఉందే అనుకుంటాడు.అయినాగానీ మోనిత ఇక్కడకు ఎందుకు వస్తుందిలే అనుకుని ఆగుతాడు.కానీ మళ్ళీ కార్తీక్ కు ఎందుకొ అనుమానం వచ్చి పక్కనుంచి చూడగా హోటల్ లో మోనిత కూర్చోడం చూసి షాకవుతాడు. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగిసింది.మరి రేపటి ఎపిసోడ్ లో కార్తీక్ ను మోనిత చూసేస్తుందా.. అనేది సస్పెన్స్ అన్నమాట..!


Share

Related posts

గబ్బా లో అబ్బా అనిపించిన పంత్, గిల్..! అద్భుతమైన విజయానికి చివర్లో భారత్…!

arun kanna

Job Notification: నిరుద్యోగులకు శుభవార్త.. డీఎఫ్ సీసీఐఎల్ లో 1074 ఖాళీలు..!!

bharani jella

చైనాకు చెక్..! వాణిజ్యంలో భారత్ తో అమెరికా కలిస్తే..

Muraliak