Karthika Deepam Jan 13 Today episode: ఆ బిడ్డా మోనిత కొడుకు అని దీపకు తెలిసిపోయిందా… అసలు ఆ డైరీలో ఏముంది..?

Share

Karthika Deepam Jan 13 Today episode: కార్తీక దీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ వస్తుంది.గత ఎపిసోడ్‌లో తాడికొండ గ్రామానికి వచ్చిన మోనిత బొంబాయి హోటల్ లో భోజనం చేయడానికి వెళుతుంది.అక్కడ మోనితను కార్తీక్ చూసి షాక్ అవుతాడు.మోనితను చుసిన అప్పిగాడు.. మోనితని ‘మేడమ్ ఏం చేస్తుంటారు.. సినిమా హీరోయిన్‌లా ఉన్నారు.నా పేరు అప్పారావు అని పరిచయం చేసుకుని మీకు తెలిసిన సినిమా వాళ్లు ఎవరైనా ఉన్నారా మేడమ్?’ అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తాడు. దాంతో మోనిత విసుక్కుంటూ ‘నేను డాక్టర్‌ని..’ అని మోనిత సమాధానం ఇవ్వగానే.. ‘మీ సార్ కూడా డాక్టరే అయ్యి ఉంటారు కదా’ అని గెస్ చేస్తాడు అప్పిగాడు. దాంతో మోనిత పొంగిపోతూ ‘హా అవును భలే కనిపెట్టావ్..’ అంటూ పొగుడుతుంది.

Devatha Serial: మాధవ్ పెట్టిన కండిషన్లకు పిల్లలు ఒప్పుకుంటారా..!? ఆదిత్య కు దూరంగా హాస్టల్ కి వెళ్తారా..!?

Karthika Deepam Jan 13 Today episode:మోనితకి సర్వ్ చేయమన్న అప్పిగాడు :

వీళ్ళ మాటలు అన్ని కార్తీక్ వింటూ ఉంటాడు.ఇంతలో లోపల వంట చేసే వ్యక్తి ‘ఎగ్ బిర్యానీ కార్తీక్‌కి ఇచ్చి.. తీసుకుని వెళ్లి ఇచ్చిరా’ అంటాడు.మరోపక్క అప్పిగాడు కూడా.. ‘హేయ్ జూనియర్ తీసుకునిరా.. మేడమ్‌కి ఎగ్ బిర్యానీ’ అని అరుస్తూనే ఉంటాడు. కార్తీక్‌కి టెన్షన్ పెరిగిపోతుంది. ఎలా ఇప్పుడు నన్ను మోనిత చూసేస్తుంది కదా అనుకుని తప్పించుకోవడానికి కత్తి తీసుకుని వేలుకోసుకుంటాడు. ఇంతలో అప్పిగాడు లోపలికి వచ్చి.. ‘ఏం అయ్యింది ఎందుకు తీసుకుని రావట్లేదు’ అంటే.. చెయ్యి తెగింది అని చూపిస్తాడు.
సరే నీకు చెయ్యి తెగింది.. బయట డాక్టర్ ఉంది.. పదా చూపించేస్తా అంటూ మోనిత దగ్గరకు పదమంటాడు అప్పిగాడు.దాంతో కార్తీక్‌కి మరింత టెన్షన్ పెరిగిపోతుంది. ‘ఎప్పుడు వెళ్దుందట? ఎందుకొచ్చిందట.?’ అంటే తిని వెళ్తా అని మాత్రం అంది’ అంటాడు అప్పిగాడు కార్తీక్ చేతిలోని ఎగ్ బిర్యానీ తీసుకుని.

Devatha Serial: మాధవ్ పెట్టిన కండిషన్లకు పిల్లలు ఒప్పుకుంటారా..!? ఆదిత్య కు దూరంగా హాస్టల్ కి వెళ్తారా..!?

దీప వెనుక పెద్ద కుట్ర… ఎవరు చేయిస్తున్నారంటే..?

సీన్ కట్ చేస్తే దీప దగ్గరకు పక్కింటి మహాలక్ష్మి పంచదార అరువు కోసం వస్తుంది. మాటల సందర్భంలో దీప పిల్లలు జాగ్రత్త. ఇంట్లోనే ఉండి పిలల్లకు చదువు చెప్పొచ్చు కదా అని మహాలక్ష్మి అంటే ఆ మాటలు దీపకు అర్థం కాక ‘ఆగు.. ఎందుకు అలా అన్నావ్?’ అని అడుగుతుంది దీప.ఆ రుద్రాణి మంచిది కాదు దీపా.. నీ పిల్లల మీద కన్నేసింది, వచ్చేనెల ఆ రుద్రాణి పుట్టిన రోజంట తెలుసా?’ అంటుంది మహాలక్ష్మి. ‘అయితే ఏంటి అని దీప అర్థం కానట్లుగా అడుగుతుంది.ఏమిలేదు ఆ రుద్రాణి.. నాకు రెండు గౌన్లు కుట్టమని కొలతలు కూడా ఇచ్చింది దీపా. ఆ కొలతలు నీ ఇద్దరు పిల్లలవే’ అంటూ షాకిస్తుంది మహాలక్ష్మి. ‘నా పిల్లల కొలతలు రుద్రాణికి ఎక్కడివి?’అంటే ‘బయట పిల్లల బట్టలు ఆరేస్తే వాళ్ల మనిషి వచ్చి ఎత్తుకెళ్లాడట.. నీ చుట్టు పెద్ద కుట్ర జరుగుతుందని నా అనుమానం..’ అంటుంది మహాలక్ష్మి

Prabhas : “ఇంటికి వచ్చి మరీ కొడతా రా ఒరేయ్” ప్రభాస్ ఫ్యాన్ కి రాధేశ్యామ్ డైరెక్టర్ స్వీట్ వార్నింగ్ !
అనుకోని కీలక మలుపు..బిడ్డ గురించిన అసలు విషయం దీపకు తెలుస్తుందా..?

దీప ఆలోచనలో పడి అదే దిగులుతో ఓ బీరువాకు జారబడుతుంది. దాంతో పై నుంచి ఓ పెట్టె కింద పడి దానిలో పుస్తకాలన్నీ కిందపడిపోతాయి. వాటిని సర్దుతూ సర్దుతూ.. ఓ పద్దుల బుక్ చూసి తిరగేస్తుంది.దానిలో ఓ చోట.. ‘Ts 09 PAJ నీకు దండాలమ్మా.. నన్ను క్షమించు తల్లీ’ అని రాసిన రాతలు చూసి.. ‘కోటేష్ ఇలా ఎందుకు రాసుకున్నాడు? ఈ బండి నంబర్ ఎక్కడో చూసినట్లు ఉందే’ అని ఆలోచనలో పడుతుంది.
మళ్ళీ సీన్ హోటల్ లో ఓపెన్ అవుతుంది.ఇక మోనితకి ఎగ్ బిర్యానీ వడ్డించిన అప్పిగాడు అది తిన్నాక వెళ్లే ముందు మోనితతో సెల్ఫీ కూడా తీసుకుంటాడు.ఇక సౌందర్య, ఆనందరావులు ప్రకృతి వైద్యశాలలో కూర్చుని దీప కార్తీక్‌ల గురించి మాట్లాడుకుంటూ ఉంటే.. అందులో ఓ సర్వెంట్ వాళ్లకి పాలు అందిస్తూ మీతో పాటు వచ్చిన మరొకరు ఎక్కడ మేడమ్’ అంటాడు. ‘మేము ఇద్దరిమే వచ్చాం.. మాతో ఎవరూ రాలేదు’ అంటుంది సౌందర్య. ‘లేదు మేడమ్ నేను చూశాను. ఎర్రకారులో వచ్చారు అంటాడు.బహుశా మోనిత అయ్యి ఉంటుందా అని. ‘మోనిత అయ్యి ఉంటే.. ఇంద దూరం వచ్చి మనల్ని ఏదొకటి అనకుండా వెళ్తుందా?’అనుకుంటారు.

రుద్రాణి వంట గదిలో దీప… చిన్న స్వీట్ వార్నింగ్ అంతే.?

ఇక మరోవైపు నైట్ రుద్రాణి ఇంట్లోకి వచ్చి.. సోఫాలో కూర్చుంటూ ఎదురుగా దీప వంటగదిలో వంట వండటం చూసి షాక్ అయిపోతుంది. రేయ్ అబ్బులు అని గట్టిగా అరవగా వెంటనే అబ్బులు పరుగున వస్తాడు. దీప ఇద్దరినీ చూసి నవ్వుతూ.. ‘ఏంటి రుద్రాణి గారు.. అంతా కులాశానా? ఏం లేదు.. ఇంట్లో గ్యాస్ అయిపోయింది.వంట చేసుకుందాం అని అన్ని తెచ్చుకున్నాను.నేను వంట చాలా త్వరగా చేస్తాను’ అంటుంది దీప నవ్వుతూ.‘నువ్వేంటి దీపా ఇక్కడా.. గ్యాస్ అయిపోతే నా ఇంట్లో,నా కిచెన్ నువ్వు ఎలా వాడతావ్’ అని అరుస్తుంది రుద్రాణి. మీ కిచెన్‌లోకి నేను వస్తే మీకు ఇంత కోపం వస్తుంది.మరి నా ప్రాణానికి ప్రాణంగా పెంచుకుంటున్న నా పిల్లలపై మీరు కన్నేస్తే నాకు ఎంత కోపం రావాలి?’ రా వద్దు నా పిల్లల జోలికి రావద్దు’ అంటూ నవ్వుతూ చెబుతుంది దీప. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగిసింది.


Share

Related posts

Intinti Gruhalakshmi: గృహలక్ష్మి ఇంటిలోకి కొత్త క్యారెక్టర్.. ఆఫీస్ నడిపినట్టే ఇల్లు నడుపు అంటూ తులసి లాస్య పై అదిరిపోయే పంచ్..!! 

bharani jella

ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధం

somaraju sharma

GHMC ఎన్నికల విషయంలో తెలంగాణ ఈసీ కీలక నిర్ణయం..!!

sekhar