Karthika Deepam Jan 14 today’s episode: బస్తివాసులను తన వలలో పడేసుకున్న మోనిత..మరోపక్క దీప వంట రుచి చుసిన రుద్రాణి ఏమందంటే..?

Share

Karthika Deepam Jan 14 today’s episode: కార్తీక దీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ ఎంతో రసవత్తరంగా సాగుతుంది.గత ఎపిసోడ్‌లో దీప రుద్రాణి ఇంటికి వెళ్లి నా పిల్లలకు జోలికి వస్తే బాగుండదు అని వార్నింగ్ ఇస్తుంది.ఇంకా ఈరోజు ఎపిసోడ్ లో దీప రుద్రాణి ఇంట్లోనే వంట చేసే సీన్ తోనే సీరియల్ మొదలవుతుంది. నీ వంట గదిని కాసేపు వాడుకున్నందుకే అంతలా చెలరేగినపోతున్నావ్ మరి నా పిల్లల జోలికి వస్తే ఎలా ఊరుకుంటాను అని నేను మీలాగే.. మీకంటే ఎక్కువే కళ్లు ఉరిమి చూస్తూ.. పెద్దగా అరుస్తూ చెప్పగలను అంటుంది దీప రుద్రాణితో. అయితే మీకు నాకు తేడా ఉంది కదా.. అని నేను వండిన ఈ కూర రుచి చూడండి’ అంటూ దగ్గరకు వెళ్తుంది.

Karthika Deepam Jan 14 today’s episode: దీప కూరను రుద్రాణికి రుచి చూపించిన దీప :

‘రుద్రాణి చేయి చాపి కొద్దిగా రుచి చూసి ‘కూరల్లో కారం తగ్గింది దీపా.నేను కారం ఎక్కువగా తింటానులే.నువ్వు కూడా ఇకమీదట కూరల్లో కారం పెంచు దీపా.. పిల్లలకు కాస్త రోషం, పౌరుషం పెరుగుతుంది. నా దగ్గరకు వచ్చేసరికి అవి ఎక్కువగా ఉండాలిగా.. అందుకే రుచి చూశాను..’ అంటుంది. ‘ఇంత చెప్పినా మీకు అర్థం కాలేదా రుద్రాణి గారు’నువ్వు చెప్పేది నువ్వు చెప్పావ్. నేను చేసేది నేను చేస్తాను,మీకు అప్పు తీర్చే రోజులు దగ్గరపడ్డాయి. నా పిల్లల జోలికి వస్తే మాత్రం ఊరుకోను’ అంటూ క్యారేజ్ సద్దుకుని వెళ్లిపోతుంది. ‘ఏంట్రా దాని ధైర్యం.ఈ అవమానం నాకు గుర్తుండాలంటే ఆ వంట గదిని మూసెసి రేపటి నుంచి హోటల్‌ నుంచి ఫుడ్ తెప్పించండి’ అని రౌడీలకు చెబుతుంది.

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ 6 విషయం లో అతిపెద్ద లీక్ జరిగింది .. మొత్తం పేర్లు అన్నీ బయటకి వచ్చేశాయి ?
బస్తివాసులు మోనిత ట్రాప్ లో పడిపోయారా..?

ఇక సీన్ కట్ చేస్తే మోనిత తన క్లినిక్ దగ్గరకు వెళ్లేసరికి బస్తీలో ఉన్న లక్ష్మణ్ భార్య కడుపు నొప్పితో అల్లాడిపోతుంది. ఆమెను.వారణాసి ఆటో ఎక్కించి హాస్పెటల్‌కి తీసుకుని వెళ్లే ప్రయత్నం చేస్తారు కానీ ఆటో స్టార్ట్ అవ్వదు.ఈలోపు మోనిత వచ్చి నా హాస్పిటల్ కి తీసుకుని రండి అంటే వాళ్ళు మోనిత హాస్పిటల్ లో వైద్యం చేయించాలని అనుకోరు. దాంతో లక్ష్మణ్‌ని కొట్టి ‘నీ భర్య చనిపోయేలా ఉంది.

ఇలాంటి సమయంలోనే పంతాలు వద్దు.నా క్లినిక్‌లోకి తీసుకుని రండీ’ అంటుంది. దాంతో లక్ష్మణ్, వారణాసి వాళ్లు.. పేషెంట్‌ని మోనిత క్లినిక్‌కి తీసుకుని వెళ్తారు. కాసేపటి తర్వాత ‘తను బాగానే ఉంటుంది.ఇప్పుడు చెప్పండి మీ దీపక్క వచ్చి కాపాడిందా? నేను కాపాడాను. మీకు దీపక్క అంటే అభిమానం ఉంటే ఒక ఫొటో పెట్టి రోజు పూజ చేసుకోండి. అంతే కానీ ఆ కోపాన్ని నా మీద చూపించకుండా,కొంచెం ఆలోచించండి’ అనేసి వెళ్లిపోతుంది. భార్యని కాపాడినందుకు లక్ష్మణ్ మోనితకు దన్నంపెడతాడు.

Samantha: ఊ.. అంటావా సాంగ్ షూటింగ్ కి ముందు రోజు బన్నీ ఫోన్ చేశాడు ‘ అసలు మ్యాటర్ బయటపెట్టిన సమంత..!

మోనిత గురించి దీపకు చెప్పిన కార్తీక్:

మరో పక్క కార్తీక్ మాత్రం హోటల్లో మోనిత కనిపించడం గురించే ఆలోచిస్తాడు. ఇంతలో దీప వచ్చి అడగడంతో ‘ఈ ఊరు హోటల్‌లో టీ తాగడానికి వెళ్లినప్పుడు అక్కడ మోనితని చూశాను అంటాడు. దీప షాక్ అయ్యి ‘మనల్నే వెతుక్కుంటూ వచ్చి ఉంటుంది అని దీప అంటే నాకు అలా అనిపించలేదు అంటాడు కార్తీక్. కానీ మోనిత మన జీవితాలను అల్లకల్లోలం చేసినా మనం ఏం చెయ్యలేకపోయాం’ అంటాడు కార్తీక్. ఇక దీప కార్తీక్‌ని ఓదార్చి.. ‘నాకు మీరంటే చాలా ఇష్టం, అభిమానం డాక్టర్ బాబు’అంటూ తన మనసులోని ప్రేమను కార్తీక్ తో పంచుకుంటుంది.

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ 6 విషయం లో అతిపెద్ద లీక్ జరిగింది .. మొత్తం పేర్లు అన్నీ బయటకి వచ్చేశాయి ?

సౌర్య మాటలకూ బాధపడిన కార్తీక్ :

ఇక మరుసటి రోజు ఉదయాన్నే కార్తీక్ పిల్లలకు టిఫిన్ పెడుతూ ‘పిల్లలు మీరు సంతోషంగా ఉంటేనే తల్లిదండ్రులుగా మాకు సంతోషం’ అంటాడు. ఆ మాటకు సౌర్య ‘నీకు మేము పిల్లలం కాబట్టి నువ్వు సంతోషంగా ఉన్నావ్ డాడీ.మరి నువ్వు నాన్నమ్మ తాతయ్యలకు కొడుకువి కదా. పాపం వాళ్లు నువ్వు కనిపించక పోతే కూడా వాళ్ళు కూడా అలానే బాధపడుతూ ఉంటారు కదా నాన్న ? మరి నీకు ఎప్పుడూ వాళ్లు గుర్తు రావట్లేదా? అని అడగడంతో కార్తీక్ బాధపడి అమ్మా నాన్నల గురించి ఆలోచిస్తాడు.అంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తయింది.


Share

Related posts

Revanth Reddy: రేవంత్ కు ఆ ఇద్దరు నేతలు హ్యాండ్ ఇస్తున్నట్లేనా..?

somaraju sharma

రాత్రికి రాత్రి కోటీశ్వరుడు అవ్వబోతోన్న జూనియర్ ఎన్‌టి‌ఆర్ .. !

Naina

Telangana Police: ఆ ఇన్స్‌పెక్టర్ చేసిన పనికి బిగ్ సెల్యూట్ చెప్పాల్సిందే..!!

somaraju sharma