న్యూస్

Karthika Deepam Jan 25 Today Episode: రుద్రాణి మనుషులు కార్తీక్ ను ఎమన్నా చేశారా..మరి పిల్లలు ఎందుకు టెన్షన్ పడుతున్నారు..!

Share

Karthika Deepam Jan 25 Today Episode: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తున్న కార్తీక దీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ వస్తుంది.వడ్డీ డబ్బులు కట్టలేదను ఆనంద్ ని రుద్రాణి తీసుకుని వెళ్లడంతో దీప పనిచేసే హోటల్ యజమాని దగ్గర అడ్వాన్స్ డబ్బులు అడిగి తీసుకుని వాటిని రుద్రాణి మొహం మీద కొట్టి బాబును ఇంటికి తీసుకుని వస్తుంది. వాడిని చుడి పిల్లలు సంతోషించి వాడితో ఆడుకుంటారు.ఇంకా దీప రుద్రాణి అసలు తీర్చాలో అనే ఆలోచనలో పడుతుంది. నాకు ఏ సంబంధం లేని ఆనంద్ దూరమైనందుకే నేను ఇంతలా బాధపడితే మరి కొడుకు,కోడలు, మనవలు దూరమైతే అత్తయ్య, మావయ్య ఎంత బాధపడుతున్నారో కదా నన్ను క్షమించండి అత్తయ్య,మావయ్య అంటూ బోరున విలపిస్తుంది.
0
SSY Scheme: కుతురి పెళ్లికి రూ.71 లక్షలు పొందవచ్చు.. ఎలా అంటే..?

Karthika Deepam Jan 25 Today Episode: హోటల్లో పనిచేసే వంటలక్క దీప ఒక్కరేనా??అయోమయంలో కార్తీక్ :

సీన్ కట్ చేస్తే కార్తీక్ కూడా హోటల్ యజమానిని అడ్వాన్స్ గా ఆరువేలు అడిగి తీసుకుంటాడు. వాటిని చూసుకుని ఆరులక్షల్లా కనిపిస్తున్నాయనుకుంటాడు.ఇంకా రుద్రాణి ఇందాకే దీప వచ్చివెళ్లిందని చెప్పడం,హోటల్ యజమాని కూడా వంటమనిషి వచ్చి అడ్వాన్స్ తీసుకుందన్న మాటలు గుర్తు చేసుకుని ఆ వంటలు చేసే ఆవిడ దీప యేనా అని అనుమానం వస్తుంది కార్తీక్ కు. ముందు నేను రుద్రాణి ఇంటికి కాకుండా ముందు ఇంటికి వెళ్లాలి ఒకవేళ ఇంట్లో ఆనంద్ ఉన్నట్టైతే హోటల్లో పనిచేస్తున్న వంటమనిషి దీపే అని ఆనంద్ లేకపోతే వంటమనిషి వేరే ఆవిడ అనిఅనుకుంటూ లోపలకు వెళతాడు. లోపల ఆనంద్ ఉండకూడదు అని మనసులో అనుకుంటాడు.

Kodali Nani: అప్పుడు చింతమనేని..ఇప్పుడు కొడాలి నాని!అడ్డూ అదుపూ లేని వీరంగం!ఏపీ రాజకీయాల్లో ఇదో విచిత్ర పర్వం!
వంట మనిషి దీపే అని కన్ఫామ్ చేసుకున్న కార్తీక్ :

కానీ లోపలికి వెళ్లి చూస్తే పిల్లలు, దీప బాబుకు స్నానం చేయించి. బట్టలు వేస్తూ ఉంటారు. అది చూసి దీప బాబుని డబ్బులిచ్చి తీసుకొచ్చిందా అంటే దీప ఆ హోటల్లోనే పనిచేస్తోందా? ఇప్పుడేమి చేయాలి అడగనా? వద్దా అనుకుంటూ వెళ్లి బాబుని ఎత్తుకుంటాడు. కార్తీక్ ని చూసిన దీప ఏం ఆలోచిస్తున్నారు అండి.ఆనంద్ ని తీసుకొచ్చా కదా అంటుంది. ఆనంద్ ని ఎలా తీసుకొచ్చావ్ అని కార్తీక్ అంటే ఇంట్లో డబ్బులతో పాటూ నేను వంట చేస్తున్న దగ్గర చేబదులుగా కొంత డబ్బులు అడిగితీసుకొచ్చానంటుంది. దీప అబద్ధం చెబుతోందా, నిజంగానే ఎవరి ఇంట్లోనైనా వంట చేస్తోందా అనుకుంటూ జేబులో ఉన్న డబ్బు తీసి ఇస్తాడు.ఈ డబ్బు ఎక్కడిది అని మళ్లీ దీప అడిగితే ఆనంద్ ని విడిపించడానికి అడ్వాన్స్ అడిగి తీసుకున్నాలే అంటాడు కార్తీక్

Singer Sunitha: సరిగ్గా 5 నిమిషాల క్రితం ఇన్ స్టాలో ఒక వీడియో పెట్టిన సునీత.. వెంటనే ఓపెన్ చేయండి.. అలా చూస్తూ ఉండిపోతారు!
కార్తీక్, బాబు కోసం మోనిత చేసే నిరీక్షణ ఫలిస్తుందా.?

మరోపక్క వంటలక్క ప్రజావైద్యశాలలో మోనిత డైనింగ్ టేబుల్ ముందు కూర్చుని కార్తీక్ తో కలసి బాబుకి శాంతి పూజ చేయించిన సంఘటనలు గుర్తుచేసుకుంటుంది.అసలు బాబుని, కార్తీక్ ని వదిలిపెట్టి ఇన్నిరోజులు ఎలా బతికానో అర్థంకావడం లేదంటుంది. మోనితను చుసిన విన్నీ మేడం కార్తీక్ సార్ గురించి ఇంట్లో వాళ్లకి తెలుసేమో ఒక్కసారి ఆరా తీయండి అంటుంది విన్నీ. నువ్వు చెప్పినదాంట్లో కూడా పాయింట్ ఉంది ఆ కోణంలో కూడా ఆలోచిస్తా అంటుంది మోనిత.

Kodali Nani: అప్పుడు చింతమనేని..ఇప్పుడు కొడాలి నాని!అడ్డూ అదుపూ లేని వీరంగం!ఏపీ రాజకీయాల్లో ఇదో విచిత్ర పర్వం!
రుద్రాణి మనుషులు కార్తీక్ ను ఎమన్నా చేశారా..?
మరోపక్క కార్తీక్ దీపను చాలా ఇబ్బంది పెడుతున్నా.. దీప నవ్వు వెనుక చాలా బాధ దాగి ఉంది అది నన్ను బాధిస్తోందనుకుంటాడు. ఈ లోగా రుద్రాణి మనుషులు కార్లో వెళుతూ కార్తీక్ ను చూసి పక్కన మురికి గుంటలో ఉన్న నీళ్లు కార్తీక్ పై పడేలా చేద్దాం అనుకుంటారు..అది గమనించిన కార్తీక్ ముందుగానే ఒక రాయి పట్టుకుని వాళ్ళకి ఎదురుగా నిలబడతాడు.కార్తీక్ ను చుసిన రౌడీలు సైలెంట్ గా వెనుదిరిగి వెళ్ళిపోతారు. ఇక దీప రుద్రాణికి కట్టిన వడ్డీ డబ్బులు ఉంటే ఇంట్లోకి సరుకులు నిండుగా తెచ్చేదాన్ని.అలాగే పిల్లలకు కూడా తినడానికి ఎమన్నా కోనేదాన్ని అనుకుంటుంది.చిట్టి డబ్బులతో ఎలాగయినా రుద్రాణి అప్పు తీర్చేసి,హైదరాబాద్ వెళ్లిపోయి అందరితో కలసి ఉండాలి అనుకుంటుంది.ఈలోపు పిల్లలు కంగారుగా వచ్చి అమ్మా నాన్న ఎక్కడ ఉన్నారు అని అడుగుతారు. ఏమైంది ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారంటే ఇందాక రుద్రాణి మనుషులు వచ్చి మీ నాన్న జాగ్రత్త అని వెళ్లారెందుకు అని అడుగుతారు. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.


Share

Related posts

రేపు శిరిడీఆలయంలో ఏం జరగబోతోంది ?తృప్తి దేశాయ్ అల్టిమేటం పై సర్వత్రా ఉత్కంఠ !!

Yandamuri

భారత్ కు క్యూ కడుతున్న భారీ కంపెనీలు

Siva Prasad

ఆ తమిళ డైరెక్టర్ కి చరణ్ ఓకే చెప్పినట్లే నా…??

sekhar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar