న్యూస్

Karthika Deepam Jan 26 Today Episode: మోనిత బండారాన్ని భారతి కనిపెట్టిందా.. కార్తీక్ హోటల్లో పనిచేయడం దీప చూసి ఏమి చేస్తుంది..?

Share

Karthika Deepam Jan 26 Today Episode: బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో అలరిస్తున్న ‘కార్తీకదీపం’ సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ వస్తుంది. మరి ఈరోజు ఎపిసోడ్ లో కార్తీక దీపం సీరియల్లో ఏమి జరిగిందంటే.. పిల్లలు దీప దగ్గరకు వచ్చి అమ్మా అ రుద్రాణి మనుషులు వచ్చి మీ నాన్న జాగ్రత్త అంటూ వెళ్లారని చెప్పడంతో దీప షాక్ అవుతుంది.మళ్ళీ ఈరోజు కూడా అదే సీన్ తో సీరియల్ మొదలవుతుంది.దీప ఆలోచనలో పడి వాళ్లు అలా అన్నారంటే రుద్రాణి మళ్లీ ఏదైనా ప్లాన్ చేస్తోందా అనే ఆలోచనలో పడుతుంది. కట్ చేస్తే అప్పిగాడు హోటల్ యజమానిని కాకా పట్టే పనిలో పడతాడు.

Salt -Tumeric : పసుపు ,ఉప్పు విషయం లో ఈ మాట అసలుపొరపాటున కూడా  వాడకండి? వాటి విషయం లో ఈ జాగ్రత్తలు పాటించండి!!

Karthika Deepam Jan 26 Today Episode: అప్పిగాడి దగ్గర కార్తీక్ ఫోటో దీప చూస్తుందా..?

అలాగే కార్తీక్ దగ్గరకు వెళ్లి బావ ఈరోజు నా పని కూడా నువ్వే చేస్తే నేను సినిమాకు వెళ్లొస్తా అని అడుగుతాడు.సరే అంటాడు కార్తీక్. ఇకపోతే మోనిత తన ఫొటో తానే చూసుకుంటూ తెగ మురిసిపోతుంది.ఇంత అందంగా ఉన్నావ్ కానీ కార్తీక్ మనసు మెప్పించలేకపోయావ్ ఏంటి , ఎక్కడో లోపం జరిగింది అనుకుంటూ ఉండగా ఇంతలో అక్కడకు వచ్చిన డాక్టర్ భారతి మోనితకు క్లాస్ పీకుతుంది. ఇప్పటికే నీ లైఫ్ లో చాలా కోల్పోయావ్, లైఫ్ లో ఏదో ఒక లక్ష్యం ఉండాలికదా అంటే.. దానికి మోనిత ఉన్నాయి కదా వన్, టూ, త్రీ అన్నీ కార్తీక్ అని సమాధానం చెబుతుంది.

Intinti Gruhalakshmi: లాస్యను సేవ్ చేయడానికి వచ్చిన గాయత్రికి ఇంట్లో వాళ్ళందరూ కలిసి ఏం చేశారంటే..!? 
కార్తీక్ పరిస్థితికి మోనిత కారణం అని భారతి కనిపెట్టేసిందా.?

ఎన్నో సర్జరీలు చేసి విజయం సాధించిన కార్తీక్ జీవితం ఇలా అయిపోవడం ఏంటి అని భారతి అనగానే..కాఫీతో కార్తీక్ కథ మారిపోతుందంటూ ప్లాన్ చేసిన విషయం మోనిత గుర్తుచేసుకుంటుంది. అయితే భారతి మాత్రం నువ్వే ఏదో చేసి ఉంటావని అనడంతో అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిపోతుంది మోనిత. ఇంకా మళ్ళీ సీన్ దీప దగ్గర ఓపెన్ అవుతుంది.ఆ బంగరామ్మ చీటీ ఇచ్చేట్టు కనిపించడం లేదు.అందుకే హోటల్ ఓనర్ కి తెలిసిన వాళ్ల దగ్గర చీటీవేయించి మొదటి నెల మనకు ఇప్పిస్తానన్నారు అంటూ ఆనంద్ తో మాట్లాడుతూ హోటల్ కి వెళుతుంది దీప. ఇంతలో దారిలో ఎదురైన అప్పారావుని ఎక్కడికి వెళుతున్నావ్ అని దీప అడిగితే సినిమాకు వెళుతున్నా అక్క.నా పని నా జూనియర్ చూసుకుంటాడులే అని ఫొటో చూపించేందుకు ప్రయత్నించినా వద్దులే అప్పారావ్ అనేసి వెళ్లిపోతుంది దీప.

తన శాడిజంను మరొకసారి బయటపెట్టిన మోనిత:

మరోవైపు బయటకు వెళ్లిన మోనిత..ఆదిత్యను చూసి బావున్నావా అని ఏంటి వదినా బావున్నావా అని అడగవేంటి ఆదిత్య అంటుంది. నువ్వు నా వదినవేంటి అని చిరాకు పడతాడు. అత్తయ్య, మావయ్యలు ఎలా ఉన్నారు, నా చెల్లెలు శ్రావ్యను అడిగానని చెప్పు… ఇంతకీ కార్తీక్ వాళ్లు ఎక్కడున్నారో చెప్పవా అంటుంది.అన్నయ్య వాళ్లు వెళ్లారన్న బాధలో నాన్న అనారోగ్యం పాలయ్యారు.నీకు వంద నమస్కారాలు చేస్తాం నా ఫ్యామిలీ జోలికి రాకు అంటూ ఆదిత్య ఫోన్ మర్చిపోయి వెళతాడు. అది గమనించిన మోనిత తన శాడిజం చూపిస్తూ అ ఫోన్ ను కారు చక్రాల కింద పెట్టి తొక్కించేస్తుంది..

హోటల్లో బల్లలు తుడుస్తూ ఉన్న కార్తీక్ ను చూసి దీప ఏమి చేసిందంటే..?

సీన్ కట్ చేస్తే హోటల్ ఉన్న కార్తీక్ పార్సిల్ ఇచ్చివస్తానని ఓనర్ కి చెప్పడంతో అప్పారావు లేడు కదా ఇక్కడెవరు చూసుకుంటారు ఆ పార్సిల్ నేను ఇచ్చేసి వస్తానని యజమాని తీసుకుంటాడు. ఇంతలో అక్కడకు వచ్చిన దీప టేబుల్ తుడుస్తున్న కార్తీక్ ని చూసి షాక్ అవుతుంది.డాక్టర్ గా తాను పొందిన సన్మానాలు తల్చుకుని ఎవండీ మీరు చేస్తున్న పనేంటని ఒక్కసారిగా గట్టిగా అరుస్తూ ఏడుస్తుంది దీప.ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.


Share

Related posts

‘రెండు ముక్కలు చేయోద్దు’

somaraju sharma

జూనియర్ ఎన్టీఆర్ సరికొత్త పార్టీ !చంద్రబాబు గుండెల్లో రైళ్లు!!

Yandamuri

Pawan kalyan: ఒకప్పుడు వెంకటేశ్ అయితే ఇప్పుడు ఆ మాట పవన్ కళ్యాణ్‌ను అంటున్నారు..!

GRK
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar