Karthika Deepam Jan 7 episode: అయ్యో డైరెక్టర్ గారు…ఇది మీకు న్యాయమా. మా దీపను ఏంటండీ ఇలా చేసేసారు…!

Share

Karthika Deepam Jan 7 episode: కార్తీక దీపం సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.నిన్నటి ఎపిసోడ్ లో రుద్రాణి అప్పు ఎలా తీర్చాలి, పిల్లలని ఎలా కాపాడుకోవాలో తెలియక కార్తీక్, దీపలు ఇద్దరూ కూడా ఆలోచనలో పడతారు.మరి ఈరోజు ఎపిసోడ్ లో ఏమి జరుగుతుందో తెలుసుకుందామా..ఆనందరావు హెల్త్ చెక్ చేసిన డాక్టర్ భారతి అంకుల్ మీరు కొంచెం ఆలోచనలు తగ్గించు కుంటే మీ ఆరోగ్యానికి మంచిది అంటుంది రిక్వస్ట్‌గా అప్పుడు ఆనందారావు నా పెద్దకొడుకు, కోడలు ఏదో ఊరు వెళ్లారు, రేపో ఎల్లుండో వస్తారు అంటే ఆ ఆలోచనలు వేరేగా ఉంటాయి.కానీ వస్తారో రారో తెలియనప్పుడు ఆలోచించకుండా ఎలా ఉంటానమ్మ అని లోపలికి బాధగా నడిచి వెళ్లిపోతాడు. దాంతో భారతి సౌందర్యతో.. ‘ఆంటీ అంకుల్ ఇలానే ఆలోచిస్తూ ఉంటే డిప్రెషన్‌లోకి వెళ్లిపోతారు.. మీరు ఓ పని చేయండి ఆంటీ’ అంటూ ఏదో సలహా ఇచ్చి వెళ్ళిపోతుంది భారతి.

Deeparadhana : మీరు దీపారాధన కోసం ఈ కుందులు వాడుతున్నారా??దీపం  వెలిగించడానికి అగ్గిపుల్లను వాడుతున్నారా?

Karthika Deepam Jan 7 episode: విన్నీ ఎవరు?మోనిత దగ్గరకు ఎందుకు వస్తుంది?

సీన్ కట్ చేస్తే కార్తీక్,దీప తయారు చేసిన పిండి వంటలను ప్యాకింగ్ చేస్తూ ఉంటాడు. అది చూసి దీప ‘ఇలాంటి చిన్న చిన్న పనులు రాజు చేయకూడదు’ అంటూ కార్తీక్‌ని ఉద్దేశించి అంటుంది.ఇంతలో పిల్లలు స్కూల్‌కి వెళ్తూ వెళ్తూ అమ్మా ఈరోజైనా భోజనం తెస్తావా లేదా?’ అని అడగడంతో ‘తెస్తానమ్మా’ అంటుంది దీప.ఇంకా మోనిత సౌందర్య ఆంటీ గురించి తలుచుకుని రగిలిపోతూ ఉంటుంది. అమ్మా మహేష్‌ని గూడాచారిగా మార్చి కార్తీక్‌ని వెతికిస్తున్నారా వెతికించండి. చివరకు అంతిమ విజయం నాదేలే అనుకుంటుంది నవ్వుతూ. ఇంతలో ఓ ఫోన్ వస్తుంది మోనితకి. ‘మేడమ్ నేను విన్నీని మాట్లాడుతున్నా అంటూ కొత్త క్యారెక్టర్ మోనితకు ఫోన్ చేస్తుంది. అడ్రెస్ చెప్పి రమ్మంటుంది.

AP News: జగన్ ని గుడ్డిగా ఫాలో అయిపోతున్న చంద్రబాబు..!?
రోడ్డుపై కార్తీక్ వింత ప్రవర్తన చూసి గుమిగూడిన జనాలు :

మరోవైపు కార్తీక్ జరిగింది అంతా తలుచుకుంటూ రోడ్డు మీద నడుస్తూ అబ్బా అని తలకొట్టుకుంటూ పిచ్చిగా ప్రవర్తిస్తాడు. అది చూసి అందరు గుమిగూడతారు. అప్పటికే దీప చేతిలో రెండు బ్యాగ్స్ పట్టుకుని, మోనిత కొడుకుని వీపుకి కట్టుకుని, షాప్స్ అన్ని తిరుగుతూ జంతికలు అమ్ముతూ ఉంటుంది. దూరం నుంచి కార్తీక్ ప్రవర్తన చూసి పరుగున వచ్చి ‘ఏం అయ్యిందండీ అంటూ కార్తీక్‌ని పట్టుకుని,‘మీరు వెళ్లండమ్మా’ అని అందరినీ పంపేస్తుంది. తర్వాత కార్తీక్‌ని ఓక బల్ల మీద కూర్చోబెట్టి.. ‘కార్తీక్ బాబు జీవితంలో ఏం కోల్పోయినా తిరిగి తెచ్చుకోవచ్చు కానీ జీవితాన్ని కోల్పోకూడదు అంటూ కార్తీక్‌కి నచ్చజెబుతుంది. ఆ తరువాత ఆ బ్యాగ్‌లోంచి ఒక లంచ్ బాక్స్ కార్తీక్ చేతికి ఇచ్చి ‘ఇది పిల్లలకు ఇచ్చేసి ఇంటికి వెళ్లండి. నేను వీటిని అమ్మేసి వస్తాను’ అంటూ కార్తీక్‌ని పంపిస్తుంది. పాపం దీప అన్ని చోట్ల తిరుగుతూ జంతుకులు అమ్మే ప్రయత్నం చేస్తుంది కానీ.. ఎవ్వరూ కొనరు. ఎందుకంటే కొన్ని షాపులకు దీప కంటే ముందుగా రుద్రాణి జంతుకులు అమ్మేస్తుంది. ‘ఇదిగోమ్మా నీ కంటే తక్కువగా ఇచ్చారు అనడంతో దీప నిరాశ చెందుతుంది.

పిల్లల లంచ్ బాక్స్ నేలపాలు చేసిన కార్తీక్ :

మరో వైపు కార్తీక్ లంచ్ బాక్స్ తీసుకుని స్కూల్‌కి వెళ్లేసరికి పిల్లలు పరుగున వచ్చి ‘నాన్నా చాలా ఆకలి వేస్తోంది.తెచ్చావా?’ అంటారు. ఇదిగో అమ్మా తెచ్చాను అనేలోపు ఒక పిల్ల పరుగున వచ్చి చూసుకోకుండా కార్తీక్‌ని గుద్దేసి వెళ్లిపోతుంది.దాంతో తెచ్చిన క్యారేజ్ కాస్త కింద పడి మొత్తం అన్నం కింద పడిపోవడంతో అక్కడ కాస్త ఎమోషనల్ అవుతారు కార్తీక్, పిల్లలు.అయ్యో ‘నా వల్లే తప్పు జరిగింది’ అని కార్తీక్ బాధపడిపోతుంటే ‘ నీ వల్లేం కాదులే నాన్న అయినా మాకంత ఆకలి లేదులే’ అంటారు పిల్లలు. ‘లేదమ్మా మీకు.. మళ్లీ అన్నం తెస్తాను అంటూ కింద పడిన అన్నంతో పాటు క్యారేజ్ బాక్స్ కూడా అక్కడే వదిలేసి వెళ్లిపోవడం చూస్తే కాస్త బాధ అనిపిస్తుంది చూసే ప్రేక్షకులకు.. మరి తరువాత ఎపిసోడ్ లో ఏమి జరుగుతుందో రేపు చూద్దాం.!


Share

Related posts

గ్యాస్ ట్రబుల్..! ఊపిరితిత్తులు పోయాయి..! 15 లక్షలు వదిలాయి..! చదవండి

somaraju sharma

Sprouts: ఇవి డ్రై ఫ్రూట్స్ కంటే ధర తక్కువ.. ప్రయోజనాలు బోలెడు..!!

bharani jella

బిడ్డ పుట్టినతర్వాత బాలింతలు తీసుకోవాలిసిన ఆహారం!!

Kumar