Karthika Deepam Jan6 Episode: దీపకు అసలు నిజం తెలిసిపోయిందా..? ఇవాళ ఎపిసోడ్ లో BIG TWIST

Share

Karthika Deepam Jan6 Episode: కార్తీక దీపం సీరియల్ రోజుకో కొత్త మలుపు తిరుగుతుంది.ఎప్పుడు ఏమవుతుందో తెలియక ప్రేక్షకులు తలలు పట్టుకుంటున్నారు. నిన్నటి ఎపిసోడ్ లో మోనిత బాబును మనమే పెంచుకుంటాము అని దీప పిల్లలకు అన్నం పెడుతూ అంటుంది. మళ్ళీ ఈరోజు ఎపిసోడ్ కూడా పిల్లలకు అన్నం పెట్టే సీన్ తోనే ప్రారంభమైంది.అమ్మా రుద్రాణి మీతో గొడవ పెట్టుకుని ఎందుకని మాతో బాగా ఉంటుంది అని అడుగుతారు. అసలు మీరు ఆమె గురించి ఆలోచించడం మానేయండి అంటుంది. మరోపక్క కార్తీక్ అందర్నీ బాధపెట్టి నేను ఏమి సాధించాను, మళ్ళీ ఇప్పుడు దానికి తగ్గట్టు రుద్రాణి తలనొప్పి ఒకటి అనుకుంటాడు. ఇంతలో అక్కడకు వచ్చిన దీప కార్తీక్ బాబు ఎందుకు బాధపడతారు.. మీ బలం ఏంటో మీకు తెలియదు. ఆ రుద్రాణి అప్పు గురించి టెన్షన్ పడుతున్నారా అని అడుగుతుంది దీప. అసలు మీరు అప్పుతీరుస్తా అని సంతకం చేసినప్పటి నుంచీ రుద్రాణి ఎందుకు మాటిమాటికి ఇంటికొస్తోంది, పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోంది అని అడుగుతుంది.నా దగ్గర ఏదైనా విషయం దాస్తున్నారా అని అడుగుతుంది దీప.

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ 6 కి రామ్ గోపాల్ వర్మ ని మించిన మెంటల్ గాడు ఒకడు వస్తున్నాడు..??

Karthika Deepam Jan6 Episode: అసలు నిజం తెలిసి దీప ఏమి చేయనుంది..?

రుద్రాణి పెట్టిన గడువులోగా బాకీ సొమ్ము చెల్లించకపోతే పిల్లల్లో ఒకర్ని తీసుకెళ్లిపోతానందని అసలు నిజం చెబుతాడు. ఆ మాట విని షాక్ అయిన దీప అసలు అలా ఎలా ఒప్పుకున్నారు, మాటకోసం బిడ్డని ఇచ్చేస్తారా, నా బతుకింతేనా?ఎప్పుడూ బిడ్డల్ని దూరం చేసుకునే బతకాలా.?అని ఏడుస్తుంది.. ఆ సీన్ చూడడానికి కాస్త ఎమోషనల్ గా ఉంటుంది.ఆవేశంలో సంతకం పెట్టాను కానీ ఆ పేపర్స్ లో రుద్రాణి అలా రాయించింది అని తర్వాత తెలిసింది అంటాడు. అంటే మీరు సంతకం పెడితే నా బిడ్డని తను ఎలా తీసుకెళుతుంది..అంతా మీ ఇష్టమేనా..దేవుడా ఏంటిది అని బోరున విలపిస్తుంది దీప. ఎన్నో బాధలు అనుభవించాను,అన్నీ సర్దుకున్నాయి అనేసరికి ఆస్థి పోయి రోడ్డున పడ్డాము. అయిన బాధ పడలేదు.అంతా కలసి ఉంటే చాలనుకున్నాను. ఇక్కడేదో కష్టం చేసుకుని బతుకుతుంటే ఆ రుద్రాణికి నా బిడ్డలపై కన్ను పడిందా..నన్ను ఏం చేద్దాం అనుకుంటారు డాక్టర్ బాబు అని ప్రశ్నిస్తుంది దీప.


YS Jagan: జగన్ మారుతున్నారా..!? దారిలోకి తెస్తున్నారా..!?

ఆవేశంలో రుద్రాణి ఇంటికి వెళ్లిన కార్తీక్:

సీన్ కట్ చేస్తే రుద్రాణి తన దగ్గర ఉన్న రౌడీతో నువ్వేదో డబ్బులు అడిగావు కదరా గుర్తుచేయాలి కదా అంటుంది రుద్రాణి. డబ్బులు తీసుకోవడమే కాదు చెప్పిన పని చేయడం కూడా నేర్చుకోండి అంటుంది రుద్రాణి. ఇంతలో అక్కడకు వచ్చిన కార్తీక్ ని చూసి ఏంటి ఈ సమయంలో దారితప్పి వచ్చారని అడుగుతుంది. మీరు పెత్తనం చేస్తారో, అధికారం చేస్తారో మీ ఇష్టం..కానీ నా పిల్లల జోలికి రావొద్దని హెచ్చరిస్తాడు. మీ బాకీ తీర్చడంతో మీకు-మాకు ఎలాంటి లావాదేవీలు ఉండవని తేల్చి చెబుతాడు. అగ్రిమెంట్ లో రాసుకున్నదాని ప్రకారం నీ కూతుర్లలో ఒకర్ని తెచ్చుకోవడం,పెంచుకోవడం ఖాయం అంటుంది.అప్పుడు నేను వచ్చి రామ్మా అంటే పిల్లలు రారుకదా అందుకే ఇప్పటి నుంచి వాళ్ళని మచ్చిక చేసుకుంటున్నా అంటుంది. కోపంతో కార్తీక్ మీ మంచి కోరి చెబుతున్నా నా పిల్లల గురించి ఆలోచించడం మానేయండని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు.

దీప మంచితనం చూసి తలదించిన కార్తీక్:

ఇంటికి వచ్చిన కార్తీక్ ని చూసి ఎక్కడికి వెళ్లారని అడుగుతుంది  దీప. అప్పు తీర్చకపోతే అమ్మాయిని తీసుకెళ్తా అంటుంది ఆ రుద్రాణి.. నాకు తల్చుకుంటేనే కడుపు మండిపోతోంది అంటాడు. మనం ఇప్పుడు ఆవేశపడి ఏమి చేయలేము ఆలోచించండి అన్న దీప ఎలాగైనా అప్పు తీర్చేద్దాం అంటుంది.గడువులోగా అప్పు తీర్చకపోతే బిడ్డను ఇస్తాం అని సంతకం చేసిన గొప్ప తండ్రిని కదా ఈ విషయం నా పిల్లలకు తెలిస్తే వాళ్ళకి ఏమని చెప్పను అని కన్నీళ్లు పెట్టుకుంటాడు. మీరు తెలిసి ఏ తప్పూ చేయలేదు డాక్టర్ బాబు అంటుంది .ఎందుకు దీప నేను ఎన్ని తప్పులు చేసినా ఎందుకు గట్టిగా అరవ్వు అంటాడు.నీ మంచితనం ఓపిక రోజురోజుకీ నన్ను కుచించుకుపోయేలా చేస్తున్నాయి.నన్ను కసితిరా తిట్టు, ఎందుకు ఇలా చేసారు అని నన్ను నిలదీయ్ అని జరిగిపోయిన విషయాలు గుర్తు చేసుకుంటాడు. కార్తీక్ మాటలు విన్న దీప డాక్టర్ బాబు మీరు తెలిసి ఏ తప్పూ చేయరని నా నమ్మకం.పిల్లలకు ఈ విషయం తెలియదు కదా.ఆ రుద్రాణి అప్పు సంగతి మనం చూసుకుందాం.ఓ చీటీ వేసి అప్పు తీర్చేద్దాం అంటుంది దీప. మీరు అవునన్నా కాదన్నా ఎప్పటికీ మీరు నా డాక్టర్ బాబే అంటుంది నవ్వుతూ దీప. ఇక్కడితో ఈ రోజు ఎపిసోడ్ ముగిసింది..


Share

Related posts

అక్కడ కనిపించిన ఏలియన్.. బెదిరిపోయిన జనాలు!

Teja

రాజా… బూజా… వైసీపీకి కంట్లో నలుసు

Special Bureau

ఆలయంపై కెసిఆర్ గుర్తులు తొలగించాలి

somaraju sharma