NewsOrbit
న్యూస్

Karthika Deepam: నిరూపమ్ అన్న మాటలు తలుచుకుని ఆనందంలో జ్వల..మరోపక్క అందరి చేత మాటలు పడుతున్న హిమ..!

Karthika Deepam: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది.గత ఎపిసోడ్‌లో హిమ చేసిన పని తలుచుకుని బాధతో నిరుపమ్ బాగా తాగుతాడు. ఇక నిరూపమ్ తాగిన మైకంలో హిమను తలుచుకుని జ్వాల ముందు ఐ లవ్యూ అంటాడు. జ్వల ఏమో తనకే డాక్టర్ సాబ్ ఐ లవ్ యూ చెప్పాడని మురిసిపోతుంది.మరోపక్క హిమ ఇల్లు వదిలి వెళ్లిపోవడానికి బ్యాగ్ తీసుకుని బయలుదేరే సమయానికి సౌందర్య ఎదురుగా చేతులు కట్టుకుని నిలబడుతుంది.సరిగ్గా ఈరోజు కూడా అదే సీన్ కంటిన్యూ అయ్యింది.

Karthika Deepam Latest Episode
Karthika Deepam Latest Episode

ఇంట్లో నుంచి వెళ్ళిపోనున్న హిమ:

ఇంట్లో నుంచి వెళ్ళిపోతా అన్నా హిమతో నువ్వు ఎలాగో మాట వినవు హిమా.. నువ్వు ఏం అనుకున్నావో అదే చేస్తావని నాకు తెలుసు.. వెళ్లు అంటుంది.నీకేంటి పెద్దదానివయ్యావ్..డాక్టర్‌వి.. ఇక నీకు మా అవసరం ఏముంటుందిలే అంటుంది సౌందర్య. నువ్వు వెళ్తే వెళ్ళావ్ గాని ఈ పెళ్లి ఎందుకు క్యాన్సిల్ చేశావనేది చెప్పే ఇక్కడ నుంచి కదులు’ అంటుంది సౌందర్య కోపంగా. దాంతో హిమ ఏమి సమాధానం చెప్పాలో అర్ధం కాక ఒక్కసారిగా సౌందర్యని పట్టుకుని ఏడ్చేస్తుంది.

Karthika Deepam Latest Episode
Karthika Deepam Latest Episode

హిమ గురించి చెడుగా చెప్పే ప్రయత్నంలో స్వప్న :

సీన్ కట్ చేస్తే స్వప్న నిరుపమ్‌కి భోజనం పెట్టి హిమను మరిచిపోరా.. నీకు గొప్ప సంబంధం చూస్తాను’ అంటూ ప్రేమగా నచ్చజెబుతుంది. కానీ నిరుపమ్ జరిగిందే తలుచుకుని ప్లేట్‌లోనే చేయి కడుక్కుని వెళ్లిపోతాడు. ఇక స్వప్న మాత్రం హిమ దరిద్రం వదిలింది అనుకుంటే జ్వాల రూపంలో మరో దరిద్రం తగిలింది దాన్ని ఎలా అయినా వదిలించాలి’ అనుకుంటుంది.

Karthika Deepam Latest Episode
Karthika Deepam Latest Episode

డాక్టర్ సాబ్ మాటలకూ ఆనందంలో జ్వాల :

ఇక జ్వాల మాత్రం తాగి ఉన్న నిరుపమ్‌ మాటలను గుర్తు చేసుకుంటూ ఆనందంలో మునిగి తెలుతుంది. చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పాటలు ‘సామీ సామీ సాంగ్’ పాటకు ఒక రేంజ్ లో స్టెప్స్ వేస్తూ ఊగిపోతూ ఉంటుంది ఇక జ్వాల అలా చెవిలో పాటలు పెట్టుకుని ఓ ఊగిపోతుంటే.. చంద్రమ్మ, ఇంద్రుడు ఇద్దరూ చూసి నవ్వుకుంటారు. జ్వాలను ఆపి.. విషయం ఏంటని అడుగుతారు. ‘కారణం అడగొద్దు కానీ మీకు మాత్రం పార్టీ ఇస్తాను అంటుంది.నేను ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను మనం ఈ రోజు భోజనం బయట చేద్దాం అంటుంది జ్వాల సంబరంగా దానికి ఇంద్రుడు ఎందుకమ్మా అనవసరంగా డబ్బులు ఖర్చు చేయడం అంటే సరే అని మీకు నచ్చినట్టు చేయండి అని డబ్బులు ఇస్తుంది.

Karthika Deepam Latest Episode
Karthika Deepam Latest Episode

జ్వాలకు థాంక్స్ చెప్పిన నిరూపమ్ :

ఇక జ్వాల గత రాత్రి నిరుపమ్ వదిలిపెట్టిన కారు దగ్గరకు వస్తుంది. అయితే అక్కడ అనుకోకుండా నిరుపమ్ ఉండటంతో.. ‘డాక్టర్ సాబ్.. మీరు ఇక్కడున్నారా? రాత్రి మీరు చాలా చాలా అన్నారు తెలుసా’ అంటుంది సిగ్గుపడుతూ.. ‘అయ్యో సారీ జ్వాలా ఏం అన్నానో ఏంటో అంటాడు
పర్లేదు డాక్టర్ సాబ్ మీరు ఏం అన్నా నాకేం ఫర్వలేదు కారు ఎలా ఉందా అని చూడటానికి వచ్చాను అంటుంది జ్వాల. ‘నువ్వు ఎంత మంచి దానివి,నా కారు చూడటానికి ఇంత దూరం వచ్చావా?’ అంటూ నిరుపమ్ మళ్లీ జ్వాలకు థాంక్స్ చెబుతాడు. అయ్యో డాక్టర్ సాబ్ మన మధ్య థాంక్స్‌లు వద్దు అంటుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో హిమ హాస్పిటల్ కి వెళ్తుంది. కానీ హిమతో నిరూపమ్ మాట్లాడడు. ఇక మరో పక్క సౌందర్య జ్వలను బలవంతంగా తన కారులో ఎక్కించుకోవడాన్ని ప్రోమోలో చూపించడం జరిగింది.!

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!