NewsOrbit
న్యూస్

Karthika Deepam: హిమ,నిరూపమ్ ల మధ్య జ్వాల అడ్డు తిలగించే అందుకు సౌందర్య మాస్టర్ ప్లాన్.. జ్వలను సౌందర్య ఎక్కడికి తీసుకుని వెళ్లనుంది..!

Karthika Deepam: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది.గత ఎపిసోడ్‌లో హిమ ఇల్లు వదిలి వెళ్లిపోదాం అనుకుంటే సౌందర్య ఆపేస్తుంది. ఇక జ్వాల.. తాగిన మత్తులో నిరుపమ్ అన్నా మాటలు తలుచుకుని తెగ మురిసిపోతుంది.ఈ క్రమంలోనే ఈరోజు ఎపిసోడ్ మరింత ఉత్కంఠగా సాగిందనే చెప్పాలి..నిరుపమ్, జ్వాలలు ఇద్దరు కూడా కారు దగ్గర దగ్గర కలుస్తారు.నిరుపమ్ జ్వలకు థాంక్స్ చెబుతాడు. అయ్యో మనలో మనకు థాంక్స్ ఏంటి డాక్టర్ సాబ్ అని అంటుంది జ్వల. కాసేపు ఇద్దరు మాట్లాడుకున్నాక అక్కడ నుంచి కారు వేసుకుని వెళ్లిపోతాడు నిరూపమ్.ఇక డాక్టర్ సాబ్ వెళ్ళిపోయాక ఐ లవ్యూ అంటూ గట్టిగా అరుస్తుంది జ్వాల.

karthika deepam latest episode
karthika deepam latest episode

హిమను నిరూపమ్ ఎంతగా ప్రేమిస్తున్నాడో పాపం:

సీన్ కట్ చేస్తే హిమా ఆసుపత్రికి వెళ్తుంది. వెళ్లడంతోనె ఎదురుగా ఇద్దరు డాక్టర్లు బయట నిలబడి హిమని చూడగానే గుళ్లో జరిగిన ఎంగేజ్మెంట్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు.హిమ విని విన్నట్టు అక్కడ నుండి లోపలికి వచ్చిన తర్వాత మరొకరు కూడా అలానే హిమ గురించి మాట్లాడం విని ఆవేశంగా హిమ ఎదుటివారి జీవితాల్లోకి తొంగి చూడటం తప్పా మీకు వేరే పని లేదా అంటూ అరుస్తుంది. ఇక హిమ లోపలికి వెళ్లే క్రమంలో నిరుపమ్ ఓ ఫైల్ పట్టుకుని ఎదురుగా నిలబడి ఉంటాడు.అయితే నిరుపమ హిమా మొహం కూడా చూడకుండా అక్కడ నుండి లోపలికి వెళ్ళిపోతాడు. హిమ కూడా నిరుపమ్ వెనుకే లోపలికి వచ్చి బావా నాతో మాట్లాడు అని బతిమలాడితే.. ‘చెప్పండి డాక్టర్ హిమ’ అంటూ కోపంగా అంటాడు నిరుపమ్. అదేంటి బావా.. నాతో మాట్లాడు అంటూ చేతిలోని ఫైల్ గట్టిగా లాగుతుంది.ఆ ఫైల్ లో నుంచి హిమ ఫొటోలే కింద పడిపోతాయి. వాటిని చూసి హిమ మరింత బాధపడుతుంది.కిందపడిన ఫొటోస్‌ని తీసుకుని నిరుపమ్ అక్కడ నుంచి వెళ్లిపోతాడు.

karthika deepam latest episode
karthika deepam latest episode

ఆక్సిడెంట్ చేసిన సౌందర్య:

మరో సీన్ లో జ్వల… సత్య సార్ కి భోజనం తీసుకుని వెళ్తుంది. సత్య గుళ్లో జరిగిన విషయం తలుచుకుని బాధగా ఉంటే.. ఏం జరిగింది సార్ అంటూ ఒడ్డిస్తూనే అడుగుతుంది. ఏమి లేదు అని మాట మారుస్తాడు. ఇక జ్వాల అయితే మనసులో ‘డాక్టర్ సాబ్‌తో నా పెళ్లి అంటే ఈ సత్యా సార్ ఒప్పుకుంటారా?ఆటో అమ్మాయిగా వీళ్లకి ఓకే కానీ ఈ ఇంటి కోడలిగా ఓకే అంటారా అని తనలో తనే ఆలోచించుకుంటుంది. ఇక సౌందర్య ఏదో ఆలోచిస్తూ కారులో వెళ్తూ చూసుకోకుండా ఒక ముసలామెని గుద్దేస్తుంది. ఆమె తలకు దెబ్బ తగిలి కింద పడిపోతుంది. వెంటనే సౌందర్య ఆసుపత్రికి తీసుకుని వెళ్తుంది. ఆ తర్వాత ఆ ముసలమ్మను చూడడానికి ఆమె ఇంటికి వెళ్తుంది సౌందర్య.

సౌందర్యను ఫాలో అయిన జ్వల :

ఆ సందులోనే సౌర్య ఆటోలో వస్తూ సౌందర్యని చూసి ఫాలో అయ్యి ఆ ముసలామె ద్వారా విషయం తెలుసుకుంటుంది.ఇక ఆ ములసమ్మ మాత్రం సౌందర్య మాట్లాడే ప్రతి మాటకు ఏదొక పుల్లవిరుపు సమాధానం చెప్పడంతో సౌందర్యకు మండి మళ్లీ వచ్చి కలుస్తాను’ అని చెప్పి జ్వాలని లాక్కొచ్చి తన కారులో మాట్లాడకుండా కూర్చో అని కారు స్టార్ట్ చేస్తుంది కానీ కార్ స్టార్ట్ అవ్వదు. ఇక జ్వల ఓయ్ సీసీ నీలానే ఈ కారు కూడా ముసలిది అయిపోయింది మార్చేయరాదు’ అంటూ సౌందర్యను అంటుంది. మళ్ళీ కాసేపటికి కారు స్టార్ట్ అవుతుంది. ఆ సమయంలోనే కారులో ఉన్న ఒక విజిటింగ్ కార్డ్ ను సౌందర్యకు తెలియకుండా తీసేస్తుంది జ్వాల. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ పూర్తయింది.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!