న్యూస్

Karthika Deepam: హిమకు జ్వల ప్రేమ విషయం ఎలా తెలిసిందో మీరు తెలుసుకోండి…!

Share

Karthika Deepam:బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్. రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. గత ఎపిసోడ్ లో హిమ, నిరుపమ్‌ల నిశ్చితార్థం గుడిలో జరుగుతుంటే అక్కడకు అనుకోకుండా సౌర్య(జ్వాల) వెళ్లడంతో నేటి ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా మారింది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏమి జరిగిందో అనేది ముందుగా తెలుసుకుందాం.ఎంగేజ్మెంట్ జరిగే గుడికి వచ్చిన జ్వల దేవుడి ముందు నిలబడి దన్నం పెట్టుకోవడంను కాస్త దూరం నుంచి పీటల మీద కూర్చున్న హిమ చూసి షాక్. అవుతుంది.ఆమ్మో జ్వల గాని ఇప్పుడు నన్ను నాన్నమ్మని కలిపి ఒకేసారి చూస్తే నేనే హిమను అనే విషయం తనకి తెలిసే ప్రమాదం ఉంది అనుకుంటూ చాలా టెన్షన్ పడుతుంది. అయితే సౌర్య వాళ్లని చూడకుండానే బయటికి వెళ్లిపోవడంతో హిమ ఊపిరి పీల్చుకుంటుంది.

Karthika Deepam: ఈ పెళ్లి అంటే ఇష్టం లేదు అని చెప్పి వెళ్ళిపోయిన హిమ :

మరోపక్క స్వప్న మనసులోనే తెగ రగిలిపోతుంది. ఎలాగయినా ఈ కార్యక్రమాన్ని ఆపాలి అని మనసులో బలంగా అనుకుంటుంది. సరిగ్గా తాంబూలాలు మార్చుకునే సమయానికి హిమ ధైర్యం చేసి అక్కడ నుండి లేచి నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని అంటుంది. ఆ మాట విని స్వప్న మొదట షాక్ అయ్యి ఆ తర్వాత సంతోషిస్తుంది. కానీ హిమ అలా అనేసరికి మిగిలిన వారు అందరు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ‘హిమా ఏం మాట్లాడుతున్నావ్ అంటాడు నిరుపమ్ ఆశ్చర్యంగా.. ‘సారీ బావా అని చెప్పి సౌందర్య పిలుస్తున్నా వినకుండా హిమ గుడి నుంచి వెళ్లిపోతుంది. హిమ ప్రవర్తన చూసి ప్రేమ్‌కి సంతోషించాలో లేక బాధపడాలో అర్థం కాదు. ఇక అందరూ తలోక రకంగా మాట్లాడుకుని అక్కడ నుండి వెళ్ళిపోయాక గుడిలో సౌందర్య, స్వప్నలు నిలబడి ఉంటారు. ‘ఏంటి మమ్మీ ఇప్పుడు నీ కళ్లు చల్లబడ్డాయా..? నువ్వు నీ మనవరాలు కావాలనే ప్లాన్ చేసి మరి మా పరువు తియ్యాలని అనుకున్నారు కదా అంటూ హిమను బాగా తిట్టి అరుస్తుంది. సౌందర్య మాత్రం మౌనంగా ఉంటుంది.

జ్వాల… నిరూపమ్ ను ప్రేమిస్తుందని హిమకు ఎలా తెలిసిందంటే..?

ఇక హిమ నేరుగా ఇంటికి వెళ్లి దీప, కార్తీక్‌ల ఫొటో ముందునిలబడుతుంది. మమ్మీ,డాడీ నేను మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను.. మన సౌర్య కోసం ప్రాణమే అడ్డేద్దాం అనుకునేదాన్ని.. కానీ ఈరోజు నా ప్రేమని అడ్డేశాను అని అంటుంది.మన సౌర్య నిరుపమ్ బావని ఇష్టపడుతోంది అని నాకు లేట్ గా తెలిసింది. అసలు.నాకు ఈ విషయం ఎలా తెలిసిందో అంటూ జరిగింది గుర్తు చేసుకుంటుంది హిమ.షాపింగ్ కి అయ్యాక జ్వాల, హిమ ఇద్దరు కలిసి ఐస్ క్రీమ్ కార్నర్‌కి వెళ్లిన రోజున సౌర్య డ్రెస్ మీద ఐస్ క్రీమ్ పడితే క్లీన్ చేసుకోవడానికి వాష్ రూమ్ కు. వెళ్తుంది. ఆయితే జ్వల తన ఫోన్ ను టేబుల్ మీద పెట్టి వెళ్తుంది. సరిగ్గా అప్పుడే నిరుపమ్ జ్వలకు కాల్ చేస్తాడు. అయితే నిరుపమ్ నంబర్‌ని జ్వల ‘నా మొగుడు’ అని సేవ్ చేసుకుంటుంది.

నా మొగుడు అని నిరూపమ్ నెంబర్ ను సేవ్ చేసుకున్న జ్వల..

అది చూసిన హిమ షాక్ అయ్యి ఈ నంబర్ నిరుపమ్ బావది కదా అని అనుకుని అంటే సౌర్య బావని ఇష్టపడుతుందా.. అంటూ ఏడ్చి జ్వలకు చెప్పకుండానే హిమ అక్కడ నుంచి వెళ్లిపోతుంది.డాడీ ‘నాకు ఆ రోజే నిజం తెలిసింది మన సౌర్యకి నిరుపమ్ బావంటే చాలా ఇష్టం. అందుకే సౌర్యకు నిరుపమ్ బావకు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాను అని అంటుంది..ఎలాగయినా సౌర్యకి నిరుపమ్ బావతో పెళ్లి చేయడమే నా జీవిత లక్ష్యం. ఈ పెళ్ళికి ఎవ్వరూ అడ్డొచ్చినా, ఎన్ని కష్టాలొచ్చినా సరే వాళ్లిద్దరికీ పెళ్లి చేసి తీరతాను. ఇదే సౌర్య మీద నాకున్న ప్రేమ అని తల్లిదండ్రుల ఫొటోకి దన్నం పెట్టుకుంటుంది.సీన్ కట్ చేస్తే జరిగినది గుర్తు చేసుకుని హిమ బాధగా తన బెడ్ రూమ్‌లో బెడ్ మీద కూర్చుంటుంది. అప్పుడే సౌందర్య ఆవేశంగా వచ్చి హిమను నానా మాటలు అనడంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.!


Share

Related posts

Harish Rao: ఈట‌ల‌కు అదిరిపోయే షాకిచ్చిన హ‌రీశ్ రావు

sridhar

AP Capital Issue: తీర్పు ఊహించిందే..మా ఆలోచన విధానంలో మార్పు లేదంటూ మంత్రి బొత్స సంచలన కామెంట్స్

somaraju sharma

Alitho Saradaga : తన క్రష్ గురించి ఆలీకి చెప్పేసిన లావణ్య త్రిపాఠి?

Varun G
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar