NewsOrbit
న్యూస్

Karthika Deepam Mar 19 Today Episode: తప్పుచేసిన హిమ ఇంట్లోకి.. సౌర్య బయటకు ఇదెక్కడి న్యాయం సౌందర్య గారు..!

Karthika Deepam Mar 19 Today Episode: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ కొత్త తరం వాళ్ళతో. సరికొత్త హంగులు దిద్దుకుంది. కార్తీక్,దీపలు లేరనే విషయాన్ని ఇప్పటికి ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇకపోతూ గత ఎపిసోడ్ లో సౌందర్యతో పాటు కారులో వెళ్తున్న నిరూపమ్ హిమను చూసి సౌందర్యకు చెప్పి కారు ఆపించి హిమను చూసానని చెప్తాడు.హిమా మంచినీళ్లు తాగిన షాప్ దగ్గరకు వెళ్ళేలోపు అక్కడ హిమ ఉండదు. షాప్ అతనికి హిమ ఫోటో చూపించి ఈ పాపనేనా మీరు చూసింది అని అడుగుతుంది అవును అంటాడు షాప్ యజమాని. ఇక హిమ కారు కింద పడిపోతు యాక్సిడెంట్ అయ్యే సమయానికి సౌందర్య వచ్చి కాపడుతుంది.

Karthika Deepam Mar 18 Today Episode: హిమను చుసిన సౌందర్య… తనను ఇంటికి తీసుకుని వెళ్తుందా… మరి సౌర్యను ఎలా పేస్ చేస్తుందో..?

Karthika Deepam Mar 19 Today Episode: సౌర్యను ఓదార్చేది ఎవరు..?

మరోపక్క సౌర్య అమ్మా,నాన్నల ఫోటోలు చూసుకుంటూ బాధ పడుతూ ఉంటుంది. హిమ వలనే నేను ఈరోజు ఎవరు లేని అనాధలా మిగిలి పోయాను అని హిమ మీద కోపంతో రగిలిపోతుంది. ఇంతలో ఆదిత్య, శ్రావ్యలు వచ్చి సౌర్యను ఓదార్చుతూ తప్పు సౌర్య హిమ మీద కోపం పెంచుకోకు అంటారు. ఎంతఅయినా మీరిద్దరూ అక్కాచెల్లెళ్లు, అలా చనిపోయిన హిమ గురించి ఇలా తప్పుగా మాట్లాడకు అని శ్రావ్య అంటే పిన్ని అది. ఎప్పటికి నాకు ఏమి కాదు. దాని పేరు ఈ ఇంట్లో ఎత్తకండి అంటూ అరుస్తుంది. అయినా హిమ చనిపోయి ఉండదు. అమ్మా, నాన్న ఎలాయినా దాన్ని బతికించే ఉంటారు. దాన్ని మాత్రం ఎక్కడున్నా వదిలిపెట్టను అంటుంది సౌర్య.

Karthika Deepam Mar17 Today Episode: రెస్టారెంట్ లో హిమ జీవితం ఊహించని మలుపు తిరగనుందా..కొంపతీసి దొంగలా మారదు కదా..!
హిమను ఇంటికి తీసుకుని వచ్చిన సౌందర్య… మరి సౌర్య రియాక్షన్ ఏంటో..?

ఇంతలో సౌందర్య హిమను ఇంటికి తీసుకు రావడం చూసి అందరూ కూడా షాక్ అవుతారు. అమ్మా హిమ నువ్వు బతికే ఉన్నావా అంటూ శ్రావ్య,ఆదిత్య,ఆనందరావులు హిమను చూసి సంతోషిస్తారు. మరోపక్క హిమ బయపడుతూనే ఇంట్లోకి వస్తుంది. హిమను చుసిన సౌర్య మాత్రం కోపంతో రగిలిపోతుంది. ఎందుకు వచ్చావ్ మళ్ళీ నా చేతిలో చావడానికి వచ్చావా.. వెళ్ళిపో అంటుంది.. సౌర్య అమ్మా, నాన్న చనిపోయేటప్పుడు నిన్ను నన్ను ఇద్దరిని కలిసి ఉండమని చెప్పారు అంటుంది హిమ.అయినా నేను కావాలని అలా చేయలేదు కదా సౌర్య చిన్నపిల్లని తెలియక చేసిన తప్పుకు నన్ను ఇంతలా శిక్షించకు అంటుంది హిమ.. అవును నువ్వు చిన్న పిల్లవే. వద్దు వద్దు అని అమ్మా నేను అంటున్నాగాని నీ మొండితనంతో కారు నడపి అమ్మా నాన్నలను చంపేసిన రాక్షసివి నువ్వు అని హిమ మీద విరుచుకుపడుతుంది.నాన్నమ్మ నేను మీకు ముందే చెప్పాను హిమను ఇంటికి తీసుకుని వస్తే నేను. మీకు దక్కను అని చెప్పా అయినాగాని మళ్ళీ హిమను ఇంటికి తీసుకుని వచ్చావ్. అంటే నేనంటే నీకు ఇష్టం లేదు కదా.. ఆ హిమ అంటేనే మీకు ఇష్టం. ఎంతయినా చిన్నప్పటి నుండి మీదగ్గరే పెరిగింది కదా.. అవునులే నేను రౌడీని కదా అందుకే నేనంటే మీకు ఎవరికీ ఇష్టం లేదు అంటుంది సౌర్య ఇంతలో.

Karthika Deepam Mar16 Today Episode: హిమను అనాథను చేసిన సౌర్య.. మరోపక్క ఆనంద్ మోనిత కొడుకు అని తెలుసుకున్న హిమ ఏమి చేయనుంది.?
పచ్చబొట్టుని చేరిపే పనిలో పడ్డ సౌర్య:

సౌందర్య అలా మాట్లాడకు సౌర్య మీరిద్దరూ మాకు సమానమే అంటుంది. వద్దు నాకేమి చెప్పొద్దు అని అక్కడినుంచి బయటకు వెళ్ళిపోతుంది సౌర్య. సౌర్య వెనకాలే సౌందర్య, ఆనందరావు,హిమలు పరిగెత్తుకుంటూ వస్తారు అయినా కానీ సౌర్య వాళ్ళ మాట వినదు. ఇక హిమను ఓదార్చే ప్రయత్నం చేస్తారు అందరు. ఇంటికి వచ్చిన ప్రేమ్, నిరూపమ్ కూడా హిమను బాధపడకు.. సౌర్య మనసు మారుతుందిలే అని చెప్పి తనను ఓదార్చి వెళ్ళిపోతారు. మరుసటి రోజు ఉదయం అందరికి అన్నం తినిపిస్తూ ఉంటుంది సౌందర్య. సౌర్య నువ్వు కూడా రా అంటే రాను అంటుంది. హిమ పాపం అలానే చూస్తుండి పోతుంది. ప్రేమ్, నిరూపమ్ లను కూడా సౌర్య , హిమ చదివే స్కూల్లోనే వేద్దామని సౌందర్య అంటే ప్రేమ్, నిరూపమ్ ఇద్దరు సంతోషిస్తారు. కానీ సౌర్య మాత్రం హిమ చదివే స్కూల్లో నేను. చదవను అని మొండిగా మాట్లాడుతుంది. ఎందుకే నీకు అంత కోపం. అమ్మా నాన్నలు నా వల్లనే చనిపోయారు అనే బాధ హిమను వెంటాడుతుంది మళ్ళీ నువ్వు అలా మాట్లాడి దాన్ని ఇంకా బాధపెడతావా అంటుంది. అయినాగాని సౌర్య వినకుండా వెళ్ళిపోయి చేత్తిమీద ఉన్న పచ్చబొట్టును చేరిపే ప్రయత్నం చేస్తుంది. అనవసరంగా ఆ హిమ పేరు నా చేతి మీద వేయించుకున్నాను ఇది పోయేలా లేదు అని చిరాకు పడుతుంది. ఇంతలో సౌందర్య అక్కడికి వచ్చి ఏమి చేస్తున్నావే ఆ పచ్చబొట్టు చచ్చే దాక పోదు అది అలానే జీవితాంతం నీతోనే ఉంటుంది. మీ ఇద్దరు అక్కచెల్లలు అని గుర్తుపెట్టుకో అంటుంది సౌందర్య కాస్త కోపంగా.

ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన సౌర్య:

ఇక మరుసటి రోజు ఉదయం నుంచి సౌర్ బయటకు రాలేదు అనుకుంటారు సౌందర్య, ఆనందరావులు.ఇక సౌర్య ఇంకా రాలేదు ఏంటి అని డోర్ ఓపెన్ చేసి చూడగా రూమ్ లో సౌర్య ఉండదు.టేబుల్ మీద ఒక లెటర్ మాత్రం కనిపిస్తు ఉంటుంది. సౌందర్య కంగారుగా లెటర్ తీసి చదవడం మొదలుపెట్టిద్ది. నానమ్మ హిమ ఉన్న ఇంట్లో నేను ఉండలేను. అది ఈ ఇంట్లో లేకపోతే మీరు బాధ పడతారు. ఉంటే నేను బాధ పడతాను. అందుకే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను నానమ్మ. కానీ ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకోండి నేను ఎప్పటికి హిమను క్షమించలేను అని రాసి సౌర్య వెళ్ళిపోతుంది. ఆ లెటర్ చదివి సౌందర్యం కుప్పకూలిపోతుంది. హిమ ఇంట్లో పెరిగితే సౌర్య మాత్రం బయట ఎక్కడో పెరుగుతుంది. హిమ డాక్టర్ అవుతుంది. కానీ సౌర్య మాత్రం ఆటో నడుపుతూ ఎంట్రీ ఇవ్వడంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!