NewsOrbit
న్యూస్

Karthika Deepam Mar 22 Today Episode: సౌర్య ఆటో వెనకాల వదిలేదేలే అని ఎవరిని ఉద్దేశించి రాసిందో తెలుసా..?

Karthika Deepam Mar 22 Today Episode:బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ ఈరోజు సరికొత్తగా మొదలయింది. సీరియల్లో ఒక్కో పాత్రను ముగించుకుంటూ వస్తున్న డైరెక్టర్ ఈసారి సౌర్య, హిమ పాత్రలను కూడా ముగించేసారు. హిమ, సౌర్యలు ఇద్దరు పెద్దవాళ్ళు అయిపోవడం గత ఎపిసోడ్ లో చూసే ఉంటాము.ఇంటి. నుంచి పారిపోయిన సౌర్య జ్వాలగా పేరు మార్చుకుని ఆటో లా ఆటో డ్రైవర్ గా ఎంట్రీ ఇస్తుంది.రావడం రావడంతోనే ఎవర్నో చితక్కొడుతు చూపిస్తారు. అలాగే అతను అక్కా కొట్టొద్దు అంటే ఇంకా బాగా కొట్టి ఆ రిలేషన్ అంటే నాకు నచ్చదు అని చెబుతుంది.

Karthika Deepam Mar 21 Today Episode: డాక్టర్ గా హిమ… ఆటో డ్రైవర్ గా సౌర్య…తగ్గేదేలే అంటున్న సౌర్య..!!

Karthika Deepam Mar 22 Today Episode: హిమ చేసిన పనిని మర్చిపోని సౌర్య:

అలాగే సౌర్య ఆటో వెనకాల వదిలేదేలే అని రాసి ఉంటుంది. ఏంటమ్మా నాలాంటి వాళ్ళ కోసం అలా రాసావా అని అతను అడిగితే… మళ్లీ యాక్సిడెంట్ విషయం, హిమ చేసిన పని గురించి తలుచుకుని అమ్మా-నాన్నల్ని చంపేసిన హిమని వదిలేదేలే అని మనసులో అనుకుంటుంది. మీ పేరేంటి అని అడిగితే ‘జ్వాల’ అని చెప్పి ఎక్కడున్నా దానిని వదిలేదేలే అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మరో వైపు హిమ బర్త్ డే వేడుకలు ఘనంగా జరుగుతుంటాయి. ఇంతలో మన హీరో ఎంట్రీ ఇస్తాడు.

Karthika Deepam Mar 19 Today Episode: తప్పుచేసిన హిమ ఇంట్లోకి.. సౌర్య బయటకు ఇదెక్కడి న్యాయం సౌందర్య గారు..!
హిమ పుట్టినరోజు వేడుకల్లో మన హీరోల ఎంట్రీ:

అదేనండి సౌందర్య కూతురు కొడుకు అయిన ప్రేమ్ అన్నమాట. ప్రేమ్ రావడం చూసిన హిమ..ఏంటి ప్రేమ్ అని అనే లోపె ప్రేమ్ అందుకని నువ్వేమంటావో నాకు తెలుసు, ఇంత లేటా అని అడుగుతావ్ అంతే కదా అంటాడు. ఇక సౌందర్య అందుకుని మీ అన్నదమ్మలు ఇద్దరూ చెరోదగ్గర ఉంటున్నారు, మీరైనా అమ్మా-నాన్నని కలపొచ్చుకదా అని అంటుంది సౌందర్య. వాళ్లని కలిపే ప్రయత్నంలో మా ఇద్దరి మధ్యా లేనిపోని గొడవలు వస్తాయేమో అంటారు ప్రేమ్-నిరుపమ్. ఇక పుట్టినరోజు ఫంక్షన్ కు వచ్చిన గెస్టులు రెండు కేకులు చూసి ఒక బర్త్ డేకి రెండు కేకులు ఉన్నాయేంటి అని ఆశ్చర్యపోయి అడుగుతారు. మరో కేక్ మా ఇంకో మనవరాలు కోసం అని సౌందర్య చెబుతుంది. ఇంతలో హిమ నా సిస్టర్ శౌర్య కోసం అని చెబుతుంది. శౌర్య నన్ను బాగా చూసుకునేది, తన ఆలోచనలు నాకన్నా ముందుండేవి అందుకే తను నాకు అక్క అని రిప్లై ఇస్తుంది హిమ. అందరిని పలకరించిన తరువాత కేక్ కట్ చేస్తుంది హిమ.

Karthika Deepam Mar 18 Today Episode: హిమను చుసిన సౌందర్య… తనను ఇంటికి తీసుకుని వెళ్తుందా… మరి సౌర్యను ఎలా పేస్ చేస్తుందో..?
సౌర్య పుట్టినరోజు చేసుకోను అనడానికి కారణం ఏంటంటే..?

మరోపక్క శౌర్య అదే జ్వాల బర్త్ డేని కూడా ఆటో వాళ్లంతా కలసి సెలబ్రేట్ చేయాలి అనుకుంటారు. కానీ జ్వాల మాత్రం ఇవన్నీ నాకు ఇష్టం లేదంటుంది. నేను పుట్టిన రోజే ఆ హిమ కూడా పుట్టింది అది ఆనందంగా సెలబ్రేట్ చేసుకునే రోజు నేను ఆనందంగా ఉండడం నాకు నచ్చదు అనుకుంటుంది మనసులో. మీరు ఈ కేక్ అంతా తినేయండి.రేపు నేను సెలబ్రేట్ చేసుకుంటా అంటుంది. కానీ అక్కడ ఉన్న అందరు బతిమలాడడంతో కేక్ కట్ చేస్తుంది జ్వాల.అలా కేక్ కట్ చేసిన తరువాత ఆటోవెనుక వదిలేదేలే అని రాసి ఉండడంపై మాట్లాడుకుంటూ ఉంటారు అందరు.

జైలు నుంచి విడుదల అయిన ఇంద్రుడు, చంద్రమ్మ దంపతులు :

సీన్ కట్ చేస్తే జైలు నుంచి విడుదలవుతారు ఇంద్రుడు,చంద్రమ్మ దంపతులు. ఇంత మంది మనుషులు ఉన్నారు రంగంలోకి దిగుదామా అంటుంది చంద్రమ్మ. జైల్లోంచి విడుదలైన సందర్భంగా నాకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వు,ఏదైనా షాపింగ్ చేయించవా అని అడుగుతుంది చంద్రమ్మ.. జైల్లో నాలుగు వేలు వెనకేశాం, మరో ఆరువేలు అయితే పదివేలు అవుతాయి పాపకి దిద్దులు కొనిద్దాం అంటుంది చంద్రమ్మ. ఏమే అలవాటు పోయినట్టుంది దొంగతనం చేయాలంటే చేయి వణుకుతోందంటాడు ఇంద్రుడు.ఇంతలో అటు వైపు వెళ్తున్న జైలర్ దగ్గర చంద్రమ్మ డబ్బులు కొట్టేసి పర్స్ మళ్లీ జేబులో పెడుతుంది అది చుసిన జ్వాల వచ్చి పట్టుకుంటుంది. కొట్టేసిన పర్స్ జైల్లో అధికారికి ఇస్తుంది జ్వాల.

మళ్ళీ చేతివటం చూపించిన చంద్రమ్మ… సౌర్య ఏమి చేస్తుంది..?

చంద్రమ్మ, ఇంద్రుడు దిక్కులు చూడడం చూసి ఆ అధికారి పర్స్ పడిపోందో, కొట్టేశారో నాకు తెలుసు లోపలకు పదండి అంటాడు. అడ్డుపడి జ్వాల వాళ్ళను విడిపిస్తుంది. ఇక పోలీస్ అధికారి మాత్రం నువ్వెంతో ఆదర్శవంతంగా ఉంటావ్…కానీ వీళ్ల కడుపున నువ్వెలా పుట్టావ్ అంటాడు జ్వాలను. అంటే చిన్నప్పుడు తప్పిపోయిన శౌర్యని పెంచింది చంద్రమ్మ, ఇంద్రుడు దంపతులే. ఇక పోలీసు అధికారి నాకు తెలిసిన ఫ్రెండ్ ఉన్నాడు వాళ్లకు వంటచేసే భార్య-భర్త కావాలంట వీళ్లని అక్కడ పనిలో పెట్టు అని సలహా ఇస్తాడు. సరే అని వెళ్ళిపోతుండగా ఆటో వెనుక వదిలేదేలే అని రాసి ఉండడం చూసి జైలర్ కూడా జ్వాలను అడుగుతాడు.ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగిసింది.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!