Subscribe for notification
Categories: న్యూస్

Karthika Deepam Mar 28 Today Episode: సౌర్య గురించి తెలుసుకున్న సౌందర్య ఏమి చేయనుంది..?

Share

Karthika Deepam Mar 28 Today Episode:
బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. గత ఎపిసోడ్‌లో ఆనందరావుకు గుండె నొప్పి రావడం, ఆసుపత్రిలో చేర్పించడం అక్కడకు జ్వాల రావడంతో ఆసుపత్రిలో సన్నివేశం ఉత్కంఠగా మారింది.ఇక ఈరోజు ఎపిసోడ్ లో నిరుపమ్-సౌర్యల మధ్య ప్రేమకథ మొదలు అవుతుంది అనే చెప్పాలి. అయితే ఆసుపత్రిలోసౌందర్య ఉండడంతో ఎక్కడా సౌర్య నానమ్మను చూస్తుందో అనే ఆసక్తి అందరిలో ఎక్కువ అయింది.ఇక జ్వాల మాత్రం సత్య సార్ కోసం పార్కింగ్‌లో వెయిట్ చేస్తున్నప్పుడు సౌందర్య అటు వైపు వస్తుంది కానీ సౌర్య నానమ్మను చూడదు. ఇక సత్య ఆటో దగ్గరకు రావడంతో సార్ వెళ్దామా అంటుంది సత్యని చూడగానే ‘ఇక సత్య మాత్రం నీ ఆటో బేరాలన్నీ పొగొట్టుకుని నాకోసం ఎందుకు ఉన్నావమ్మా అంటాడు జ్వాలతో.అదేమి లేదు సార్ అంటుంది.

Karthika Deepam Mar 26 Today Episode: సౌర్య డాక్టర్ సాబ్ ప్రేమలో పడిపోయిందా..? మరోపక్క సౌర్య ఆచూకీ కనిపెట్టేసిన సౌందర్య..!!

Karthika Deepam Mar 28 Today Episode: ఆసుపత్రిలో సౌందర్యను సౌర్య చూసేస్తుందా..?

ఇక వాళ్ళకి దగ్గరలోనే కాస్త దూరంగా ఏవో ఆసుపత్రి ఫార్మాలిటీస్‌ పూర్తి చేస్తూ ఉంటుంది సౌందర్య. సౌర్య చూస్తుందేమో అనుకుంటాము కానీ సౌర్య తిరిగి చూడదు. ఇక చాలా సేపు సత్య, జ్వాలలు ఆటో దగ్గర నిలబడి నిరుపమ్, ప్రేమ్‌ల గురించి వాళ్ల భిన్న వ్యక్తిత్వాల గురించి కాసేపు మాట్లాడుకుని. సత్యను ఆటోలో ఎక్కించుకుంటుంది.‘సత్యా సార్‌ని డ్రాప్ చేసి వెంటనే గుడికి వెళ్లాలి అక్కడ పిన్నీ, బాబాయ్ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు’ అనుకుంటుంది సౌర్య మనసులో.
Karthika Deepam Mar25 Today Episode: దీపను మళ్ళీ చూసినట్టు ఉందిగా సౌర్య నటన చూస్తే…ఎక్సప్రెషన్స్ మాములుగా లేవుగా.!
అమ్మా నాన్నల పేర్ల మీద అన్నదానం జరిపిస్తున్న సౌర్య:

ఇక సీన్ గుడి దగ్గర ఓపెన్ అవుతుంది. గుళ్లో అన్నదానం ఏర్పాట్లు గురించి సౌర్య ఇంద్రుడు, చంద్రమ్మలతో మాట్లాడుతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయానికి సౌందర్య కూడా అదే గుడికి వస్తుంది.కానీ ఒకరికి ఒకరు ఎదురుపడరు. ఇక సౌర్య వెళ్లి అన్నదానం కోసం కౌంటర్ దగ్గర డబ్బులు కట్టి రసీదు రాయించుకుని పూజారిగారి దగ్గరకు వస్తుంది.’చనిపోయిన మా అమ్మా నాన్నల పేర్ల మీద అన్నదానం చేయించాలి అంటుంది. అలాగే అన్నా పూజారి అమ్మా నాన్నల పేర్లు చెబుతుంది. ఇక రసీదుని ఇంద్రుడు, చంద్రమ్మలకు ఇచ్చి ఎక్కడ ‘మీరు ఈ ఏర్పాట్లు చూడండి.నేను అనాథ ఆశ్రమానికి బియ్యం మూటలు ఇచ్చి వస్తాను’ అని బయలుదేరుతుంది సౌర్య. ఇక పంతులు గారు సౌర్య చెప్పిన పేర్లను బోర్డ్ మీద రాస్తాడు.ఇంద్రుడు, చంద్రమ్మలు అన్నదానం ఏర్పాట్లకు అన్నదాన సత్రం దగ్గరకు వెళ్లిపోతారు.

Karthika Deepam Mar25 Today Episode: దీపను మళ్ళీ చూసినట్టు ఉందిగా సౌర్య నటన చూస్తే…ఎక్సప్రెషన్స్ మాములుగా లేవుగా.!
పంతులు చెప్పిన విషయం విని షాక్ లో సౌందర్య:

ఇక సౌందర్య అదే ‘పంతులు దగ్గరకు వచ్చి పంతులు గారు చనిపోయిన మా కొడుకు, కోడలు పేర్ల మీద అన్నదానం చేయించాలి అని కోవెలమూడి కార్తీక్, కోవెలమూడి దీప అంటూ పేర్లు చెబుతుంది. ‘అదేంటమ్మా ఇప్పుడే ఒక అమ్మాయి ఇవే పేర్లు చెప్పి అన్నదానానికి రసీదు ఇచ్చి పోయింది.కావలంటే ఆ బోర్డ్‌ చూడండి అంటాడు.బోర్డ్‌ చూసిన సౌందర్య కార్తీక్, దీపలు పేర్లు చూసి షాక్ అయ్యి సౌర్య వచ్చింది అని ఆనంద పడుతుంది ‘సౌర్యా ఇక్కడికి వచ్చిందా? ఇక్కడుందా?’ అంటూ దేవుడికి కృత‌జ్ఞతతో దన్నం పెట్టి ఆ అమ్మాయి ఎక్కడా అని పంతుల్ని అడుగుతుంది. ‘ఇప్పుడే అలా వెళ్లిందమ్మా అనడంతో ‘సౌర్యా సౌర్యా’ అంటూ పరుగుతీస్తుంది సౌందర్య.

Karthika Deepam Highlights: కార్తీక దీపం సీరియల్ ఈ వారం హై లెట్స్ మీకోసం…!
సౌర్యను సౌందర్య చూస్తుందా..?

అప్పటికే సౌర్య గుడి మెట్లు దిగి ఆటో మీద వెళ్లిపోతుంది.సౌందర్యకు సౌర్య కనిపించదు. ఏవండీ మీకు ఒక శుభవార్త అంటూ భర్తతో ఆ విషయాన్ని పంచుకుంటుంది సౌందర్య. కానీ ఆనందరావు మాత్రం సౌందర్యా నాకెందుకో సౌర్య గుడిలో నిన్ను చూసి తప్పుకుందేమో అని నా మనసుకి అనిపిస్తోంది అంటాడు.సౌర్య కావాలనే మనల్ని విడిచి వెళ్లిపోయింది.నిజంగానే తను మన దగ్గరకు రావాలనుకుంటే మన చిరునామా తెలుసుకోవడం ఎంత సేపు చెప్పు అంటాడు.నాకు తెలిసి సౌర్య ఇంకా హిమ మీద మరింత కోపంతో పెరిగి ఉంటుంది’అంటాడు. ఇక ఈ విషయం హిమకి చెప్పకపోవడమే మంచిది అనుకుంటారు.

Karthika Deepam Mar23 Today Episode: సౌర్యను కలిసిన హిమ… అంతా మర్చిపోయి సౌర్య ఇంటికి వస్తుందా? లేక హిమను చంపేస్తుందా..?
ప్రేమ ఊహల్లో విహారిస్తున్న సౌర్య, నిరూపమ్ లు:

ఇక సౌర్య ఆటోలో వెళ్తూ నిరుపమ్‌ని అన్నా మాటలు గుర్తు చేసుకుంటుంది.సంబరంగా ఒక చోట ఆటో ఆపి నిరుపమ్‌ని తలుచుకుంటూ.. ‘ఈ రోజు మొదటి సారి నన్ను ఒకరు పొగిడారు’ అంటూ తనలో తనే మురిసిపోతుంది. అదే సమయానికి హిమతో కారులో వెళ్తున్న నిరుపమ్‌కి కూడా హాస్పిటల్లో చుసిన సౌర్యను గుర్తు చేసుకుంటాడు. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.


Share
Ram

Recent Posts

Sudigali Sudheer : సుధీర్‌పై నాగబాబు సెటైర్లు.. మళ్లీ ఒకే చోట చేరిన గ్యాంగ్..

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ మంచి కమెడియన్‌గా తెలుగు ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకున్నాడు. సుధీర్ కమెడియన్ మాత్రమే కాదు…

23 mins ago

Rashmika: కెరీర్‌లో పెద్ద టర్నింగ్‌ పాయింట్ ఆ సినిమానే అంటున్న ర‌ష్మిక‌!

Rashmika: నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఛ‌లో`తో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టి అన‌తి…

53 mins ago

Pears: తప్పనిసరిగా తినాల్సిన పండు ఇది..!

Pears: యాపిల్ పండు లాగానే కనిపించే పియర్స్ పండు చాలా రుచిగా ఉంటాయి.. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.. కానీ…

53 mins ago

Breaking: ఎంపీ రఘురామకు హైకోర్టులో ఊరట.. లంచ్‌మోషన్ పిటిషన్‌పై కీలక ఆదేశాలు

Breaking: వైసీపీ (YCP) ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnam Raju) కు హైకోర్టు (AP High Court) లో…

2 hours ago

Non Veg: వర్షాకాలం ఆకుకూరలతో పాటు మాంసాహారం తినకూడదా.!? ఎందుకని.!?

Non Veg: వర్షాకాలం (Monsoon)  మొదలవడంతోనే వాగులు వంకలు పొంగిపొర్లుతాయి.. ఈ సీజన్లో ఎటు చూసినా పచ్చదనమే కనిపిస్తుంది.. వర్షాకాలంలో…

2 hours ago

Russia Ukraine Missile Attack: ఉక్రెయిన్ పై రష్యా క్షిపణి దాడిలో 18 మంది మృతి.. 30 మందికి గాయాలు

Russia Ukraine Missile Attack: ఉక్రెయిన్ (Ukraine) పై రష్యా (Russia) దాడులను కొనసాగిస్తూనే ఉంది. రష్యా చేస్తున్న క్షిపణి…

2 hours ago