NewsOrbit
న్యూస్ సినిమా

Karthika Deepam Mar 29 Today Episode: అమ్మమ్మను తన ఇంటి గుమ్మం తొక్కవద్దు అన్న నిరూపమ్..!!

Karthika Deepam Mar 29 Today Episode: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజు రోజుకు చాలా ఇంట్రెస్టింగ్ గా ముందుకు సాగుతూ వెళ్తుంది. గత ఎపిసోడ్ లో సౌర్య గురించి తెలిసి సౌందర్య చాలా సంతోష పడుతుంది. కానీ ఈ విషయాన్ని మాత్రం హిమకు చెప్పదు. ఇక సౌర్య ఆటోలో వెళుతు నిరూపమ్ మాటలు తలుచుకుని ఆనందపడుతుంది. ఇక ఆటో రోడ్డు మీద ఓ పక్కగా ఆపి.. నిరుపమ్‌ని తలుచుకుని మురిసిపోతుంది. మొదటిసారి నన్ను ఒకరు పొగిడారు..అమ్మాయి అంటే నాలా ఉండాలట.. నేను అమ్మాయిని అని ఫస్ట్ టైమ్ నాకొక అబ్బాయి గుర్తు చేశాడు’ అంటూ జ్వాల తనలో తనే తెగ సంతోషపడుతుంది.ఇక అదే సమయానికి కారు డ్రైవ్ చేస్తూ ఇంటికి వెళ్తున్న నిరుమప్ కూడా జ్వాల మాటలు గుర్తు చేసుకుని నవ్వుకుంటాడు. పక్కనే ఉన్న హిమ కూడా ఆ ఆసుపత్రిలో చూసిన అమ్మాయిని చూస్తుంటే ఎక్కడో చూసినట్లు అనిపిస్తోంది కదా అంటుంది. ‘నేను తన గురించే ఆలోచిస్తున్నా హిమా’ అంటాడు నిరుపమ్.

Karthika Deepam Mar 29 Today Episode: హిమ భయాన్ని పోగొట్టే పనిలో నిరూపమ్

అసలు మొహమాటం, భయం లేకుండా డాక్టర్ సాబ్ అంటుంది.. తింగరి అంటుంది..’ అని జ్వాలని మరోసారి తలుచుకుంటాడు నిరుపమ్. ‘మనసులో ఎలాంటి కలమషం లేకపోతే.. అలాగే మాట్లాడతారు తెలుసా?’ అంటాడు.నువ్వూ అలా ఉండొచ్చుగా హిమా..అలా ఉంటేనే ఈ రోజుల్లో బతకగలం’ అంటాడు నిరుపమ్. ఇక సౌర్య మాత్రం నిరూపమ్ ఊహల్లో నుంచి బయటకు రాలేక అద్దంలో తనని తాను చూసుకుని ముద్దులు పెట్టేసుకుంటుంది.ఇక నిరూపమ్ మాత్రం హిమతో నాకో ఐడియా వచ్చింది.. ఆ సివంగిలాంటి అమ్మాయితో నువ్వు స్నేహం చెయ్ హిమ నీ భయం, పిరికితనం అన్నీ బంగాళాఖాతంలో కలుస్తాయి అంటూ సలహా ఇస్తాడు.దాంతో హిమ.. చిన్నప్పటి సౌర్యని గుర్తు చేసుకుని నిజమే తనతో పరిచయం చేసుకుంటే సౌర్యని వెతకమని తనకి చెప్పొచ్చు అంటుంది.

Karthika Deepam Mar 29 Today Episode: సౌందర్యను ఇంటికి రావద్దు అన్నా కన్నకూతురు:

సీన్ కట్ చేస్తే సౌందర్య స్వప్న ఇంటికి వస్తుంది. రావడంతోనే స్వప్నా డాడీకీ అంటూ అనేలోపు తెలుసు.. అయినా తెలిసే రాలేదు.. డాడీ మీద ప్రేమ ఉంది. కానీ నువ్వు ఉంటావ్‌గా అక్కడ అందుకే రాలేదు..’ అంటుంది స్వప్న చాలా కఠినంగా.‘ఏంటే ఆ మాటలు’ అంటుంది సౌందర్య. ‘మమ్మీ ప్లీజ్.. మన మధ్య అన్ని బంధాలు ఎప్పుడో తెగిపోయాయి.ఇప్పుడు కలపాలని చాలా ప్రయత్నిస్తున్నావ్.అందుకేగా హిమని.. నిరుపమ్ ఉండే ఆసుపత్రిలోనే డాక్టర్‌గా చేర్పించావ్ అంటుంది.ఇంతలో నిరుపమ్ వచ్చి ‘అమ్మమ్మ నువ్వు ఎప్పుడొచ్చావ్’ అంటూ పలకరిస్తాడు. వెంటనే సౌందర్య కళ్లు తుడుచుకుని ‘ఇప్పుడే వచ్చానురా’ అంటుంది. ‘మమ్మీ బాగా ఆకలేస్తుంది.. అన్నం పెట్టు.. కాళ్లు చేతులు కడుక్కుని వస్తాను’ అంటే ఇంటికి వచ్చిన ఆవిడ వెళ్ళాక తిందాంలే అంటుంది. ఏంటి మమ్మీ ఈ మాటలు…అమ్మమ్మా అమ్మ మారదు.. మీరు అనవసరంగా ఇలా బాధపడటం నాకు కష్టంగా ఉంది అంటాడు.

హిమను నాకొడుకుకు దూరంగా ఉండమని అన్నా స్వప్న

సరే నేను వెళ్లొస్తానురా నిరుపమ్’అని సౌందర్య అంటే ‘మళ్లీ రాకపోతే సంతోషం అంటుంది స్వప్న. మమ్మీ నీ మనవరాలు హిమని వీలైనంత త్వరగా ఆసుపత్రి మార్పించెయ్అంటుంది స్వప్న కోపంగా. నిరుపమ్ మాత్రం అమ్మా ప్లీజ్ ఆపుతావా హిమ ఎక్కడికీ వెళ్లదు. అయినా మమ్మీ నీలా నేను కోపంగా ఉండలేను. బంధాలను తెంచుకోలేను. నాకు అందరూ కావాలి మమ్మీ అంటాడు.సౌందర్య నిరుపమ్ మాటలకు సంతోషిస్తుంది. వెంటనే నిరుపమ్ సౌందర్యతో అమ్మమ్మ ప్లీజ్ మీరు ఇక్కడికి రాకండి.. మమ్మీ మారదు వచ్చి అనవసరంగా మాటలు పడకండి అంటాడు…

సౌర్యను మళ్ళీ మాటలతో ఐస్ చేస్తున్న నిరూపమ్

ఇక సీన్ కట్ చేస్తే.. చంద్రమ్మని నిరుపమ్ దగ్గరకు తీసుకొస్తుంది సౌర్య ‘చంద్రమ్మకి రిపోర్ట్‌లు అన్ని చూస్తూ.. ‘మీకు గ్యాస్ సమస్య ఎక్కువగా ఉంది. టైమ్ తినాలి అంటూ మందులు రాసి ఇస్తాడు.ఇక జ్వాల డబ్బులు ఇవ్వబోతుంటే నాకు డబ్బులు వద్దుగాని నాకో సాయం కావాలి’ అంటాడు. ఏంటది అని జ్వాల అనగానే.. ‘మా డాక్టర్ ఉంది కదా.. తనకి కాస్త ధైర్యంగా ఉండటం నేర్పించాలి అంటాడుఎవరికీ ఆ తింగరికా అదెంత పని నిమిషాల్లో చేస్తాను’ అంటుంది జ్వాల.నాకు తెలుసు నీ వల్ల అవుతుందని’ అంటాడు నిరూపమ్. మీకు ఎలా తెలుసు డాక్టర్ సాబ్?’ అంటుంది జ్వాల. ‘ఎందుకంటే నీ ప్రవర్తన నాకు నచ్చుతుంది’ అంటూ మళ్లీ పొగుడుతాడు జ్వాలని. దాంతో జ్వాల మురిసిపోతూ అక్కడ నుంచి వెళ్లిపోతుంది.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Ram Charan NTR: భారీ ధరకు ‘దేవర’..’గేమ్ ఛేంజర్ నార్త్ రైట్స్…?

sekhar

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

Kumkuma Puvvu April 19 2024 Episode 2158: అంజలి సంజయ్ ల నిశ్చితార్థం జరుగుతుందా లేదా

siddhu