NewsOrbit
న్యూస్

Karthika Deepam Mar25 Today Episode: దీపను మళ్ళీ చూసినట్టు ఉందిగా సౌర్య నటన చూస్తే…ఎక్సప్రెషన్స్ మాములుగా లేవుగా.!

Karthika Deepam Mar25 Today Episode: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీక దీపం సీరియల్ ఎంతో ఆసక్తికరంగా ముందుకు సాగుతూ వెళ్తుంది.గత ఎపిసోడ్‌లో సౌర్య మేనమామను కలవడం, మరోపక్క హిమ ఏమో వాళ్ళ అత్తయ్యను కలవడం జరుగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏమి జరిగిందంటే
చీకటి పడ్డాక సౌర్య ఇంటి బయట ఒంటరిగా కూర్చుని తన చేతి మీద ఉన్న పచ్చబొట్టు చూసుకుంటూ ఎక్కడున్నావే హిమా నీ కోసం ఇంటికి వస్తే ఇల్లు అమ్మేసి వెళ్లిపోయారని తెలిసింది.. అంటే నేను మీ ఎవ్వరికీ అవసరం లేదా? నా మీద ప్రేమ లేదా? నాకోసం కనీసం అసలు మీరు వెతకను కూడా లేదా? అని బాధపడుతుంది. అంతేలే ఎంతయినా చిన్నప్పటి నుంచి నువ్వు ఆ ఇంట్లోనే పెరిగావ్.. నేనే మధ్యలో వచ్చాను కదా అందుకే నువ్వుంటేనే వాళ్లందరికీ ప్రేమ అని అనుకుంటుంది.ఆ హిమను మాత్రం ఎక్కడున్నా వదిలేదేలే వెతికి మరి పట్టుకుంటాను.

Karthika Deepam Mar 24 Today Episode: కార్తీకదీపం సీరియల్ అసలు ఆట ఇప్పుడే మొదలయింది..తెలియకుండానే అందరు ఒకేచోట చేరారుగా..!!

Karthika Deepam Mar25 Today Episode: సౌర్యను ఓదార్చుతున్న ఇంద్రుడు -చంద్రమ్మ దంపతులు :

ఇంతలో ఇంద్రుడు, చంద్రమ్మ వచ్చి సౌర్యకు అటు ఇటు కూర్చుని ఏంటమ్మా ఇక్కడ కూర్చుని ఆలోచిస్తున్నావ్ అంటారు.ఏం లేదు బాబాయ్ అంటుంది సౌర్య. అమ్మా నువ్వు చెప్పినట్లు రేపు గుడిలో మీ అమ్మా నాన్నలు ఆర్ధికం కు అన్నదానం ఏర్పాట్లు చేశానమ్మా అంటాడు ఇంద్రుడు. ఇంతలో చంద్రమ్మ ‘ఏంట్రా నీ అసలు పేరు ఇప్పుడైనా మాకు చెప్పవా’ అంటుంది. సౌర్య మాత్రం ‘పిన్నీ.. మీకు పాప పుట్టి చనిపోయింది కదా తన పేరు జ్వాల కదా. అదే నా పేరు అంటుంది సౌర్య.పిన్ని ఒకవేళ మీ పాపే బతికి ఉంటే నన్ను వదిలేసేవాళ్లు కదా బాబాయ్ అని సౌర్య అంటే ‘అదేంటమ్మా అలా అంటావ్ చెట్టుకి కాయ భారమా.. మీరు నాకు భారమా అంటాడు.అప్పుడు ఇద్దరినీ రెండు కళ్లలా చూసుకునేవాడిని..ఒక జేబు కొట్టేవాడ్ని కాస్తా రెండు జేబులు కొట్టేసేవాడ్ని ఎక్కువ సమయం కేటాయించేవాడిని అని నోరు జారతాడు. ‘ఇదిగో ఇదే వద్దు అన్నాను అంటుంది సౌర్య కాస్త కోపంగా. అమ్మా నువ్వు అవేమో ఆలోచించకు. ఉన్నంతలో అందరం సంతోషంగా ఉందాం అంటుంది.

Karthika Deepam Mar23 Today Episode: సౌర్యను కలిసిన హిమ… అంతా మర్చిపోయి సౌర్య ఇంటికి వస్తుందా? లేక హిమను చంపేస్తుందా..?
అత్త మాటలను తులుచుకుని బాధ పడుతున్న హిమ :

మరోపక్క హిమ ఒంటరిగా కూర్చుని తన చేతి మీద ఎస్ అని ఉన్న పచ్చబొట్టు చూసుకుని బాధ పడుతుంది. మరోపక్క అత్త స్వప్న అన్న మాటలు గుర్తు చేసుకుని కుమిలిపోతు ఏడుస్తుంది. ఇంతలో సౌందర్య వచ్చి హిమ ఏడవడం చూసి ఏం అయ్యిందే అని కంగారుపడుతుంది. హిమ ఏడుస్తూనే అమ్మా నాన్నల చావుకు నేనే కారణం అని మీరు కూడా అనుకుంటున్నారా నాన్నమ్మా అంటుంది. ఏంటే ఆ మాటలు హిమా మేము ఎందుకు అలా అనుకుంటాం అని ఓదార్చుతుంది. ‘రేపు అమ్మా నాన్నల పేరు మీద గుడిలో అన్నదానం చేయిస్తున్నా అంటుంది.

Karthika Deepam Mar 22 Today Episode: సౌర్య ఆటో వెనకాల వదిలేదేలే అని ఎవరిని ఉద్దేశించి రాసిందో తెలుసా..?
తన నటనతో దీపను మైమరిపించిన సౌర్య:

మరునాడు ఉదయాన్నే.. సౌర్య,ఇంద్రుడు, చంద్రమ్మలు అన్నం పెట్టుకుంటారు తినడానికి.అప్పుడు సడన్‌గా సౌర్యకు చిన్నప్పుడు తన తల్లి దీప, తనూ కలిసి కార్తీక్ కోసం కాకుల్ని పిలిచే సీన్ గుర్తొస్తుంది. వెంటనే మరో ప్లేట్ తీసుకుని రెండు ముద్దలు పెట్టి బయట గోడ మీద పెట్టి కావు కావు..’ అంటూ ఏడుస్తు పిలుస్తుంది.బయటకు ఇంద్రుడు, చంద్రమ్మలు వచ్చి చూస్తారు. సౌర్యామ్ అలా పిలవడం చూసి వాళ్ల కళ్లల్లో కూడా నీళ్లు తిరుగుతాయి. ‘ఏంటమ్మా ఈ పిచ్చి’ అంటుంది చంద్రమ్మ. ‘పిచ్చి కాదు పిన్నీ కాకులు అరిస్తే ఇంటికి చుట్టాలు వస్తారు అంటారు కదా అలా మా అమ్మానాన్నల ఆత్మలు కూడా కాకుల రూపంలో చుట్టాలుగా వస్తారేమో అని చిన్న ఆశ పిన్నీ అంటూ ఏడుస్తూనే ‘కావ్.. కావ్’ అని పిలుస్తుంది.జ్వాల మాటలకు చంద్రమ్మ మనసు విలవిలా లాడిపోతుంది. ఒక్క కాకి కూడా రాదేంటి పిన్నీ నేనేం తప్పు చేశానని అమ్మా నాన్నలకు నా మీద కోపం?ఒక్కసారి.. వచ్చి తినొచ్చు కదా పిన్నీ అంటూ అల్లాడిపోతుంది సౌర్య.

పిల్లలు ఉన్నా అనాధలం మేము.. అని బాధపడుతున్న ఆనందరావు :

ఇక సౌందర్య, ఆనందరావు, హిమ గుడికి బయలుదేరతారు. ‘నాన్నమ్మా నిరుపమ్‌కి కాల్ చేసి రమ్మని చెప్పాలా’ అంటుంది హిమ.వద్దులే హిమా మళ్లీ వాళ్లమ్మకి కోపం వస్తుందేమో’ అంటుంది సౌందర్య. వాళ్లమ్మ ఏంటి నాన్నమ్మా తను నీ కూతురే కదా’ అని హిమ అనడంతో ఆనందరావు కాస్త ఎమోషనల్ అవుతాడు. అటు దీప, కార్తీక్ లేరు. ఇటు ఆదిత్య, శ్రావ్య, దీపు గాడు అమెరికా వెళ్లిపోయారు. దగ్గరగా ఉన్న ఒక్క కూతురు కలవదు..కళ్లముందే ఉన్న కళ్లు ఉరిమి చూస్తుంది’ అంటూ ఎమోషనల్ కావడంతో గుండె నొప్పిలా వస్తుంది ఆనందరావుకి.. నీళ్లు తాగించి ఆనందరావుని సోఫాలో కూర్చోబెడుతుంది హిమ సీన్ కట్ చేస్తే సత్య ఇంటికి టిఫిన్ తీసుకుని వస్తుంది సౌర్య.‘వేడి వేడిగా వడ్డించేస్తాను తినేయండి సార్..’ అంటూ కబుర్లు చెబుతూ.. ప్లేట్‌లో టిఫిన్ పెడుతుంది. ఇంతలో సత్యకు సౌందర్య ఫోన్ చేస్తుంది.మీరు ఉండండి సార్ నేను తెస్తాను అనడంతో ఎపిసోడ్ అయిపోతుంది.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

Nabha Natesh: మాట‌లు జాగ్ర‌త్త‌.. ప్రియ‌ద‌ర్శికి న‌భా న‌టేష్ స్ట్రోంగ్ వార్నింగ్.. అంత పెద్ద తప్పు ఏం చేశాడు?

kavya N

మాకు బీ ఫామ్‌లు వ‌ద్దు… ప‌వ‌న్‌ను చివ‌రి వ‌ర‌కు టెన్ష‌న్ పెట్టిన జ‌న‌సేన క్యాండెట్లు…!

Nuvvu Nenu Prema April 18 2024 Episode 601: విక్కీని కొట్టి పద్మావతిని కిడ్నాప్ చేసిన కృష్ణ.. అనుతో దివ్య గొడవ.. పద్మావతిని శాశ్వతంగా దూరం చేసిన కృష్ణ..

bharani jella

AP Elections 2024: రేపటి నుండి నామినేషన్లకు రంగం సిద్దం – సీఈవో ముకేశ్ కుమార్ మీనా

sharma somaraju

Inter Board: ఏపీ ఇంటర్ బోర్డు కీలక ప్రకటన .. రీ వెరిఫికేషన్, బెటర్మెంట్ ఫీజు చెల్లింపునకు పూర్తి సమాచారం ఇది

sharma somaraju

Chandrababu: ప్రభుత్వంపై చంద్రబాబు కీలక ఆరోపణ ..ఆ కేసు దర్యాప్తు ఈసీ పర్యవేక్షణలో జరగాలి

sharma somaraju

Janasena: అభ్యర్ధులకు బీఫామ్ లు అందజేసిన పవన్ కళ్యాణ్

sharma somaraju

Chiyaan Vikram: సీరియ‌ల్ యాక్ట‌ర్‌ నుంచి స్టార్ హీరోగా విక్ర‌మ్ ఎలా ఎదిగాడు.. అత‌ని భార్య‌, కూతురిని ఎప్పుడైనా చూశారా?

kavya N

Tollywood Actor: ఈ ఫోటోలో ఉన్న స్టార్ హీరోను గుర్తుప‌ట్టారా.. రీల్ లైఫ్‌లోనే కాదు రియ‌ల్ లైఫ్‌లో కూడా ల‌వ‌ర్ బాయే!

kavya N

Sri Rama Navami: భద్రాద్రిలో వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం

sharma somaraju

NTR: ఎన్టీఆర్ పాతికేళ్ల క‌ల దేవ‌రతో అయినా నెరవేరుతుందా..?

kavya N

Sri Ramadasu: భక్తిరస మహాకావ్యం శ్రీరామదాసు సినిమా గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?

kavya N