Karthika Deepam : రుద్రాణి పిల్లల్ని దత్తత తీసుకోవడం వెనుక గల మర్మం ఇదా..?

Share

Karthika Deepam : కార్తీక దీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ ఊహకు అందని ట్విస్ట్ లతో ముందుకు సాగుతూ పోతుంది. నిన్నటి ఎపిసోడ్ లో మోనిత హోటల్‌కి వచ్చిందని.. టీ తాగడానికి అని హోటల్ కి వెళితే అక్కడ తనని చూశానని కార్తీక్ దీపకు చెబుతాడు.మనల్ని వెతుకుంటూ వచ్చి ఉంటుంది కార్తీక్ బాబు మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి.మీరు బయట తిరగొద్దు’ అంటూ కార్తీక్‌కి చెబుతుంది దీప. ఇంకా ఈరోజు ఎపిసోడ్ లో కార్తీక్ పిల్లలకు టిఫిన్ పెడుతూ సీన్ ఓపెన్ అవుతుంది.‘మీరు బాగా తినాలమ్మా.. మీరు హ్యాపీగా ఉండాలి.. అప్పుడే నేను అమ్మా సంతోషంగా ఉండగలం అని పిల్లలకు కార్తీక్ చెబుతూ ఉంటాడు. అప్పుడే సౌర్య, హిమలు ‘డాడీ మీకు మేము ఎలాగో మీకు కూడా నాన్నమ్మ తాతయ్యలకు కూడా అలాగే కదా మరి నువ్వు కనపడకుండా ఉంటే వాళ్ళు కూడా బాధ పడతారు కదా..మరి వాళ్లు నీకు గుర్తు రావట్లేదా? అంటూ ప్రశ్నలు వేయడంతో కార్తీక్ మనసులో చాలా బాధపడతాడు.

 

Karthika Deepika : అమ్మా, నాన్నలను తలుచుకుని కుంగిపోతున్న కార్తీక్ :

ఏవో మాటలు చెప్పివాళ్లని పంపిస్తాడు కానీ పిల్లలు వెళ్లాక కూడా ఒంటరిగా కూర్చుని బాధపడుతుంటే.. దీప వచ్చి ఏంటి ఇలా ఉన్నారు అని అడుగుతుంది.జరిగింది చెప్పుకుని.. నా కారణంగా ఎంతమంది బాధపడుతున్నారో చూడు దీపా అంటూ కుమిలిపోతాడు.దీప ఒక పక్క బాధపడుతూ మరోపక్క ఓదారుస్తున్నా గాని పట్టనట్లుగా అక్కడ నుంచి లేచి వెళ్లిపోతాడు.మరోపక్క రుద్రాణి మాటలు గుర్తు చేసుకుని భయపడుతుంది.

మోనిత మాయాలో బస్తివాసులు :

సీన్ కట్ చేస్తే లక్ష్మణ్ వాళ్ళ భార్యను కాపాడిందని మోనిత కాళ్ల మీద పడతారు లక్ష్మణ్, లక్ష్మణ్ భార్య. ‘మమ్మల్ని క్షమించండి. ఇక మీదట మీకు ఏ అవసరం అయినా మేము వస్తాం..’ అంటూ దన్నం పెట్టి వెళ్తారు. దాంతో మోనిత నవ్వుకుంటూ చూసావా ‘దీపక్కా నీ ఫ్యాన్స్ అంతా నా ఫ్యాన్స్ అయిపోతున్నారు’ అనుకుంటుంది.ఇక రుద్రాణి.. దీప వంటగదిలో వంట చేసుకుని వెళ్తూ ఇచ్చిన వార్నింగ్ గురించి తలుచుకుని కోపంతో రగలిపోతుంది.ఇంతలో పెద్ద గడ్డం రౌడీ కాఫీ తీసుకొచ్చి ఇస్తాడు. ‘ఎక్కడిదిరా కాఫీ అంటే నేను పెట్టాను ఇంట్లో’ అంటాడు. దాంతో ఆ కాఫీని వెంటనే విసిరి కొట్టి.. వాడ్ని లాగిపెట్టి కొడుతుంది. ‘ఆ వంటగదిని వాడొద్దని ముసివేయమన్నా కదరా అంటుంది.ఆ వంట గదిని చూస్తుంటే నాకు ఆ దీప ధైర్యమే గుర్తొస్తుంది.. ఆ వంటగది మైలు పడిపోయింది.

 

Karthika Deepam : రుద్రాణి పిల్లల్ని దత్తత తీసుకోవడం వెనుక గల కారణం ఇదా..?

 

ఈ రోజు నుంచి.. ఆ గంగారాజు అంటే ఆనంద్, ఆ పిల్ల హిమ మనింటికి వచ్చే దాకా మన ఇంట్లో వంట చేయొద్దు అని వార్నింగ్ ఇస్తుంది. బయట హోటల్ నుంచి తేవాలి’ అంటుంది రుద్రాణి.. ‘అదేంటక్కా ఇకప్పుడు పిల్లలు లేరని బాధపడేదానివే కానీ.. పిల్లల్ని దత్తత తీసుకోవాలని అనుకోలేదుగా?’ అంటాడు ఆ గడ్డం రౌడి..అవునురా నిజమే కానీ ఆ గంగరాజుకి వీపు వెనుక ఉన్న పుట్టుమచ్చ చూశావా..? అలా ఉంటే మహారాజు యోగం పడుతుంది తెలుసా అంటుంది.ఇక ఆ పిల్లల్లో హిమని చూస్తుంటే నాకు మా అమ్మే గుర్తొస్తోంది రా..అందుకే ఆ ఇద్దరూ నాకు కావాలి అని అసలు నిజం. చెప్తుంది రుద్రాణి.వెళ్లు.. వెళ్లి నాకు కాఫీ తీసుకునిరా’ అంటూ అరుస్తుంది రుద్రాణి. దాంతో తలగోక్కుంటూ.. ‘ఏంటో అక్కా.. అర్థమే కాదు’అని వెళ్తాడు ఆ గడ్డం రౌడీ. వెంటనే రుద్రాణి.. ‘రేయ్ నీకు నేను అర్థమైతే నేను రుద్రాణిని ఎలా అవుతానురా’ అంటుంది.

 

Karthika Deepam : మోనిత ఫోటో చూసి మురిసిపోతున్న అప్పిగాడు. మరి కార్తీక్ రియాక్షన్ ఏంటో..?

మరోవైపు కార్తీక్ పనిచేసే హోటల్‌లో పని చేసే అప్పిగాడు మోనితతో దిగిన ఫొటోని చూసుకుంటూ తెగ మురిసిపోతూ ఉంటాడు.కార్తీక్‌కి చూపించి ‘కన్నడా హీరోయిన్ అని ఇక్కడ పెద్ద పోస్టర్ వేయిస్టే అప్పుడు ఈ అప్పిగాడి రేంజే వేరు అనుకుంటారు అందరు కదా అని బిల్డప్‌లు కొడతాడు.కానీ కార్తీక మాత్రం ఎవరూ నమ్మరు అంటూనే ఆ మోనిత చేసిన దారుణాలు తలుచుకుని తనలో తానే నలిగిపోతాడు. ఆ మోనిత వలనే నేను నా కుటుంబానికి దూరం అయ్యి ఇలా కష్టాలు పడుతున్న అని బాధ పడతాడు.ఇక ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.!


Share

Recent Posts

“పుష్ప”లో ఆ సీన్ నాకు బాగా నచ్చింది..పూరి జగన్నాథ్ కీలక వ్యాఖ్యలు..!!

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన "పుష్ప" ఎంతటి ఘనవిజయం సృష్టించిందో అందరికీ తెలుసు. గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైన ఈ సినిమా…

9 నిమిషాలు ago

ఢిల్లీ లిక్కర్ స్కామ్ .. హైదరాబాద్ లోని ప్రముఖ వ్యావారి నివాసంలోనూ తనిఖీలు

ఢిల్లీ నూతన ఎక్సేజ్ పాలసీ వ్యవహారంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) హైదరాబాద్ లోని ఓ ప్రముఖ వ్యాపారి నివాసంలోనూ తనిఖీలు చేసింది. హైదరాబాద్ కోకాపేటలోని ప్రముఖ…

54 నిమిషాలు ago

విడులైన రోజు 50, ఇప్పుడు 1000.. అక్క‌డ `కార్తికేయ 2` హ‌వా మామూలుగా లేదు!

విభిన్న చిత్రాల‌కు కేరాఫ్‌గా మారిన టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్‌.. రీసెంట్‌గా `కార్తికేయ 2`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. 2014లో విడుద‌లైన బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్…

2 గంటలు ago

ఈ విజయవాడ బాలిక చావు తెలివితేటలు మామూలుగా లేవుగా..!

విజయవాడ కు చెందిన పదవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్ధిని (17) గత నెల 22వ తేదీన ఏలూరు కాలువలో దూకింది. రాత్రి సమయంలో అందరూ చూస్తుండగానే…

3 గంటలు ago

క‌వ‌ల‌ల‌కు జ‌న్మనిచ్చిన న‌మిత‌.. పండ‌గ పూట గుడ్‌న్యూస్ చెప్పిన హీరోయిన్‌!

ఒక‌ప్ప‌టి హీరోయిన్ న‌మిత పండండి క‌వ‌ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. ఈ గుడ్‌న్యూస్‌ను ఆమె నేడు కృష్ణాష్టమి సంద‌ర్భంగా రివిల్ చేసింది. `జెమిని` మూవీతో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగు…

3 గంటలు ago

గోమాతకు ఏ ఆహార పదార్థాలను తీసుకుని ఎటువంటి ఫలితాలు వస్తాయంటే.!?

ఆవు :హిందూ సాంప్రదాయంలో పవిత్రమైనది అన్న విషయం అందరికీ తెలిసినదే.. గోవు ను హిందువులు గోమాతగా భావించి పూజలు చేస్తారు.. కనుకనే గోమాతను దైవంగా భావిస్తారు. పురాణాల…

4 గంటలు ago