NewsOrbit
న్యూస్ సినిమా

Karthika Deepam Serial : మోనిత ఇంట్లో ఉన్న కార్తీక్, ఆనంద్ ల ఫోటో చూసి షాక్ అయిన సౌర్య..!

Karthika Deepam Serial : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందామా..గత ఎపిసోడ్ లో ఒకరికి ఒకరు తెలియకుండానే బస్తీకి వెళ్తారు.హిమ చిన్నప్పుడు పెరిగిన శ్రీరామ్ నగర్ బస్తీలో ఉన్న మోనిత ఇంటికి వెళ్లి అక్కడ ఉన్న కార్తీక్ ఫొటో ముందు నిలబడి ఏడుస్తూ ఉంటుంది.అదే సమయంలో సౌర్య కూడా ఓ వ్యక్తిని శ్రీరామ్ నగర్ బస్తీలో డ్రాప్ చేయడానికి ఆటోలో అక్కడికి వచ్చి చిన్నప్పటి రోజులను తలుచుకుంటుంది.

Karthika Deepam Serial : ఆనంద్ తన సొంత తమ్ముడు అని తెలుసుకున్న హిమ

ఇక హిమ మాత్రం కార్తీక్ ఫొటో ముందు దన్నం పెట్టుకుంటూ ఏడుస్తూ అంటే ..మోనిత ఆంటీ డాడీని, అమ్మని చాలా ఏడిపించిందన్న మాట. చిన్నప్పుడు నాకు ఏమి అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమవుతోంది. ‘తన మాటలు, ప్రవర్తన అంతా తేడాగానే ఉండేది’అంటే ‘మోనిత ఆంటీ కొడుకే ఆనంద్ అన్నమాట.ఆనంద్ నాకు సొంత తమ్ముడు అన్ని తెలిసి,అందరూ ఆనంద్‌ని అనాధని చేశారా?’ అంటూ బాగా ఏడుస్తూ ఉంటుంది.

Karthika Deepam Serial : హిమను సౌర్య చూస్తుందా?

ఇక సౌర్య ఇంటిని చూసి ఏంటి ‘లైట్స్ వెలుగుతూ ఉన్నాయంటే.. ఇంట్లో ఎవరో ఉన్నట్లు ఉన్నారు.. వెళ్లి చూద్దాం’ అనుకుంటూ.. ఆటో దిగి లోపలికి నడుస్తుంది.అందరు కూడా ఒకరినొకరు చూసుకుంటారు అని అనుకుంటారు కానీ ఎప్పుడయితే సౌర్య ఇంట్లో అడుగుపెట్టి కార్తీక్ ఫొటో దగ్గరికి వచ్చే సరికి హిమ అక్కడ ఉండదు. కార్తీక్ ఫొటోకి దండ వేసి ఉండటం చూస్తుంది. అలాగే మరో ఫొటోలో మోనిత, కార్తీక్‌లు పూజ చేస్తూ కనిపించడం,ఆనంద్‌ని మోనిత ఎత్తుకుని ఉన్న ఫోటోలు చూసి.. సౌర్య షాక్ అయిపోతుంది.

మోనిత, ఆనంద్ ల ఫోటో చూసి షాక్ అయిన సౌర్య

ఇది మోనిత ఆంటీ ఇల్లా? అదేంటీ? ఆనంద్ మోనిత ఆంటీ కొడుకా? నాన్నని ఆ మోనిత ఆంటీ ఇబ్బంది పెట్టిందా? అందుకే అమ్మ ఏడుస్తూ ఉండేది?’ అంటూ తెగ రగిలిపోతుంది. వెంటనే.. ‘ఇక నుంచి నాకు అక్కా చెల్లెళ్ల బంధాలే కాదు.. అక్క తమ్ముళ్ల బంధాలు కూడా పడవు’ అనుకుంటుంది. వెంటనే మనసులో.. ‘ఫోటో ముందు దీపం వెలుగుతూ ఉందంటే ఎవరో ఒకరు ఈ ఇంట్లో ఉండే ఉంటారు’ అనుకుంటూ ‘ఎవరు ఉన్నారు లోపల అంటూ అరుస్తుంది. దాంతో ఒకామె పైనుంచి కుంటుకుంటూ కిందకు దిగుతుంది.నువ్వు ఎవరు? ఈ ఇంట్లో ఎవరూ లేరా?’ అంటూ సౌర్య ఆమెని అదే కోపంలో అడుగుతుంది. ‘లేదమ్మా.. ఈ ఇంట్లో ఎవ్వరూ ఉండరు.నేను ఇక్కడ ఇల్లు తుడిచి శుభ్రం చేస్తూ ఉంటాను.. ఇందాకే నీ వయసు అమ్మాయి వచ్చి ఈ ఫొటో ముందు దీపం పెళ్లి వెళ్లింది. తను అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి వెళ్తూ ఉంటుంది. వచ్చిన ప్రతిసారీ దీపం వెలిగించి, ఏడుస్తూ ఉంటుంది’ అని చెబుతుంది ఆమె.

హిమను వెతుకుంటూ వెళ్లిన సౌర్య:

దాంతో సౌర్యకు అర్థమవుతుంది వచ్చి వెళ్లేది హిమేనని. దాంతో ‘హిమా నువ్వు ఇక్కడే ఉన్నావా?నిన్ను వదిలేదేలేదు’ అంటూ మనసులో బాగా రగిలిపోతుంది. ‘ఆ అమ్మాయి ఇది ఏది అంటే ‘ఇప్పుడే వెళ్లిందమ్మా.. ఎంతో సేపు కాలేదు’ అని చెబుతుంది ఆ పనిమనిషి. వెంటనే సౌర్య బయటికి పరుగుతీస్తుంది కానీ హిమ కనిపించదు.మరునాడు ఉదయాన్నే స్వప్న.. ఫోన్ మాట్లాడుకుంటూ సోఫాలో కూర్చున్న ప్రేమ్ దగ్గరకు వచ్చి.. ‘నాన్నా బయలుదేరదామా అంటే ‘ఎక్కడికి మమ్మీ అంటాడు ప్రేమ్ విసుక్కుంటూ. ‘గుడికి వెళ్లాలిరాఅని చెప్పి ప్రేమ్‌ని ఒప్పించి గుడికి తీసుకుని వెళ్తుంది స్వప్న.

సౌర్య దొరికే వరకు పెళ్లి చేసుకోను అన్నా హిమ :

మరోవైపు సౌందర్య హిమకు.. తలలో పూలు పెట్టి రెడీ చేస్తుంటే ఆనందరావు వచ్చి ‘పెళ్లి కూతుర్ని రెడీ చేసినట్లు నీ మనవరాలిని రెడీ చేస్తున్నావా సౌందర్యా?’ అంటాడు ప్రేమగా.. ఆ మాటకు అదే పోలికి తాతయ్యా..’ అంటూ విసుక్కుంటుంది హిమ.సౌర్య దొరికే వరకూ నేను పెళ్లి చేసుకోను.. సౌర్య దొరక్కపోతే నేను ఎప్పటికీ పెళ్లి చేసుకోను.. ఇలానే ఒంటరిగా ఉండిపోతాను అంటుంది..అదే సౌర్య నాకు వేసిన శిక్ష అనుకుంటాను’ అంటూ ఎమోషనల్ అవుతుంది హిమ.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Malli Nindu Jabili March 29 2024 Episode 610: 19వ తారీకు మాలిని కి పెళ్లి చేస్తే ధైర్యం ఉంటే ఆపవే అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu March 29 2024 Episode 2142: అంజలి శాంభవి గారిని ఎలా డి కొడుతుంది.

siddhu

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Guppedanta Manasu March 29 2024 Episode 1037: మనుని తిరిగి కాలేజ్ కి రమ్మని అనుపమ చెబుతుందా లేదా.

siddhu

Madhuranagarilo March 29 2024 Episode 325: శ్యామ్ ని సొంతం చేసుకోమని దాక్షాయిని చలపతి చెప్పిన మాటలు విన్న రుక్మిణి ఏం చేయనున్నది..

siddhu

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Paluke Bangaramayenaa March 29 2024 Episode 189: స్వర అభిలకు పెళ్లి జరిగిందని తెలుసుకున్న విశాల్ ఏం చేయనున్నాడు..

siddhu

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

Brahmamudi March 28 2024 Episode 370: దుగ్గిరాల ఇంట్లో మరో రచ్చ.. అగ్గి రా చేసిన రుద్రాణి.. ధాన్యం మీద రాజ్ ఫైర్.. ఆఫీస్ కి బిడ్డ తో వెళ్లిన రాజ్.. రేపటి ట్విస్ట్..

bharani jella