Karthika Deepam: ఆవేశంతో రుద్రాణి ఇంటికి వెళ్లిన కార్తీక్….రుద్రాణి కార్తీక్ ను చంపేస్తుందా… పాపం దీప పరిస్థితి ఏంటి..?

Share

Karthika Deepam: కార్తీక దీపం సీరియల్ మంచి రసవత్తరంగా ముందుకు సాగుతుంది.గత ఎపిసోడ్‌లో రుద్రాణి శ్రీవల్లి, కోటేష్‌లను చంపెయ్యమని ఆదేశించింది. ఇది ఇలా ఉండగా శ్రీవల్లి, కోటేష్ లు స్కూటర్ మీద గుడికి బయలుదేరతారు.ఇక ఈరోజు ఎపిసోడ్ లో తన జీవితంలో జరిగిన అలజడుల గురించి తలుచుకుని అల్లాడిపోతాడు కార్తీక్.సరిగ్గా అప్పుడే బాబు పెద్దగా ఏడుస్తాడు. కార్తీక్ ఎత్తుకోగానే ఏడుపు ఆపేస్తాడు. మళ్లీ ఊయల్లో పడుకోబెడితే మళ్లీ ఏడుస్తాడు. ఎత్తుకంటే ఆపేస్తాడు దానితో ‘ఏంట్రా నీకు నాకు ఉన్న అనుబంధం’ అనుకుంటాడు కార్తీక్ మనసులో..ఇక వారణాసి సౌందర్య, ఆనందరావుల దగ్గరకు వెళ్లి.. ‘ఆ మోనిత ఎందుకు ఇలా చేస్తుందో అర్థం కావట్లేదు మేడమ్.. మా బస్తీ వాళ్లు మాత్రం అంతా ఒకే మాట మీద ఉన్నాం.. ఆమె హాస్పెటల్‌కి వెళ్లడం లేదు.. ఆమెకి పాలు, కూరగాయలు ఏమీ అమ్మడంలేదు మేడమ్’ అంటాడు. దీపక్కే ఫోన్ చేసి విషయం మీకు చెప్పొద్దు అన్నా నేను మీకు చెబుతాను’ అంటాడు వారణాసి.

Vijay devarakonda – Ram charan: విజయ్ దేవరకొండకు షాకిచ్చిన రామ్ చరణ్..ఇప్పట్లో ఆ ప్రాజెక్ట్ ఉండదు..!

ఇక ఈలోపు రుద్రాణి మనుషులు ఓ పెద్ద లారీతో శ్రీవల్లి, కోటేష్‌లు వెళ్తున్న స్కూటర్‌ని గుద్దిస్తారు. దాంతో ఎగిరి రాళ్లపై పడిన వాళ్లిద్దరూ తలలు పగిలి చనిపోతారు. ఇక సీన్ కట్ చేస్తే.. రుద్రాణి రగిలిపోతూ ఉంటుంది. ‘ఎందుకు కోటేష్.. ఏంటిది శ్రీవల్లీ.. నా జోలికి ఎందుకు వచ్చారు..నాకు కోపం వస్తే నేను ఇంతే’ అంటూ అరుస్తూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే తలుపుని తన్నుతాడు కార్తీక్. రుద్రాణి షాక్ అవుతుంది. ఆవేశంగా లోపలికి వచ్చి కార్తీక్ రుద్రాణితో.. ‘అసలు నువ్వు మనిషివేనా.? ఇద్దరు అమాయకుల్ని చంపుతావా? వాళ్ల ప్రాణాలు తీసి నువ్వేం బాగుపడతావు?’ అంటూ అరుస్తాడు.‘ఏంటి సార్? మీరు ఏం మాట్లాడుతున్నారు సార్.. నేను ప్రాణాలు తియ్యడం ఏంటీ? అంటుంది. ఈలోపు కార్తీక్ ప్రాణాలు తీసేంత తప్పు వాళ్లు ఏం చేశారు అంటూ కార్తీక్ ఆవేశంగా అరుస్తాడు. ‘హలో మర్యాదగా మాట్లాడుతుంటే.. రెచ్చిపోతున్నావ్ అంటుంది.నీకు ఇవ్వాల్సిన డబ్బు నేనే ఇస్తాను అన్నాను కదా.. సంతకం కూడా పెట్టాను కదా? ఇంకా వాళ్లని ఎందుకు చంపించావ్’ అంటాడు కార్తీక్.

Salaar: షాకింగ్ అప్‌డేట్ ..ఇది ప్రభాస్ ఫ్యాన్స్ అసలు ఊహించలేదు..!
దీనికి నేను కచ్చితంగా సమాధానం ఇవ్వాలి.. రేయ్ పిల్లి గడ్డం.. సారు దగ్గర ఏ ఫోన్, కెమేరా లేవు కదా.. ఓసారి చెక్ చెయ్‌రా’ అంటుంది. రౌడీ వచ్చి కార్తీక్‌ని మొత్తం వెతికి ఏం లేవు అక్కా.. అంటాడు. ‘సరే తలుపు దగ్గరకు వేసి నువ్వు వెళ్లు’ అంటుంది రుద్రాణి.అవును.. వాళ్లని నేనే చంపించాను. ఆ శ్రీవల్లి, కోటేష్ నా అభిమానం మీద దెబ్బకొట్టారు. అందుకే చంపించేశా..’ అంటూ నిజం చెబుతుంది. కార్తీక్ షాక్ అవుతాడు.మర్యాదగా నిజం చెప్పి పోలీస్ స్టేషన్‌లో లొంగిపో.. లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి.. నీ అంతు చూస్తా’ అంటాడు కార్తీక్ ఆవేశంగా.. ‘ఎక్కడకి వచ్చి ఏం మాట్లాడుతున్నారు సారు.. ముందు నా బాకీ తీర్చండి. అగ్రిమెంట్ ప్రకారం మీరు డబ్బు చెల్లించకపోతే మీ కూతురు హిమని నేను దత్తత తీసుకుంటాను.. అప్పుడు తను నా కూతురు అవుతుంది..గుర్తుపెట్టుకో’ అంటుంది రుద్రాణి కూల్‌గా.. దాంతో కార్తీక్‌కి పిల్లలే గుర్తొస్తారు. మరి కార్తీక ఏమి చేస్తాడో తరువాయి భాగంలో చూద్దాం!


Share

Related posts

కీర్తి సురేష్ పెంగ్విన్ సినిమా నుండి అదిరిపోయో అప్‌డేట్ ..జూన్ 8 సర్‌ప్రైజ్ ..!

GRK

Kappa Variant: డెల్టా వేరియంట్ తలదన్నే కోవిడ్ వైరస్ రకం వచ్చేసింది..! భారత్ భరతం పట్టే దాకా వదిలేలా లేదు

arun kanna

తప్పేలా లేదా వాళ్ళంతా ఓటీటీ వైపు ఒగ్గాల్సిందేనా ..?

GRK