Karthika Deepam: రుద్రాణి అనుకున్నంత పని చేసేసిందిగా..ఇంకా కార్తీక్ -దీపలకు హిమ దూరం అయిపోయినట్లేనా..?

Share

Karthika Deepam: కార్తీక దీపం సీరియల్ కోసం ఎంతోమంది కళ్ళు కాయలు కాచే దాక ఎదురు చూస్తూ ఉంటారు. అంతలా ఈ సీరియల్ ను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. సీరియల్ కూడా ఎంతో ఆసక్తిగా ముందుకు సాగుతుంది. ఇకపోతే సోమవారం ప్రసారమయ్యే ఎపిసోడ్ లో ఏమి జరగనుందంటే..కార్తీక్ ఒక చోట కూర్చుని తన ఫ్యామిలీని ఇబ్బంది పెట్టి,ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోవడం తప్పే అని మనసులో బాధ పడుతూ ఉంటాడు.కానీ పరిస్థితులు వలన అలా చేయక తప్పడం లేదు అని అనుకుంటాడు కార్తీక్. ఇంతలో బాబు ఏడుస్తుంటే వాడిని ఎత్తుకొని కాసేపు ఓదార్చుతాడు. సీన్ కట్ చేస్తే మరోవైపు కార్తీక్, దీప ఎక్కడున్నారో అని టెన్షన్ పడుతూ ఉంటారు సౌందర్య, ఆనందరావు. వారణాసిని పిలిపించి దీప ఫోన్ చేసిందా అని అడుగుతుంది సౌందర్య.లేదు మేడమ్ అని అంటాడు.


Rajamouli: మీ స్వార్ధం కోసం ఇలా చేస్తారా..రాజమౌళిపై వాళ్ళందరికీ మండిపోతోందట..!

Karthika Deepam: మోనితకి చుక్కలు చూపిస్తున్న బస్తీవాసులు..

బస్తీలో మోనిత ఆసుపత్రికి పెట్టినప్పటి నుండి తనతో ఎవ్వరూ మాట్లాడటం లేదని, తనకి నిత్యావసర సరుకులు కూడా ఇవ్వడం లేదు అని చెబుతాడు. సరే మేడం దీపక్క ఫోన్ చేస్తే నేను మీకు చెబుతాను అని వెళ్ళిపోతాడు. వారణాసి వెళ్ళిపోయాక నాకు ఇప్పుడు దైర్యం వచ్చిందండి అంటుంది సౌందర్య. కార్తీక్ ఎక్కడున్నా,దీప పక్కన ఉంటే వాడు చాలా బాగుంటాడు అనుకుని కార్తీక్ గురించి ఆలోచించి కంటతడి పెడుతుంది సౌందర్య. దీప కార్తీక్ ను ఎప్పుడూ ఓడిపోనివ్వదని మీరు అన్నారు గుర్తుందా అండి…అది నిజమేనండి అంటుంది సౌందర్య.

Omicron Virus: ఓరి నాయనో .. ఒమిక్రాన్ నీకోక దండం .. 10 కోట్ల కరోనా కేసులు !

 

ఆవేశంలో రుద్రాణి ఇంటికి వెళ్లిన కార్తీక్ ఏమిచేస్తాడో.?

గుడికి వెళ్లి వస్తున్న కోటేశ్, శ్రీవల్లికి యాక్సిడెంట్ చేయించి చంపిస్తుంది రుద్రాణి.ఈ విషయం తెలిసి కార్తీక్ కోపంతో రుద్రాణి దగ్గరికి వెళ్లి తనపై మండిపడతాడు. నువ్వసలు మనిషివేనా? ఇప్పుడు నీ కళ్లు చల్లబడ్డాయా అని అడుగుతాడు. నీకు ఇవ్వాలిసిన డబ్బులు నేను ఇస్తా అన్నాకదా మరి ఎందుకు వాళ్ల ప్రాణాలు తీసావ్..నువ్వేం బాగుపడతావు అంటాడు కార్తీక్. ముందైతే నేను చంపించలేదు అని, ఎట్టకేలకు నేనే చంపించా అని ఒప్పుకుంటుంది. ఎందుకు చేసావ్ ఇలా అంటే… దానికి సమాధానంగా నువ్వు నా వాళ్లను కొట్టినా, నీ భార్య నన్ను కొట్టినా ఊరుకున్నాను.కానీ ఆ శ్రీవల్లి నా ఇంటికే పోలీసులను పంపించి నన్ను కొట్టించి,నా మీద కేసు పెట్టి మరి నా పరువు తీసింది అని మండిపడుతుంది రుద్రాణి.

హిమను దత్తత తీసుకోనున్న రుద్రాణి… పాపం కార్తీక్:

నన్ను కొట్టిన పోలీస్ ట్రాన్స్ ఫర్ అయిపోయింది మరి నా పగ, కోపం ఎవరి మీద తీర్చుకోవాలి అందుకే ఇద్దరినీ చంపించాను అంటుంది రుద్రాణి.ఆ మాటలు విన్న కార్తీక్ షాక్ అవుతాడు.చేసిన తప్పులు ఒప్పుకొని పోలీస్ స్టేషన్ లో లొంగిపో లేదంటే మాములుగా ఉండదు అని హెచ్చరిస్తాడు కార్తీక్.కానీ రుద్రాణి మాత్రం కూల్ గా చెప్పిన నీతి కధలు చాలుగాని నా బాకీ తీర్చుతానని సంతకం పెట్టారు కదా ముందు నా బాకీ తీర్చండి లేదంటే నీ కూతురు హిమను నేను దత్తత తీసుకుంటాను అని వార్నింగ్ ఇస్తుంది రుద్రాణి. ఆ మాటలు విన్న కార్తీక్ షాక్ అయ్యి బాకీ ఎలా తీర్చాలి అని ఆలోచిస్తాడు. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో కార్తీక్ హిమను కాపాడుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తాడో తెలియాలంటే తరువాయి భాగం వరకు వేచి చూడాల్సిందే.


Share

Related posts

చంద్రబాబుని నిండా ముంచిన పవన్ కల్యాణ్!

CMR

Pawan kalyan : పవన్ కళ్యాణ్ – రానాల మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ ..ఎప్పుడంటే

GRK

బ్రేకింగ్: కీసర ఎమ్మార్వో నాగరాజు లంచంలో కేసులో కొత్త ట్విస్ట్! రేవంత్ రెడ్డి హస్తం!!

Vihari