Karthika Deepam: ఇవాళ ఎపిసోడ్ లో బాబు తో ఉన్న దీప -కార్తీక్ లని చూసి ప్రేక్షకుల కంట్లో నీళ్ళు తిరిగాయి !

Share

Karthika Deepam: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీక దీపం సీరియల్ ఎంతో రసవత్తరంగా సాగుతుంది. నిన్నటి ఎపిసోడ్ లో దీప కనిపించకపోవడంతో కంగారుగా ఊరంతా తిరుగుతాడు కార్తీక్ అక్కడితో నిన్నటి ఎపిసోడ్ పూర్తి అవుతుంది. ఇంకా ఈరోజు ఎపిసోడ్ లో కార్తీక్ ఇంట్లో కూర్చుని రుద్రాణి అన్న మాటలు గుర్తుచేసుకుని బాధపడతాడు.ఈలోపు బాబుని చేతుల్లోకి తీసుకుని అయ్యో వీడికి జ్వరం వచ్చిందని చన్నీళ్లతో వళ్లంతా తుడుస్తాడు. అయినాగాని టెంపరేచర్ తగ్గేలా కనిపించడం లేదు అనుకుని జ్వరం మందు వేయాల్సిందే, ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిందే అనుకుని అయినాగానీ నేను కూడా ఒక డాక్టర్ నే కదా అనుకునే లోపే మనసులో కార్తీక్ నువ్వు పేషెంట్ ని చంపేశావ్ అన్న మాటలు గుర్తుచేసుకుంటాడు. మరోవైపు దీప ఎక్కడా కనిపించలేదు.ఆ రుద్రాణి ఏమైనా చేసిందా అని ఆలోచించి దీప గురించి వెతకడానికి వెళుతుండగా దీప ఇంటికి వస్తుంది. ఏంటీ దీపా ఎంత టెన్షన్ పడుతున్నానో?ఎక్కడికి వెళ్ళావ్.. ఏమయ్యావ్ అంటాడు.

Devatha Serial: రుక్మిణీని చూసిన వెంటనే పరుగు పరుగున ఇంటికి వెళ్లిన సూరి.. చూసింది చెప్పేలోగా ఏమైందంటే.!?

Karthika Deepam: దీప ఎక్కడికి వెళ్ళింది? ఏమైంది?

పిండి వంటలు అమ్మేందుకు కొంచెం ఎక్కువ తిరిగానులెండి.. అయినాగానీ మీరెందుకు అలా భయపడుతున్నారంటుంది. ఆ రుద్రాణి అని అనేలోపే ఆగిపోతాడు కార్తీక్. తనేదో అందని భయపడుతున్నారా, రుద్రాణి నన్నేం చేస్తుందంటుంది. ఇంతలో పిల్లలు వచ్చి మాకు రుద్రాణి లంచ్ తీసుకొచ్చిందని అందుకే తినకుండా తొందరగా వచ్చేశాం అంటారు.అయినాగాని ఆమె మాకెందుకు లంచ్ బాక్స్ తెస్తోందని పిల్లలు అంటే మీరు తెలుసు కదా అందుకే తీసుకొచ్చిందేమో అని సర్దిచెబుతుంది. మరోవైపు దీప-కార్తీక్ ని వెతుకుతూ తాడికొండ గ్రామానికి వెళ్లిన బిచ్చగాడు కార్తీక్ కనిపించకపోవడంతో మరో ఊరు వెళ్లాలని అనుకుంటాడు.

Corona: కరోనాలో కొత్త వేరియంట్, ఒమిక్రన్ మించిన IHU..??
కార్తీక్ డాక్టర్ అనే విషయాన్ని రాను రాను మర్చిపోతున్నాడా..?

మళ్ళీ సీన్ కార్తీక్ దగ్గర ఓపెన్ అవుతుంది.బాబుకి జ్వరం రావడంతో జ్వరాన్ని తగ్గించడానికి ఒళ్లు తుడుస్తున్నా అంటాడు. ఇవన్నీ మీకెలా తెలుసు అన్న దీపతో..నేను డాక్టర్ ని అనబోయి ఆగిపోతాడు. ఇంతలో దీప ఎవరో ఏదో అన్నారని మీ వృత్తిని వదిలేసుకుంటే ఎలా అని స్వామీజీ-పాము కథ చెబుతుంది.ఒక స్వామి చెప్పాడని పాము ఎవరిని కాటేయడం మానేస్తుంది. అయినాగానీ దాన్ని అంతా కొట్టేవారు.. మరుసటి రోజు స్వామిజీ దగ్గరకు వెళ్లిన పాము నేను కాటేయడం మానేసినాగాని అందరు నన్ను కొడుతున్నారని అంటే.. నేను నిన్ను కాటేయొద్దు అన్నా కానీ బుసకొట్టొద్దని చెప్పలేదు కదా అనే కథ చెబుతుంది దీప.తెలియని వాటికి బాధ్యత వహించకపోయినా, కళ్లముందు జరిగే వాటికి అయినా బాధ్యత వహించాలంటుంది దీప. ఎవరు అవునన్నా కాదన్నా మీరు డాక్టరే అంటుంది.ఇంతలో కార్తీక్ బాబుకి అవసరమైన మందులు చీటీ రాసిచ్చి తీసుకురమ్మని చెప్పి పంపిస్తాడు.
Wipro: నిరుద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించిన దేశ ఐటి దిగ్గజం విప్రో..!!
నర్సమ్మని మోనిత ఇంటినుండి వెళ్లగొట్టిన బస్తీవాసులు :

సీన్ కట్ చేస్తే సౌందర్య ఇంట్లో ఉన్న మోనిత ఫొటో బయట విసిరేయకుండా స్టోరూంలో పెట్టావ్.ఆ ఫొటో మోనిత వచ్చి తీసుకెళ్లిందని,ఆ ఫొటో తీసుకెళ్లి ఏం చేస్తుందో అని ఆదిత్యతో సౌందర్య చెబుతుంది. అమ్మా ఆ మోనిత గురించి ఎక్కువ భయపడుతున్నావు. వదిలేయ్ అంటాడు.అన్నయ్య వాళ్లు కావాలని మనకు దొరక్కుండా జాగ్రత్తపడుతున్నారు కాబట్టి దొరకలేదు కానీ లేదంటే ఇప్పటికే పట్టుకునే వాళ్ళం అంటాడు. కట్ చేస్తే సీన్ ప్రజా వైద్యశాలలో ఓపెనైంది. వారణాసిని చూసిన మోనిత నువ్వేంటి ఇక్కడ అని అడుగుతుంది. నర్సమ్మని బయటకు పంపించాం అన్న వారణాసి..ఎవ్వరు వచ్చినా పంపించేస్తామని..మీ ఆటలు ఇక్కడ సాగవని హెచ్చిరిస్తాడు.

మోనిత కొడుకు బాధ్యతను నెత్తినపెట్టుకున్న దీప :

సీన్ కట్ చేస్తే ఇంట్లో అన్నం తింటున్న పిల్లలు అమ్మా తమ్ముడికి కూడా పెట్టవా అని అడుగుతారు. అప్పుడే పెట్టకూడదని చెబుతుంది.ఈలోపు సౌర్య మనకే తినడానికి ఇబ్బందిగా ఉంటే మళ్ళీ ఓ బాబుని పెంచుకుంటున్నారని అందరూ అంటున్నారని చెబుతుంది.మన చుట్టూ ఉన్న వాళ్లంతా మన ఎదురుగా మాట్లాడరు వెనకే మాట్లాడతారు. అవన్నీ పట్టించుకోకూడదు అంటుంది.ఈ వయసులో పాపం వీడు తల్లిదండ్రులును పోగొట్టుకుని మనకు దగ్గరయ్యాడు. మీరు ఎవరేమన్నా పట్టించుకోవద్దు.మన కుటుంబంలో ఒక సభ్యుడిలాగా వీడు మనతో ఉంటాడు అంటుంది దీప. ఇక్కడితో ఈ ఎపిసోడ్ ముగిసింది.


Share

Related posts

KCR : ఉద్యోగుల విష‌యంలో కేసీఆర్ నాన్చుతుంటే… జ‌గ‌న్ తేల్చేశారు

sridhar

Daily Horoscope ఆగష్టు 28th శుక్రవారం మీ రాశి ఫలాలు

Sree matha

Kamal Hassan: కెరీర్ లో రెండో సారి డిఫరెంట్ క్యారెక్టర్ లో కమల్ హాసన్..!!

sekhar