Karthika Deepam :సౌందర్యకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన మోనిత.. !!

Share

Karthika Deepam :బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునే సీరియల్స్ లో కార్తీక దీపం కూడా ఒకటి అని చెప్పడంలో అతిశయోక్తి లేదనే చెప్పాలి. రాత్రి 7.30. అయితే చాలు చాలా మంది కూడా టీవీలకు అతుక్కుని పోతారు. సీరియల్ అయిపోయిన వెంటనే అయ్యో అప్పుడే అయిపోయిందా..? తరవాత ఏమి జరుగుతుంది. కధ ఎలాంటి మలుపు తిరుగుందో అనే ప్రశ్నలతో సతమత మయిపోతుంటారు. మళ్ళీ మరుసటి రోజు సీరియల్ టైమ్ దాక వేచి చుడాలిసిందే కదా.

అందుకనే మీకోసం ఈరోజు కార్తీక దీపం సీరియల్ ఎలాంటి ఉత్కంఠ కధనంతో సాగుతుందో ముందుగానే తెలియచేస్తున్నాము. గత ఎపిసోడ్‌ ఒకసారి నెమరు వేసుకుంటే దీప తన బంగారమంతా తాగట్టు పెట్టి డబ్బు తెచ్చుకుంటుంది. ఇకపోతే దారిలో తారసపడిన కోటేష్, శ్రీవల్లి కొడుకుని చూసి రుద్రాణి ముచ్చటపడి దిష్టి తీసి వాళ్ళకి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది. మరొవైపు వారణాసి సీన్ లోకి ఎంటర్ అయ్యి సౌందర్యని కలిసి ‘దీపక్క వాళ్ల సమాచారం ఏం తెలియలేదు మేడమ్’ అంటూ కంటతడి పెట్టుకుని చెబుతాడు. ఆ తరువాత అదే సీన్ ఈరోజు కథనంలో కంటిన్యూ అవుతుంది.

Balakrishna: రవితేజ డైరెక్టర్ కి స్టేజ్ పైన వార్నింగ్ ఇచ్చిన బాలయ్య బాబు..!!

మోనితకు అట్లకర్రతో ఆటోగ్రాఫ్ ఇస్తాను అన్నా సౌందర్య అంత పని చేస్తుందంటారా!?

సౌందర్య దీప కోసం వారణాసి దగ్గర బాధపడడం చుసిన మోనిత కోడలి కోసం ఎంత ఏడుస్తున్నారు అత్తయ్య.. మరి నా బాబు ఏం పాపం చేశాడు.. వాడు మీ మనవడే మరి వాడి కోసం మీరు బాధపడుతున్నారా అని అడుగుతుంది. మోనిత మధ్యలో రాకు అంటూ సౌందర్య మోనితను తిడుతుంది కానీ మోనిత మాత్రం ఏమి తగ్గదు.

అప్పుడు ఆ రోజు మీరు తల్లిని బిడ్డని వేరు చేసి దీప దగ్గర నుండి హిమని ఎత్తుకొచ్చారు అప్పుడు దీప, కార్తీక్‌ లని కలపడానికి మీరు అలా చేసారు కదా మరి ఈ రోజు నన్ను కార్తీక్‌ ని విడదియ్యడానికి నా బిడ్డని మీరే మాయం చేసి ఉంటారని నేను అనుకోవడంలో తప్పేముంది..? అంటూ సౌందర్యను ప్రశ్నిస్తుంది. మోనిత మాటలకు సౌందర్య కోపంతో ‘నోరుముయ్.. మోనితా నీ బాబు కనిపించకపోతే నువ్వు వెళ్లి వెతుక్కో అంతేకాని మమ్మల్ని హింసించకు. ఇలాగే వాగుతూ ఉంటే నువ్వు నిద్రపోయినప్పుడు బాగా కాల్చిన అట్లకర్రతో నీకు ఆటోగ్రాఫ్ ఇస్తాను జాగ్రత్త’ అంటూ హెచ్చరించి మోనిత నోరు మూయించి వారణాసిని పంపించేస్తుంది సౌందర్య.

RRR: “RRR” కోసం రంగంలోకి బాలయ్య బాబు, చిరంజీవి..??
డాక్టర్ బాబుని చేతకానివాడిలా వంటలక్క బావించే బంగారం అమ్మేసిందా.?

ఇక సీన్ కట్ చేస్తే పెరట్లో హిమ, సౌర్య, కార్తీక్ మొక్కలు నాటుతూ ఉంటారు. ఈలోపు దీప ఇంటికి వచ్చి ‘మంచి పని చేస్తున్నారు నేను సహాయం చేస్తా అంటూ వస్తుంది. అప్పుడే దీపను చుసిన శ్రీవల్లి దీప అక్కా నీ ఒంటి మీద బంగారం ఏమైంది..? లేదేంటి అని అడిగేస్తుంది. దీప సమాధానం చెప్పలేక తడబడుతూ ఉంటుంది. కార్తీక్, పిల్లలు ముగ్గురు కూడా ఆశ్చర్యంగా దీప వంక చూస్తుంటారు. ఇంతలో బాబు లేచి ఏడుస్తుంటే.. శ్రీవల్లి, పిల్లలు బాబు దగ్గరకు వెళ్తారు. వెంటనే కార్తీక్ దీపతో ‘బంగారం అమ్మేశావా దీప. నేను చేతకానివాడిలా అయిపోయాను అని అనుకుంటున్నావా..? నన్ను ఏ పని చెయ్యొద్దు అంటావ్.. నువ్వు మాత్రం నాకు చెప్పకుండా ఇలాంటి పనులు చేస్తుంటావ్’ అని బాధ పడతాడు. అయ్యో కార్తీక్ బాబు ‘అమ్మలేదు తాగట్టు పెట్టాను.. అంతే’ అంటూ సర్ది చెప్పబోతున్న గాని కార్తీక్ చాలా ఫీల్ అవుతాడు. వెంటనే దీప కార్తీక్‌ చేతులని తన చేతుల్లోకి తీసుకుని ‘ఒక్కోసారి మనం మంచి పనులు చేసినా మన చేతులకు మట్టు అంటుంది కార్తీక్ బాబు.మీ తప్పేం లేదు కదా’ అంటుంది. ఈలోపు సేటు దగ్గర దీప తాకట్టు పెట్టిన బంగారం అంతా రుద్రాణి సేటు దగ్గర నుండి తీసేసుకుంటుంది.

మోనిత కాళ్ళు పట్టుకుని ఎందుకు శ్రావ్య ప్రాదేయబడుతుందంటే.?

ఇకపోతే మోనిత మాత్రం కోపంలో తెగ రగిలిపోతూ ఉంటుంది. ఈలోపు శ్రావ్య ఏడుస్తూ.. ‘అత్తయ్యా దీపగాడు కనిపించడంలేదు అత్తయ్యా అంటూ ఏడుస్తూ వచ్చి సౌందర్యకు చెబుతుంది. ఇందాకే మంచం మీద పడుకోపెట్టాను ఇప్పుడు కనిపించడం లేదు’ అంటూ ఏడుస్తూ చెబుతుంది.ఇంతలో అక్కడికి మోనిత రాగానే దీపుని మాయం చేసింది మోనిత అనే అంటూ మాత్రం వెంటనే కాళ్ల మీద పడిపోతుంది శ్రావ్య. ‘మోనితా నీకు దణ్ణం పెడతాను.. ప్లీజ్.. నా బాబుని నాకు ఇచ్చెయ్ అంటూ చాలా ఎక్కి ఎక్కి ఏడుస్తుంది.వెంటనే సౌందర్య ‘శ్రావ్య లే దాని కాళ్లు పట్టుకుంటావేంటీ..?’ అని తిడుతుంది. ‘లేదు అత్తయ్యా.. మోనితే నా బాబుని మాయం చేసి ఉంటుంది అని మోనితని ప్రాధేయపడుతుంది.

అసలు దీపు ఏమయ్యాడు..దొరుకుతాడా? ఎవరు ఎత్తుకెళ్లారు?

శ్రావ్య మోనితను దీపు కోసం బతిమిలాడుతూ ఉంటుంది. ఈలోపు మోనిత పొగరుగా సౌందర్య వైపు చూస్తూ పైకి మెట్లు ఎక్కుతూ మధ్యలో ఆగి అక్కడే కాలు మీద కాలు వేసుకుని కూర్చుని, కాలు ఊపుతూ ‘ఇప్పుడు అర్థమైంది శ్రావ్య నీకు కన్నప్రేమ ఎలా ఉంటుందో అని? కడుపున పుట్టిన బాబు కనిపించకపోతే కన్న పేగు ఎలా అల్లాడుతుందో అని? జస్ట్ చిన్న శాంపిల్ చూపించా అంతే అంటుంది సౌందర్యవైపు పొగరుగా చూస్తూ..‘వెళ్లు శ్రావ్య పైకి వెళ్లి చూడు నా బెడ్ కింద పడుకోబెట్టాను తెచ్చుకో.. నీ బాబుని అని చెబుతుంది. శ్రావ్య వెంటనే ఏడుస్తూ పరుగుతీస్తుంది. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. మరిన్ని వివరాలు నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం!


Share

Related posts

Sampoornesh Babu: నా పుట్టినరోజు సిడిపిని నేనే రిలీజ్ చేసుకుంటానంటున్న సంపూర్ణేష్ బాబు..!!

bharani jella

Janasena: జనసేన కార్యకర్త చావుకు కారణమైన ఎమ్మెల్యేకి జగన్ ఝలక్..??

sekhar

రాజమౌళి ని మించిన డైరెక్టర్ అతను – అతని స్క్రిప్ట్ కోసం ఎగబడుతున్న ఎన్‌టి‌ఆర్ , ప్రభాస్..!

GRK