Karthika deepam: మోనిత ఆటకు చెక్ పెట్టిన సౌందర్య..మరి మోనిత నెక్స్ట్ ప్లాన్ ఏంటి..?

Share

Karthika deepam: కార్తీక దీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ భలే ఆసక్తిగా సాగుతుంది. గత ఎపిసోడ్‌లో మోనిత, తన హాస్పెటల్ అమ్మేసి, బస్తీలో ‘వంటలక్క ప్రజావైద్యశాల’అని క్లినిక్ పెట్టి ‘బస్తీవాసులారా మీకు నేను తోడుగా ఉంటాను.. వైద్యం చేస్తాను’ అని మోనిత చెప్పినా వారణాసితో పాటు అక్కడ ఉన్నవారు అందరు ఈమెతో మనకెందుకులే అని వెళ్లిపోతారు. అలాగే మోనిత దగ్గర పని చేసే ప్రియమణి పని మానేసి ఆమె సొంత ఊరు వెళ్లిపోయింది.అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ప్రియమణి సొంతవూరు తాడికొండ గ్రామం అవటంతో కధ మరింత ఉత్కంఠగా మారింది. ఎందుకంటే అదే గ్రామంలో కార్తీక్,దీప, పిల్లలే కాకుండా మోనిత కొడుకు కూడా ఉంటారు కాబట్టి. తరువాత ఏం జరగనుందో అనే ఆసక్తి అందరిలోనూ పెరిగిపోయింది.

Guppedentha manasu: వసుధారకి గౌతమ్ క్లోజ్ అవుతుంటే రిషికి వచ్చిన బాధ ఏంటి అంటే.??

మోనిత దగ్గర చేరిన కొత్త పని మనిషి మంచిదేనా..?

ఇక మోనిత దగ్గర ప్రియమణి స్థానంలోకి కొత్తగా పనిలోకి వచ్చిన నర్స్ పేరు నరసమ్మ. ఆమె ఇంటి పనులు కూడా చేస్తూ ఉంటుంది. ఇక మోనిత.. నరసమ్మ ఇచ్చిన జ్యూస్ తాగుతూ నరసమ్మ కు ఇలా చెబుతూ ఉంటుంది. ఇదివరకు ప్రియమణి అని ఓ జాతిరత్నం నా దగ్గర పని చేసేదిలే అది ఎందుకు పని మానేసిందో తెలుసా? పిచ్చి ప్రశ్నలు వేయడం,ఆరాలు తీయడం లాంటివి చేసి మానేసింది.. నువ్వు కూడా ఆరాలు తీయడం, నీతులు చెప్పడం మానెయ్’ అంటుంది.ఇదంతా విని నరసమ్మ మోనితను ‘అమ్మా పెళ్లి అయినవాడ్ని ప్రేమించడం తప్పు అని మీ అత్తగారు అన్నారు కదమ్మా’ అంటుంది.ఆ మాటకు మోనితకు కోపం వచ్చి చేతిలోని జ్యూస్ గ్లాస్ విసిరి కొట్టి.. కోపంతో చెప్పింది అర్థం కాలేదా.. అయిన నేను పెళ్లి అయిన వాడ్ని ప్రేమించలేదు.. 18 ఏళ్లుగా ప్రేమిస్తున్నాను.కార్తీక్ నన్ను పెళ్లి చేసుకోలేదు.. ఇప్పుడు న కార్తీక్ లేడు, నా కొడుకు లేడు.కానీ ప్రేమ మాత్రమే ఉంది’ అంటూ అరుస్తుంది. ‘అది చాలమ్మా, ప్రేమ చాలు.. వాటన్నింటిని అదే లాక్కొస్తుంది’ అంటూ నరసమ్మ మోనితను కూల్ చేస్తుంది.

Amavasya : అమావాస్య రోజు ఇంటి ముందు ముగ్గు  వేయకూడదు అని తెలుసా?దానికి కారణం ఇదే !!
మోనిత బిడ్డకు నామకరణం… కార్తీక్ చేతుల మీదగా జరిగేనా..?

ఇకపోతే దీప, కార్తీక్‌ల దగ్గరకు కోటేష్, శ్రీవల్లి వచ్చి ‘రేపు బాబుకి నామకరణం చేస్తున్నాం.. పంతులుగారు వస్తున్నారు’ అని చెబుతారు. ‘వంటల పని నేను చూసుకుంటాను అని దీప అంటుంది. ‘ఊరంతా పిలిచి ఉన్నంతలో వండి పెడదాం..’ అని దీప అనడంతో ‘ఊరిలో ఎవ్వరూ మనింటికి రారులే అక్కా. ఆ రుద్రాణితో గొడవ అంటే ఊరంతా దూరమైనట్లే’ అంటుంది శ్రీవల్లి. ‘ఎవరూ రాకుంటే ఏంటీ.. మేము ఉన్నాం కదా అంటారు దీప, కార్తీక్.

రత్నసీత తీసుకుని వచ్చిన వీడియోలో ఏముందంటే..?

సీన్ కట్ చేస్తే రత్నసీత ఒక వీడియో తెచ్చి, సౌందర్య, ఆనందరావులకు చూపించి ‘మోనిత విషయం గురించి ఆరా తీస్తున్నప్పుడు ఇది దొరికింది మేడమ్.. అని ఆ వీడియోని ఫోన్‌లోకి షేర్ చేసి వెళ్ళిపోతుంది. ఆ వీడియో చూసి ఇద్దరూ కూడా షాక్ అవుతారు. సీన్ కట్ చేస్తే మరునాడు ఉదయాన్నే హిమ, సౌర్య బయట ఆటలు ఆడుకుంటూ ఉంటారు. ఇంతలో సౌర్య కాలికి రాయి గుచ్చుకుని కిందపడి ఏడుస్తూ ఉంటుంది.అది చూసి కార్తీక్ వాళ్లు పరుగున వచ్చి సౌర్యని లేపుతారు. ‘చెప్పులు వేసుకుని ఆడుకోవచ్చుకదమ్మా’ అంటాడు కార్తీక్.చెప్పలు తెగిపోయాయి నాన్నా’ అని సౌర్య అనడంతో ‘కనీసం చెప్పులు కూడా కొని ఇవ్వలేకపోతున్నానా? అని మనసులో బాధపడతాడు కార్తీక్.ఇంకా వెంటనే దీప నవ్వుతూ.. ‘చెప్పులే కదా నేను కొంటాలే అత్తమ్మా’ అంటుంది సౌర్యతో.

మోనితకు చుక్కలు చూపించిన సౌందర్య!

మోనితని నిలబెట్టి సౌందర్య కుటుంబం వాయించే సీన్ అన్నమాట. ఇన్నిరోజులు నీ ఆగడాలను చూస్తూ, భరిస్తూ ఉన్నది కేవలం ఆధారాలు లేవనే కారణంతోనే అంటూ రత్నసీత అందించిన వీడియోని మోనిత ముందు ప్లే చేస్తుంది సౌందర్య. మోనిత కారులోంచి బాబుని ఎత్తుకెళ్లిన కోటేష్ వీడియో అది.ఆ వీడియో చూసి మోనిత షాక్ అయ్యి నోరు మూసుకుని ఉండిపోతుంది. ఇంతలో ఆదిత్య పైకి వెళ్లి మోనిత బ్యాగ్ తీసుకొచ్చి విసిరికొడతాడు. ‘నువ్వు వెళ్తావా? నన్ను మెడ పట్టుకుని గెంటమంటావా?’ అంటుంది సౌందర్య.మరి మోనిత ఇల్లు వదిలి వెళ్లిపోతుందా..? కోటేష్ కోసం వెతుకుతుందా? దీప, కార్తీక్ లను ప్రియమణి చూస్తుందా అనే విషయాలు రేపటి ఎపిసోడ్ లో తెలుస్తాయి.


Share

Related posts

RRR: ఇండియాలో కాక ఇంటర్నేషనల్ స్థాయిలో “RRR” ఎన్ని భాషల్లో రిలీజ్ అవుతుందో తెలుసా..??

sekhar

Past Life: ఈ జన్మలో మీ చుట్టూ ఉన్న బంధాలు గత జన్మలో ఎవరో తెలుసుకోండి!!

siddhu

తస్మాత్ జాగ్రత్త జగన్ ! శ్రీవారి సొమ్ము జోలికి వెళ్లొద్దు!!

Yandamuri