Karthika Deepam:బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది.గత ఎపిసోడ్లో డాక్టర్ చంద్రశేఖర్ అనే వ్యక్తి తన భార్యని తీసుకుని, తన కొడుకుకు హిమని ఇచ్చి పెళ్లి చేయమని మాట్లాడటానికి సౌందర్య ఇంటికి వస్తాడు ఆ విషయం తెలుసుకున్న హిమ ఒక్కసారిగా షాక్ అవుతుంది.ఈ పెళ్ళికి ఒకే చెబితే నిరూపమ్ బావ నన్ను మర్చిపోతాడు అని మనసులో అనుకుంటుంది. ఇక ఈ విషయం నిరూపమ్ కి స్వప్న చెబుతుంది.మమ్మీ నువ్వు చెప్పేది నిజమా? హిమ పెళ్లి చేసుకుంటుందా?’ అంటూ కంగారు పడుతూ అడుగుతాడు నిరుపమ్ స్వప్నని. ‘అవునురా నిజమే అంటుంది.అది నిన్ను కాదు అని మరో డాక్టర్ని పెళ్లి చేసుకుంటోంది.. నువ్వు మాత్రం ఇలా అల్లాడిపోతున్నావ్’ అంటూ స్వప్న నిరుపమ్‌ని తిడుతుంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
హిమ మీద ఎలా పగ తీర్చుకోవాలి అని చూస్తున్న సౌర్య:
ఇక సీన్ కట్ చేస్తే.. సౌర్య.. సౌందర్య తన ఇంటికి వచ్చి వెళ్లడం గురించే ఆలోచిస్తూ మురిసిపోతుంది.అసలు ‘ఆ హిమ పెళ్లి ఎందుకు వద్దు అంది.అయినా ఇంకా దానికి పొగరు, పెంకితనం ఇంకా పోలేదా? అని అనుకుంటుంది. అయినా దాని గురించి నేను ఆలోచించడం ఏంటీ? టైమ్ వేస్ట్ అని అనుకుని, నా మొగుడు అదే నా కాబోయే మొగుడు ఏం చేస్తున్నాడో ఏంటో అనుకుంటుంది. అయ్యో ఆ తింగరి డాక్టర్ సాబ్‌ని కలవడానికీ రమ్మంది కదా అని గుర్తు చేసుకుంటుంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
రాత్రిపూట నిరూపమ్, హిమ ఎందుకు కలిసారు?
చీకటి పడ్డాక నిరుపమ్ కారు ఆపి రోడ్డు మీద వెయిట్ చేస్తూ ఉంటాడు. హిమ కారులో వస్తుంది వెంటనే నిరుపమ్ హిమని కిందకు లాగి ఇప్పుడైనా నీ మనసులో ఏముందో చెప్పు హిమా.. అంటూ గొడవకు దిగుతాడు. ‘ఆ దేవుడు నీకు నాకే రాసిపెట్టాడు. నీకు పెళ్లి అంటూ జరిగితే అది నాతో జరుగుతుంది.నువ్వు వేరే పెళ్లికి ఒప్పుకోవడం ఏంటీ?’ అంటూ అరుస్తాడు. హిమ మౌనంగానే ఉంటుంది. సరిగ్గా అప్పుడే జ్వాల ఆటో అక్కడ ఆపి.. వాళ్లిద్దరూ గొడవ పడటం చూసి షాక్ అవుతుంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
జ్వాలకు దొరికిపోయిన హిమ, నిరూపమ్ లు :
‘ఏంటి వీళ్లిద్దరూ ఇంత గట్టిగా ఈ టైమ్‌లో ఇలా మాట్లాడుకుంటున్నారు? ఇంతకముందెప్పుడూ వీళ్లని ఇలా చూడలేదే’ అనుకుంటుంది. అంతలో. హిమ తలెత్తి సౌర్యని చూసి షాక్ అవుతుంది. వెంటనే ‘బావా ప్లీజ్ ఈ విషయం గురించి ఇప్పుడు మాట్లాడకు జ్వాల మనల్నే చూస్తోంది’ అంటుంది హిమ కంగారుగా. నిరూపమ్ అయినా తాను ఈ టైం లో ఇక్కడ ఎందుకు ఉంది అని అనుకుని.. అయినాగాని అన్నీ నువ్వు అనుకున్నట్లుగా జరగాలంటే కుదురదు హిమ.. నీ జీవితంలో నేను ఉన్నాను.. అది గుర్తుపెట్టుకో’ అంటాడు నిరుపమ్ హిమతో.బావా ప్లీజ్ ఆపు.. నీకు దన్నం పెడతాను.. ఆపు’ అంటూ కంగారుగా నెమ్మదిగా చెబుతుంది అయినా నిరూపమ్ ఆపడు.
జ్వాలను చూసి మాట మార్చిన హిమ :
ఇక జ్వాల దగ్గరకు రావడం చూసి హిమే రివర్స్‌లో.. ‘నా ఆపరేషన్ నాది.. నీ ఆపరేషన్ నీది బావా.. నా పని జోలికి రావద్దు’ అంటూ మాట మార్చి అరుస్తుంది. ఆ మాటలు విన్న జ్వాల.. ‘వీళ్లు గొడవ పడేది ఆపరేషన్ గురించ అనుకుంటుంది మనసులో..ఇక నిరుపమ్ ఆవేశంగా.. ‘నువ్వు చేసేది ఏది నాకు నచ్చడం లేదు’ అంటూ అరవడంతో.. ‘హలో డాక్టర్ సాబ్ ఆపండి.. ఎందుకు ఇలా గొడవ పడుతున్నారు’ అంటూ కూల్ చేసే ప్రయత్నం చేస్తుంది జ్వాల.
నిరూపమ్ స్వీట్ వార్నింగ్ సూపర్:
సీన్ కట్ చేస్తే.. మరునాడు ఉదయాన్నే సౌందర్య ఆనందరావుతో.. ‘నిరుపమ్ డాక్టర్ చంద్రశేఖర్ వాళ్లకి ఫోన్ చేసి హిమతో పెళ్లి క్యాన్సిల్ చేసుకోమని స్వీట్ వార్నింగ్ ఇచ్చాడటండి అని చెబుతుంది. అది హిమ చాటుగా విని మనసులో బాధపడుతుంది.
నిరూపమ్ మాటలకూ జ్వాల ఫిదా:
ఇక నిరూపమ్ మాత్రం జ్వాలతో కలిసి ఆశ్రమానికి వస్తాడు. జ్వాల పక్కనే కూర్చుని మాటలు చెప్పడంతో జ్వాల మురిసిపోతుంది. ఇక స్వప్న వాళ్ళను చూసి ఏంటి రా ఆటోలో, ఆటో అమ్మాయితో తిరుగుతున్నావ్ అంటే..అవును మమ్మీ నాకు ఇష్టమైంది నేను చేస్తాను..ఆటో వాళ్లు నచ్చితే ఆటో వాళ్లతోనే స్నేహం చేస్తాను..ఆటో అంటే నాకిష్టం..’ అని సమాధానం ఇస్తాడు. నిరుపమ్ మాటలను వింటున్న జ్వాల తెగ మురిసిపోతుంది.!