Featured ట్రెండింగ్ న్యూస్ సినిమా

Karthika deepam: నాన్నమ్మను చూసిన సంతోషంలో జ్వాల… చెంప పగలకొట్టి జ్వాల ఆనందాన్ని ఆవిరి చేసిన సౌందర్య..!!

Share

Karthika Deepam:బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో ముందుగా తెలుసుకుందాం.ఎపిసోడ్ ప్రారంభంలోనే హిమ సౌర్య ను కలుద్దామని ఆటో స్టాండ్ దగ్గరకు వస్తుంది. ఇంతలో అక్కడకు వచ్చిన సౌర్య ఏంటి తింగరి నువ్వు ఇలా వచ్చేస్తే హాస్పిటల్ లో పేషెంట్స్ ని ఎవరు చూసుకుంటారు అని అంటుంది. దాంతో హిమ అక్కడ మీ డాక్టర్ సాబ్ ఉన్నాడులే అని అంటుంది. ఆ మాటకు సౌర్య ఎంతో ఆనందం వ్యక్తం చేస్తుంది. ఎప్పుడు హాస్పిటల్, పేషంట్స్ తో బోర్ కొట్టేసి కాసేపు నీతో టైమ్ స్పెండ్ చేద్దామని వచ్చాను అంటుంది.

karthika deepam today 21 april episode
karthika deepam today 21 april episode

Karthika deepam: డాడీని ప్రశ్నించిన నిరూపమ్..ఏ విషయంలో అంటే..?

మరోవైపు నిరూపమ్ వాళ్ళ డాడీని కలిసి అసలు మీకు మమ్మీకి మధ్య గొడవ ఎక్కడ వచ్చింది, ఎందుకు వచ్చింది అని అడుగుతాడు. నిరూపమ్ ఇప్పుడు అవేమి చెప్పలేను. సందర్భం వచ్చినప్పుడు నేనే చెబుతాను అని సత్యం చెప్పి నిరూపమ్ ను పంపించేస్తాడు. మరోవైపు సప్న ఆనందరావుతో రోజు రోజుకు ప్రేమ్,నిరూపమ్ లు ఇద్దరు మీ అల్లుడు దగ్గర అయిపోతున్నారు.డాడీ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తుంది.అంతేకాకుండా మీ ఆవిడ నా ఇద్దరి కొడుకుల మనసును మార్చేస్తుంది అని సౌందర్యనునానా మాటలు అంటుంది.అమ్మా అవన్నీ వదిలేయ్ అంటాడు ఆనందరావు
ఎలా డాడీ… మీ ఆవిడ చేసిన పనికి నా కూతురు ఇంకా అమెరికాలో చిత్రవధ అనుభవిస్తుంది. ఒక డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఎవరు లేని దానిలా ఒంటరిగా జీవితం గడుపుతుంది అని తన తల్లి పై మరింత కోపం వ్యక్తం చేస్తుంది.

karthika deepam today 21 april episode
karthika deepam today 21 april episode

సౌందర్యను చూసిన జ్వాల :

సీన్ కట్ చేస్తే మోనిత ఇంట్లో ఉండే ముసలి ఆవిడను ఎవరో రోడ్డు మీద ఢీకొని వెళ్ళిపోతారు. దాంతో ఆవిడను చూసిన జ్వాల ఆటోలో ఎక్కించుకుంటుంది. ఇంకా నీళ్ల బాటిల్ తీసుకుని వస్తుండగా కంగారులో అటుగా వస్తున్న సౌందర్యకు తగులుతుంది. సౌందర్యం చేతిలో ఉన్న పేపర్స్ కింద పడిపోతాయి. బాటిల్ లో ఉన్న నీళ్లు పేపర్స్ మీద పడతాయి.ఇక సౌర్య వాళ్ల నానమ్మ ను గుర్తు పట్టి అలానే చూస్తూ ఉంటుంది. సౌందర్య మాత్రం చూసుకోవాలి కదా వేస్ట్ ఫెలో అని సౌర్యపై విరుచుకు పడుతుంది. ఇక సౌర్య మనసులో బాధపడుతూ మా నానమ్మ ఇక్కడే ఉంటే.. నా శత్రువు కూడా ఇక్కడే ఉంటుంది కదా అనుకుంటుంది.

karthika deepam today 21 april episode
karthika deepam today 21 april episode

సౌందర్యను జ్వల ఫాలో అయ్యి హిమ గురించి తెలుసుకుంటుందా.?

అసలే టైం అయిన కంగారులో నేనుంటే రోడ్డు మీద ఈ పరుగులు ఏంటే అని సౌర్య చెంప మీద కొట్టి కాల్ ఎక్కుతుంది. కాసేపటికి ఏంటి నేను ఆ అమ్మాయిని కొట్టి ఇంతలా బాధ పడుతున్న అనుకుంటుంది సౌందర్య.ఇక వెంటనే సౌర్య ఆ ముసలావిడ ను  నిరూపమ్ వాళ్ళ హాస్పిటల్ కు తీసుకొని వచ్చి కాపాడుతుంది. ఇక రేపటి ప్రోమోలో ఆనందరావు, సౌందర్యకు జ్వాలనే హిమ అనే విషయాన్ని హిమ చెప్పినట్లు చూపిస్తారు.. మరి ఇది నిజమా… కలా అనేది రేపటి ఎపిసోడ్ లో చూడాలి.!


Share

Related posts

ముంబయిలో భారీ అగ్నిప్రమాదం

somaraju sharma

ZP Elections : ఎన్నికల్లో వివాదాల మయం..! ఒక్కో జిల్లాలో ఒక్కోరకమైన గొడవ..!!

somaraju sharma

Andhra Pradesh: ఏపీ రాజకీయ చదరంగంలో పది పరిక్షలు..! ఎవరు ఒప్పు.. ఎవరు తప్పు..?

Muraliak
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar