న్యూస్

Karthika Deepam: ఒకవైపు సౌర్యను కనిపెట్టే పనిలో సౌందర్య….మరోవైపు హిమను కనిపెట్టే పనిలో సౌర్య..?

Share

Karthika Deepam:బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీక దీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. మంచి కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను మన్ననలను పొందుతుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ ఏం జరిగిందో ముందుగా తెలుసుకుందాం. ఎపిసోడ్ ప్రారంభంలోనే హిమను స్కూటీ మీద ప్రేమ్ కాఫీ తాగడానికి తీసుకుని వెళతాడు. ఆ తర్వాత సౌందర్య, ఆనందరావు దంపతులు ఆటో కోసం సౌర్య దగ్గరకు వెళతారు.

karthika deepam today 23 april episode
karthika deepam today 23 april episode

సౌర్య ఆటో ఎక్కిన నానమ్మ, తాతయ్యలు

ఇక సౌందర్య అక్కడ సౌర్యను చూసి నిన్ను కొట్టినందుకు సారీ అని చెబుతుంది. కానీ సౌర్య అవేమి పట్టించుకోకుండా చాలా పొగరుగా సమాధానం చెబుతుంది..వాళ్ళు ఆటో ఎక్కిన తర్వాత సౌర్య ఎక్కడికి వెళ్లాలి అని అడుగుతుంది. ఇక సినిమా ధియేటర్ కి అని సౌందర్య విరుచుకుపడుతుంది. వాళ్ళిద్దర్నీ ఆటోలో తీసుకు వెళుతున్న క్రమంలో సౌర్య ఎలాగయినా హిమ గురించి తెలుసుకోవాలి అని అనుకుంటుంది హిమకు పెళ్లి అయిందో లేదో తెలుసుకోవాలి అని అనుకుంటుంది కానీ సౌందర్య మాత్రం ఆ అవకాశం ఇవ్వదు. ఇక వీళ్ళని డ్రాప్ చేసిన సౌర్య వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోదు.

karthika deepam today 23 april episode
karthika deepam today 23 april episode

హిమకు ప్రేమ విషయం చెప్పనున్న ప్రేమ్

ఇంతలో జ్వాలకు నిరూపమ్ ఫోన్ చేసి హాస్పిటల్ కి వస్తావా నీతో ఒక విషయం గురించి మాట్లాడాలి అని అంటాడు. మరోవైపు ప్రేమ్ హిమను కాఫీ తాగడానికి తీసుకొని వెళ్తాడు. ఈరోజు ఏలా అయినా హిమకు నా ప్రేమ విషయం చెప్పాలి అని అనుకుంటాడు. ఈ క్రమంలోనే అక్కడ హిమకు తెలియకుండా హార్ట్ షేప్ వచ్చేలా కాఫీని ఆర్డర్ చేస్తాడు. ఇక హిమను ప్రేమిస్తున్నాను అని చెప్పడానికి ప్రేమ్ ఆలోచిస్తాడు.

నిరూపమ్ మనసు ఇంత గొప్పదా..?

నిరూపమ్ మాట్లాడాలి అన్నాడు కదా అని హాస్పిటల్ కి వస్తుంది జ్వాల. ఇక నువ్వు జాయిన్ చేసిన ముసలావిడ కోసం మందులు కొనాలంటే బాగా ఖర్చు అవుతాయి అందుకని వాటికీ డబ్బులు ఇస్తున్నాను అని నిరూపమ్ అంటాడు. కానీ జ్వాల ఆ మెడిసిన్ కు ఎంత ఖర్చు అవుతుందో అంత డబ్బు నిరూపమ్ కి ఇచ్చేస్తుంది.ఇక జ్వాల వెళ్లిపతూ నిరూపమ్ ను చూసుకుంటూ నీ మనసు నాకు తెలుసు అని మనసులో అనుకుంటూ వెళుతుంది.

హిమను కనిపెట్టే పనిలో సౌర్య

మరోవైపు సౌందర్య సౌర్య చిన్నప్పటి ఫోటో చూపించి తాను ఇప్పుడు ఎలా ఉంటుందో ఒక బొమ్మ గీయాలి అని అంటుంది.ఇక ఈ లోపు అక్కడకు జ్వాల వచ్చి మీరు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు అని అడుగుతుంది. దాంతో సౌందర్య అసలు విషయం చెబుతుంది. ఇక సౌర్య కూడా హిమ దగ్గరకు వెళ్లి అదే ఆర్టిస్ట్ తో నా శత్రువు బొమ్మ గీపించాలి అని అంటుంది. దాంతో హిమ ఒక్కసారిగా షాక్ అవుతుంది .


Share

Related posts

తెలంగాణలో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు

venkat mahesh

“ఏపీలో సర్జికల్ స్ట్రైక్స్”..! ముహూర్తం ఖరారు- ఇక బీజేపీ ఆట మొదలు..!!

Srinivas Manem

సోనియా సాక్షిగా కాలర్ ఎగరేసిన జగన్… చరిత్రలో ఇలాంటి రివెంజ్ డ్రామా చూసి ఉండరు!

CMR
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar