Karthika Deepam: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తుంది. మంచి కుటుంబ కథా నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను అలరిస్తు వస్తుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందామా..ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే హిమ మామిడితోటలో మామిడికాయలు కోయడానికి ప్రయత్నిస్తూ ఉండగా అక్కడికి నిరూపమ్ వచ్చి హిమను ఎత్తుకొని మామిడి కాయలు కోయిస్తాడు. ఇక నిరూపమ్ ని చూసిన హిమ ఆశ్చర్యపోతుంది.కాసేపు ఇద్దరు ఒకర్ని ఒకరు చూసుకుంటూ ఉంటారు ఇదంతా ఒక చాటు నుంచి స్వప్న చూస్తుంది.వీరిద్దరి ఆగడాలు రోజురోజుకూ శృతి మించిపోతున్నాయి అనుకుంటు హిమపై సీరియస్ అవుతుంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
హిమ, నిరూపమ్ నై చూసి కోపంతో రగిలిపోతున్న స్వప్న :
సీన్ కట్ చేస్తే మరొకవైపు సౌందర్య, ఆనందరావులు కలిసి కారులో వెళ్తూ ఉండగా ఆనందరావు ఎందుకో నాకు సౌర్య దొరికినట్టు కల వచ్చింది అని చెబుతాడు. అవునా అండి ఈ కల నిజమైతే ఎంత బాగుండు అని సౌందర్య అంటుంది. ఇంతలోనే జ్వాలా వెనక వైపు నుంచి వచ్చి కారుని ఢీ కొడుతుంది.అప్పుడు సౌందర్య కోపంతో కాస్త చూసుకొని నడపవచ్చు కదా అని కోప్పడుతుంది. అప్పుడు జ్వాలా సౌందర్యను చూసి సీనియర్ సిటిజెన్ అని అనడంతో ఆనంద్ రావ్ నవ్వుతూ ఉంటాడు. అలా వారిద్దరూ కొద్దిసేపు ఫన్నీగా మాట మాట అనుకుంటూ ఉంటారు.ఆటో డ్యామేజ్ అయినందుకు ఎంత అవుతుందో చెప్పు నేను ఇస్తాను అని సౌందర్య అనగా, ఏమి అక్కర్లేదు నీ కారు డ్యామేజ్ కీ ఎంతవుతుందో చెప్పు నేనే నీకు ఇస్తాను అని అంటుంది. అప్పుడు జ్వాల మాటలను చూసి ఆనంద్ రావు నిన్ను చూస్తే నా మనవరాలు గుర్తుకు వస్తుంది అంటూ బాధపడతాడు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
సౌర్య బొమ్మ గియించే పనిలో పడ్డ సౌందర్య:
ఇక మరొకవైపు స్వప్న జరిగినంతా తలుచుకుని కోపంతో ఉంటుంది.ఇంతలో ఆనందరావు అక్కడికి రావడంతో డాడీ మీద ఫైర్ అవుతుంది.ఒకవైపు ఆ జ్వాలా మరొకవైపు హిమ నా కొడుకుని మోసం చేయాలని చూస్తున్నారు.ఎలాగయినా వాళ్ళ ఆటలు ఆపేస్తాను అని కోపంగా వెళ్ళిపోతుంది స్వప్న. ఆ తరువాత జ్వాల హిమను తలచుకొని ఎక్కడ ఉన్నావే అంటూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక సౌందర్య, సౌర్య ఫొటోని గీయించడం కోసం ఒక ఆఫీస్ కి వెళుతుంది. ఇంతలో అక్కడికి జ్వలా వస్తుంది.అక్కడ సౌందర్యను చూసి అక్కడికి ఎందుకు వచ్చిందా అని ఆరాలు అడుగుతుంది. సౌందర్య విసుగుంటూనే విషయం చెబుతుంది. నా మమనవరాలు చిన్నప్పుడు తప్పిపోయింది. దాని చిన్నప్పటి ఫోటో చూసి ఇప్పుడు ఎలా ఉంటుందో అనే బొమ్మ గియిస్తున్న అంటుంది. సౌర్య కూడా హిమ ఫోటో ఇలా గియించి దాని గురించి తెలుసుకుంటా అంటుంది..