న్యూస్

Karthika Deepam: నిరూపమ్ మీద పిచ్చి ప్రేమను. పెంచుకున్న జ్వల.. అసలు విషయం తెలిస్తే హిమను చంపేసేలాగా ఉందిగా..?

Share

Karthika Deepam:బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. గత ఎపిసోడ్ లో హిమ, నిరుపమ్‌ల నిశ్చితార్థాన్ని గుళ్లో జరిపించాలని సౌందర్య నిర్ణయిస్తుంది. మరో పక్క ప్రేమ్ తను ప్రేమించిన హిమని దూరం చేసుకుంటున్నందుకు మనసులో కుమిలిపోతుంటాడు. ఇక జ్వాల అయితే నిరుపమ్‌తో ప్రేమ ఊహల్లో మునిగి తెలుతుంది.ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందాం..హిమ షాపింగ్ చేయాలి రమ్మని జ్వలను తీసుకుని వెళ్తుంది.షాపింగ్‌కి వెళ్లిన జ్వల,హిమలు.. ఐస్‌క్రీమ్ పార్లర్ కూ వెళ్తారు. అక్కడ కూర్చుని ఐస్‌క్రీమ్ ఆర్డర్ ఇస్తారు.

హిమ తానే సౌర్య అనే నిజాన్ని జ్వలకు చెప్పేస్తుందా..?

ఇక హిమ మనసులో నేనే ని హిమను అనే నిజం చెప్పేస్తా అని అనుకుంటుంది.అలాగే జ్వాల కూడా డాక్టర్ సాబ్ ను ప్రేమిస్తున్నా అనే విషయం ఈ తింగరికి చెబితే ఏదోక సలహా ఇస్తుందా కదా అని అనుకుంటుంది మనసులో.ఇంతలో ఐస్ క్రీమ్ వస్తుంది. తింటూ తింటూ జ్వాల తన డ్రెస్ మీద చూసుకోకుండా ఐస్‌క్రీమ్ పడేసుకుంటుంది. దాన్ని క్లీన్ చేసుకోవడానికి వాష్ రూమ్‌కి వెళ్లి వచ్చే సరికి అక్కడ హిమ ఉండదు. ఏదో అర్జెంటు ఫోన్ వచ్చి ఉంటుందిలే అనుకుని జ్వల షాపింగ్ చేసిన బట్టలు తీసుకుని ఇంటికి వెళ్ళిపోతుంది

హిమ ఫోటోలను డిలీట్ చేస్తున్న ప్రేమ్ :

సీన్ కట్ చేస్తే ప్రేమ్ తన ఫోన్‌లో ఉన్న హిమ ఫొటోస్ డిలెట్ చేస్తూ బాధపడుతూ ఉంటాడు.‘అమ్మమ్మా నా జీవితంలో నిప్పులు పోశావ్ కదా నా ఆశలు అన్ని అడియాసాలు చేసావ్… ఎందుకు అమ్మమ్మా ఇలా చేశావ్..’ అంటూ కుంగిపోతాడు. ఇంతలో సత్య ప్రేమ్ దగ్గరకు వచ్చి హిమ, నిరుపమ్‌లకు నిశ్చితార్థం ఉంగరాలు తీసుకుందాం రా అంటే మీరు వెళ్లండి డాడీ.. నేను రాలేను’ అని అంటాడు.ఇక జ్వల తాను షాపింగ్ చేసిన బ్యాగ్‌లోంచి ఒక చీర తీసి తన మీద వేసుకుని చూసుకుంటూ తెగ మురిసిపోతూ ఉంటుంది.ఈ చీర నాకు డాక్టర్ సాబ్ కొనమన్నాడట.నేనంటే డాక్టర్ సాబ్‌కి ఎంత ప్రేమో అని అనుకుంటుంది.

నానమ్మను పట్టుకుని ఏడుస్తున్న హిమ.. ఎందుకంటే..?

సీన్ కట్ చేస్తే హిమకు సౌందర్య కోను పెడుతూ ఉంటుంది. అప్పుడే హిమ సౌందర్యతో నాన్నమ్మ సౌర్య వచ్చేదాకా పెళ్లి చేసుకోను అన్నా కదా? మరి ఇప్పుడు ఎందుకు నిశ్చితార్థం చేయిస్తున్నావ్ అని అంటుంది.మీ స్వప్న అత్తయ్యని లాక్ చేయడానికి ఇంతకన్నా వేరే మార్గం లేదు హిమా అంటుంది. అయినా నేను నీకు మాటిస్తున్నాను నువ్వు కోరుకున్నట్లే నీ పెళ్లికి సౌర్య వస్తుంది అని మాట ఇస్తుంది. ఇంతలో అక్కడికి చైత్ర వస్తుంది.. చైత్ర అంటే ఇంతకముందు నిరుపమ్‌కి రాఖీ కట్టిన స్వప్న స్నేహితురాలి కూతురు. చైత్ర రావడంతోనే రా చైత్ర వచ్చి మీ వదినకి కోను పెట్టు.. నేను ఇప్పుడే వస్తాను అంటూ వెళ్ళిపోతుంది. అప్పుడే చైత్ర.. హిమతో పరిచయం చేసుకుని పెళ్లి చూపులు గురించి,తను నిరుపమ్‌కి రాఖీ కట్టిన విషయం గురించి చెబుతుంది. ఇంతలో సౌందర్య అక్కడకు రావడం చూసి హిమ ఎమోషనల్ అవుతూ పరుగున వెళ్లి సౌందర్యని హత్తుకుని ఏడుస్తుంది. నాన్నమ్మా నన్ను బావని కలపడానికి స్వప్న అత్తయ్యతో ఇంతగా పోరాడావా? మా గురించి ఇంతగా తపన పడ్డావా? అంటూ ఏడుస్తుంది..

ఇతనే నా భర్త అని నిరూపమ్ ఫోటోను చూపించిన జ్వల :

ఇక మరుసటి రోజు ఉదయాన్నే జ్వల ఒకామెని ఆటో ఎక్కించుకుని వెళ్తూ ఉంటుంది. ఆటోలో వెనుక కూర్చున్న ఆమె ఉన్నది ఉన్నట్టు ఉండకుండా జ్వాలను ప్రశ్నలతో చంపేస్తుంది. ఆడపిల్లవి అయి ఉండి నువ్వు ఆటో నడుపుతున్నావ్ ఏంటీ..? రేపు నీకు పెళ్లి అయ్యాక మీ ఆయన ఒప్పుకుంటాడా అమ్మాయి. నువ్వు కూడా మరో ఆటో డ్రైవర్‌ని పెళ్లి చేసుకో అప్పుడు ఏ ఇబ్బంది ఉండదు అని జ్వలకు. సలహా ఇస్తుంది.ఆవిడ మాట్లాడిన మాటలకు జ్వలకు కోపం వచ్చి ఆటో ఆపేసి దిగవమ్మా దిగు అని ఆమెను దింపేస్తుంది.జ్వల ఫోన్‌లోని నిరుపమ్ ఫొటో ఆమెకి చూపించి చూడవమ్మా చూడు ఇతడే నాకు కాబోయే మొగుడు.. ఎంత అందంగా ఉన్నాడో.. మా ఆయన డాక్టర్ అంటూ చెబుతుంది.మీరు మీ ఆలోచనలను కొంచెం అయినా మార్చుకోరా అని క్లాస్ పీకుతుంది.ఆటో వాళ్లు ఆటో వాళ్లనే చేసుకోవాలా అంటూ వెళ్లవమ్మా వెళ్లు వేరు ఆటో ఎక్కు అని అక్కడనుండి వెళ్ళిపోతుంది..


Share

Related posts

Justice Kanagaraj: జస్టిస్ కనగరాజ్‌కి మూడో పదవి..! ఎలాగైనా మాట నిలబెట్టుకున్న జగన్..! ఈ సారి ఢోకా లేనట్టే – సేఫ్ పదవి..!!

Srinivas Manem

Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణకు సిఎం జగన్ ఫుల్ సపోర్టు..! ఇదీ ఫ్రూఫ్

somaraju sharma

Jai Bhim Bharat: ఏపిలో ఆవిర్భవించిన మరో కొత్త రాజకీయ పార్టీ

somaraju sharma
Enable Notifications    Recieve Updates No thanks