న్యూస్

Karthika deepam: స్వప్న మాస్టర్ ప్లాన్…నిశ్చితార్థం ఇష్టం లేదు అని చెప్పి వెళ్ళిపోయిన హిమ..!

Share

Karthika deepam: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్. రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. గత ఎపిసోడ్ లో జ్వాల ఆటో ఎక్కిన మహిళకు నిరూపమ్ ఫోటో చూపించి ఇతనే నాకు కాబోయే భర్త… ఎంత అందంగా ఉన్నాడో చూడు.. నా మొగుడు పెద్ద డాక్టర్ అని గొప్పగా చెప్పి ఆవిడను అక్కడ దింపేసి మళ్లీ నిరుపమ్‌ ఫొటో చూసి మాటలతో మురిసిపోతుంది. మరొక ప్యాసింజర్‌ తో కలిసి గుడికి వెళ్తుంటుంది.అదే గుడిలో నిరుపమ్‌, హిమ నిశ్చితార్థంకు సంబందించి ఏర్పాట్లు జరిపిస్తారు.అయితే నిశ్చితార్థానికి ఒక్క ప్రేమ్‌ తప్ప అంతా వస్తారు. స్వప్న కూడా ఎంగేజ్మెంట్ కు వచ్చి కూర్చుంటుంది. మనసులో మాత్రం చాలా కోపంగా ఈ నిశ్చితార్థం జరగదని అనుకుంటుంది స్వప్న. అయితే హిమ మాత్రం మనసులో ఏదో టెన్షన్‌ పడుతూ ఉంటుంది. నిరుపమ్‌ అడిగితే ఏం లేదని సమాధానం చెబుతుంది.

నిశ్చితార్థం ఆపేయడానికి స్వప్న పన్నిన పన్నాగం ఏంటంటే..?

ఇక మన స్వప్న మాత్రం ఈ నిశ్చితార్థం జరగదుగాక జరగదు అనుకుంటుంది. మళ్ళీ హిమ ఏదో తలుచుకుని బాగా టెన్షన్ పడుతుంది. అది గమనించిన సౌందర్య నీ కోరిక మేరకే అన్నీ జరుగుతాయని సర్ధి చెబుతుంది. సరే అన్నట్టు తల ఊపుతుంది. మరోపక్క జ్వల నిరుపమ్‌ కు ఫోన్ కలవడం లేదని ఆందోళన పడుతుంది. స్విచ్చాఫ్‌ అని రావడంతో హిమ ఇంటికి వెళ్దామనుకుంటుంది. 

బాధలో ప్రేమ్… నిశ్చితార్థంకు వెళ్తాడా?

మరోపక్క ప్రేమ్‌ తన లవ్ ఫెయిల్యూర్ గురించి ఆలోచిస్తూ బాధపడుతుంటాడు. హిమ కోసం తీసుకొచ్చిన ఉంగరాన్ని పారేస్తాడు.ఎంగేజ్‌మెంట్‌కు వెళ్లడం అవసరమా అని అనుకుని వెళ్లకపోతే బాగోదని అనుకొని మళ్ళీ వెళ్లడానికి బయల్దేరుతాడు. ఇక జ్వల సత్యం ఇంటికి వస్తుంది ఇంటికి తాళం వేసి ఉండడంతో తమ మ్యారేజ్‌ డేకు వెళ్లలేదనే ఫీల్ అయి ఉంటారని అనుకుని అక్కడి నుంచి వెళిపోతుంది. ఫైనల్ గా నిశ్చితార్థానికి ప్రేమ్ వచ్చి అక్కడ జరిగే ఫంక్షన్ కు సంబందించిన ఫొటోలు తీస్తుంటాడు. మనసులో బాధపడుతూనే ఫోటోలు తీస్తూ ఉంటాడు. ఇక స్వప్న ప్రశాంతంగా ఉండడం చూసి ఏదో చేయబోతుందని గ్రహిస్తుంది సౌందర్య.అయితే సరిగ్గా ఉంగరాలు మార్చుకునే సరికి అక్కడ పెట్టిన ఉంగరాలు కనిపించకుండా పోతాయి.ఆ ఉంగరాలను స్వప్న తీసేస్తుంది. ముహూర్తం దాటిపోతే నిశ్చితార్థం ఆగినట్టేనంటాడు పంతులు.స్వప్న సంతోషిస్తుంది.

స్వప్న ప్లాన్ ను చిత్తు చేసిన సౌందర్య:

కానీ సౌందర్య తెలివిగా తన బ్యాగ్ లో నుంచి మరో రెండు ఉంగరాలను తీసి స్వప్నకు షాక్ ఇచ్చి ఈ శుభకార్యాన్ని ఎవరూ ఆపలేరు అంటుంది. ఇక జ్వల అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ వేరే ప్యాసింజర్‌ను తీసుకొని నిశ్చితార్థం జరిగే గుడి వద్దకు వస్తుంది. దర్శనం చేసుకుందామని గుడి లోపలికి వచ్చి. డాక్టర్ సాబ్ కు నాకు పెళ్లి కావాలని దేవుడికి దండం పెట్టుకుంటుంది. జ్వాల గుడికి వచ్చిన సంగతిని హిమ గుర్తిస్తుంది.సరిగ్గా ముహూర్త సమయానికి లేచి ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు అని చెప్పి అక్కడ నుండి. వెళ్ళిపోవడంతో ఎపిసోడ్ ముగుస్తుంది.


Share

Related posts

Achennayudu : హోం మినిస్టర్ నేనే అన్న అచ్చెంనాయుడు డైలాగ్ వెనక ఇదా అసలు ప్లాన్?

somaraju sharma

చంద్రబాబు విశాఖ టూర్ పై సందిగ్దత

somaraju sharma

చైనా ఆన్‎లైన్ మాఫియా వెయ్యి కోట్ల దోపిడి..!!

sekhar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar