Karthika Deepam Today Episode: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీక దీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ ఎంతో ఆసక్తిగా మారింది. మంచి కుటుంబ కథా నేపథ్యంలో అందరిని విశేషంగా ఆకట్టుకుంటూ వస్తుంది.ఇక రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో ముందుగా తెలుసుకుందాం. జ్వాల ఇంటికి వెళ్లిన హిమ అక్కడ జ్వాల తనపట్ల చూపించిన ప్రేమాభిమానలకు ఎంతో సంతోషిస్తుంది. ఇక ఇంటికి వచ్చిన హిమ.. జ్వాలతో తాను గడిపిన క్షణాలను తలుచుకుంటూ ఎంతో ఆనందిస్తుంది. నువ్వే హిమ అని తెలిస్తే అందరు నిన్ను ఇంటికి తీసుకుని వచ్చేస్తారు.. నీ కోపం తగ్గేదాకా నువ్వే హిమ అనే విషయం ఎవరికీ చెప్పను అంటుంది. అంతేకాకుండా ఐయామ్ తింగరి అంటూ తెగ గంతులేస్తూ ఉంటుంది. ఈలోగా అక్కడకు సౌందర్య వస్తుంది. ఏంటే ఈ అల్లరి అంటే నేను తింగరి.. నువ్వు ముసలి తింగరి అని హిమ సౌందర్య ను కూడా అంటు ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను అంటుంది.హిమలోని ఈ మార్పుకి కారణం ఏంటి అని సౌందర్య ఆలోచనలో పడుతుంది.
Karthika Deepam Today Episode: అక్కా చెల్లెళ్ళ బంధం అంటే ఇష్టం లేదు అన్నా సౌర్యను హిమ మార్చుకుంటుందా..?
సౌర్యను వెతికే క్రమంలో హిమకు నిరూపమ్ సాయం :
సీన్ కట్ చేస్తే నిరూపమ్ మాత్రం ఇంట్లో నుంచి వెళ్లిపోయిన సౌర్య గురించి ఆలోచిస్తూ ఉంటాడు. పాపం సౌర్య కోసం హిమ ఎంతగానో ప్రయత్నిస్తుంది. హిమకు నేను కూడా హెల్ప్ చేస్తున్నాను అని తాతయ్యతో అంటాడు కానీ తాత్తయ్య మీరు మాత్రం ఎందుకు దీని గురించి పట్టించుకోవడం లేదు అని ఆనంద్ రావ్ ను అడుగుతాడు. దాంతో ఆనందరావు..సౌర్య మనకు దొరకకూడదు అని నిర్ణయించుకునే మనకు కనిపించకుండా ఉంది అంటాడు. వీరిద్దరూ మాట్లాడుకుంటున్న సమయంలో స్వప్న అక్కడకి వచ్చి ఆ హిమతో నిన్ను తిరగవద్దు అని చెప్పాను కదరా అని నిరూపమ్ తో అంటుంది.
Karthika Deepam APR 8 Today Episode: జ్వాలనే సౌర్య అనే నిజం తెలుసుకున్న హిమ ఏమి చేయనుంది..?
జ్వాల, హిమలను ఒక్కటి చేసిన నిరూపమ్ :
ఇక ఆ తర్వాత హిమ నిరూపమ్ లు ఇద్దరు కలిసి జ్వాల దగ్గరకు వస్తారు.వాళ్లు వచ్చే సమయానికి జ్వాల హోటల్ దగ్గర కూర్చుని రవ్వ ఇడ్లీ మాట్లాడుతూ ఉంటుంది. అంతలో నిరూపమ్ వచ్చి కాస్త నీ హుషారు కొంచెం అప్పు కావాలి జ్వాల అని అడుగుతాడు.ఆ క్రమంలో నిరూపమ్..హిమను నీతో తిప్పుకో నీలా మార్చు అని జ్వాలతో చెప్పి ఇద్దరు చేతులను కలుపుతాడు..ఇక ఇంతలో అక్కడున్న రవ్వ ఇడ్లీ నిరూపమ్ దగ్గర ఉన్న డాక్టర్ కోట్ తీసుకుని వేసుకుంటాడు. ఇక ఆ తర్వాత వాళ్ళందరూ కలిసి ఆనందంగా ఫోటోలు దిగుతారు.
Karthika Deepam APR 7 Today Episode: నిరూపమ్ జ్వాల మాయలో పడిపోయాడుగా..! పాపం హిమ పరిస్థితి ఏంటో.. ?
హిమను రోడ్డు మీద వదిలేసిన సౌర్య:
మరోవైపు సప్న మీరు ఎంత చెప్పినా మమ్మీ మీద నా అభిప్రాయం మారదు అని తన తండ్రికి మొహమాటం లేకుండా చెప్పేస్తుంది. ఇక హిమ, జ్వాల ఇద్దరు కలిసి ఆటోలో వెళ్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో హిమ జ్వాలను తన తల్లిదండ్రుల గురించి అడుగుతుంది. దాంతో జ్వాలకు ఒక్కసారిగా హిమపై కోపం వస్తుంది.ఇప్పుడు ఎందుకు అవన్నీ అని…నువ్వు అడిగిన అన్ని ప్రశ్నలకు నా సమాధానం ఇదే అని తన చేతి మీద ఉన్న హెచ్ అనే పచ్చబొట్టు చూపిస్తుంది జ్వాల. అంతేకాకుండా ఇంకోసారి ఇలాంటి ప్రశ్నలు అడగవద్దు అని అక్కడినుంచి హిమను వదిలేసి ఆటోలో వెళ్ళిపోతుంది. జ్వల. ప్రవర్తన చూసి హిమ చాలా బాధ పడుతుంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?