Karthika deepam: ఈరోజుటి ‘కార్తీక దీపం’ ఎపిసోడ్ లో జరిగేది ఇదే, అంబులెన్స్ లో శ్రీవల్లి!

Share

telugu serial: లాస్ట్ ఎపిసోడ్‌ అందరూ చూసే వుంటారు. దీప, రుద్రాణి ఇంటికి వెళ్లి, ‘మీ అద్దె ఇంట్లో మేము దిగొచ్చా? అడుగుతుంది. దానికి రుద్రాణి.. ‘ప్రస్తుతానికి మీకు, అద్దె భారం కావచ్చు మీరు ఫ్రీగా ఉండొచ్చు!’ అని ఆఫర్ ఇస్తుంది. ఇక దీప ఆనందానికి అవధులు వుండవు. కానీ సౌందర్య మాత్రం కార్తీక్‌ని, పిల్లల్ని, దీపని తలుచుకుని.. బాధపడుతుంది. సౌందర్య బాధపడుతూ ఉండగా ఆదిత్య, ఆనందరావులు బయట నుంచి వస్తారు. ‘ఏమైనా జాడ తెలిసిందా?’ అని సౌందర్య ప్రశ్నిస్తుంది. కానీ.. వాళ్ల మౌనాన్ని అర్ధం చేసుకుంటుంది.

కార్తీక్ ఫోన్ ఎవరికి దొరికింది?

పెద్దోడ్ని తలుచుకొని సౌందర్య ఏడుస్తుంది. ఆదిత్య ధైర్యం చెబుతాడు. ఇక కార్తీక్ ఫోన్ దొరికిన వ్యక్తి చాలా దయనీయంగా ఉంటాడు. బక్కచిక్కి, చింపురు జుట్టు కలిగి ఉంటాడు. ప్రస్తుతం తన పరిస్థితిని దేవుడు గమనించి ఈ ఖరీదైన ఫోన్ తనకి ఇచ్చి ఉంటాడని తెగ సంబర పడిపోతూ ఉంటాడు. ఆ ఉద్దేశంతోనే ఆ ఫోన్ కి ఏ ఫోన్ వచ్చినా లిఫ్ట్ చెయ్యకుండా జాగ్రత్త పడుతూ ఉంటాడు. ఇక దీప గురించి తెలిసిందే కదా. ఆ ఊరు గ్రామ దేవత ఆలయానికి వెళ్లి, ‘డాక్టర్‌ బాబుకి అండగా ఉండే శక్తి నాకు ప్రసాదించు!’ అని దండం పెట్టుకుంటుంది.

ఇంతకీ శ్రీవల్లి పరిస్థితి ఏమిటి?

కార్తీక్, పిల్లల దగ్గర కూర్చొని.. ప్రస్తుతం వారి పరిస్థితికి సారీ చెబుతాడు. దానికి సౌర్య.. ‘నాన్నా బస్తీలో మేము ఇంతకంటే ఎక్కువ కష్టాలు పడ్డాం. నువ్వు అప్పుడు మా దగ్గర లేవు.. కానీ ఇప్పుడు ఉన్నావ్.. ఇదే మాకు ఆనందం.’ అంటుంది. ఆ మాటలకు కార్తీక్ పొంగిపోతాడు. సరిగ్గా అదే సమయంలో బయటినుండి అరుపులు కేకలు వినిపిస్తాయి. శ్రీవల్లిని ‘ఓర్చుకోమ్మా’ అంటూ ఓ ముసలావిడ, ఓ మగ మనిషి వారిస్తూ ఉంటారు. వారి పరిస్థితిని గమనించి కార్తీక్ అంబులెన్స్ కి కాల్ చేస్తాడు. అంబులెన్స్ వచ్చి శ్రీవల్లిని తీసుకుపోతుంది. మిగిలిన భాగం తరువాత.. చుడండి.


Share

Related posts

ఎన్నికల కమిషన్‌పై సుప్రీం కన్నెర్ర..!

sarath

Advocates Murder Case: పుట్ట మధును విచారణ చేసి పంపిన పోలీసులు..! ట్విస్ట్ ఏమిటంటే..!?

somaraju sharma

KCR: కేసీఆర్ పాల‌న‌పై ష‌ర్మిల సెటైర్లు

sridhar