వంటలక్క కూతుళ్ళా మజాకానా.. ఇద్దరు కూడా పంతంలో తగ్గేదేలే అన్నట్టు ఉన్నారుగా..!

Share

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది.గత ఎపిసోడ్‌లో హిమ, సౌందర్య, ఆనందరావులను ‘మీరు నాకేం కారు అని చెప్పి ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకుంటుంది.ఆ తర్వాత వచ్చిన చంద్రమ్మ, ఇంద్రుడు ఇద్దరూ జ్వాల పరిస్థితి చూసి షాక్ అయ్యి ఏమయిందని అడగడంతో జ్వాల ఒక్కసారిగా కన్అ ‘పిన్నీ’అంటూ చంద్రమ్మపై వాలి కుమిలికుమిలి ఏడుస్తుంది. అదే సీన్ నేటి కథనంలో కంటిన్యూ అయ్యింది. సరే అమ్మా ఇంకా లే ఎమన్నా తిందువు గాని అని చెప్పి పిల్లకి ఏదైనా తినడానికి తీసుకునిరా వెళ్లు’ అంటూ ఇంద్రుడ్ని బయటికి పంపుతుంది చంద్రమ్మ.

జ్వాల ఇంటి ముందు ఆనందరావు :

సీన్ కట్ చేస్తే మరుసటి రోజు జ్వాల తలుపు తీసే సరికి ఇంటి ముందు ఆనందరావు కూర్చుని ఉంటాడు. ‘తాతయ్యా నువ్వేంటి ఇక్కడా?’ అంటుంది జ్వాల కంగారుగా.ఏదైనా పోగొట్టుకుంటే పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇస్తాం.మరి ఎవరి ప్రేమనైనా పోగొట్టుకుంటే ఎవరికి చెప్పుకోవాలమ్మా..అంటాడు ఆ దేవుడిని రోజు అడుగుతూనే ఉన్నాను.నా రెండో మనవరాలు కనపడేలా చేయవా అని.ఆ దేవుడు వరమిచ్చాడు కానీ నువ్వే కరుణించట్లేదు.మన ఇంటికి వెళ్దాం పదరా బంగారం అంటాడు ఆనందరావు. లేదు తాతయ్య నేను రాను ‘అక్కడ నా శత్రువు కూడా ఉంది అంటుంది సౌర్య.

ఇంటికి రాను అని తెగేసి చెప్పిన జ్వాల :

వెంటనే సౌర్య చేతుల్ని తన చేతుల్లోకి తీసుకున్న ఆనందరావు ఈ వయసులో ఆ దేవుడు మమ్మల్ని ఎంత ఏడిపించాలో అంత ఏడిపించాడు.. నువ్వు కూడా ఏడిపిస్తే ఎలా అమ్మా’ అంటాడు.ఏడిస్తే కష్టాలు పోతాయి అనుకుంటే.. ఇన్నేళ్లు ఏడుస్తూనే ఉండేదాన్ని తాతయ్యా.. కన్నీళ్లు పెట్టకుండా మౌనంగా ఎంత బాధపడ్డానో నాకు తెలుసు.. ఇక్కడి దాకా వచ్చావ్..లోపలికి రా తాతయ్యా కాఫీ తాగి వెళ్దువుగానీ..’ అంటుంది సౌర్య. ‘నేను కాఫీ కోసం రాలేదమ్మా.. నా మనవరాలిని తీసుకుని వెళ్లడానికి వచ్చానమ్మా’ అంటూ ఏడుస్తాడు ఆనందరావు. ‘అది జరగని పని తాతయ్యా. నువ్వు ఆరోగ్యం పాడు చేసుకోకు’ అంటుంది సౌర్య.

జ్వాలను ఆనందరావు ఇంటికి తీసుకుని వస్తాడా..?

ఇక హిమ తన ఇంట్లో దీప, కార్తీక్‌ల ఫొటో ముందు నిలబడి మనసులోని బాధను చెప్పుకుంటూ ఏడుస్తుంది. ఇంతలో సౌందర్య వస్తుంది. ఇక హిమ.. ‘నాన్నమ్మా ఎలాగైనా బావకి సౌర్యకి పెళ్లి చెయ్యాలి’ అంటుంది. ‘హిమా అప్పుడే స్వప్న, నిరుపమ్‌లకు. సౌర్య విషయం చెప్పొద్దు అంటుంది సౌందర్య. అసలే ఆ స్వప్నకు జ్వాల అంటే పడదు. ఆటోది అదీ ఇదీ అంటూ అవమానంగా మాట్లాడుతుంది. నిజం తెలిశాక కూడా మన అని కలుపుకుంటుందంటే నాకు నమ్మకం లేదు.. అందుకే అప్పుడే చెప్పొద్దు హిమా’ అంటుంది. ఇక హిమ సౌందర్యని.. ‘నాన్నమ్మా నేను సౌర్య చిన్నప్పటిలా కలసిపోయి,ప్రేమగా ఉంటాం కదా? అంటూ అడుగుతుంది. ‘కలుస్తారే.. తాతయ్యా వెళ్లారుగా సౌర్యని తీసుకుని రావడానికి.. ఏం జరుగుతుందో చూద్దాం’ అంటూ నచ్చజెబుతుంది.
ఇంతలో ఆనందరావు వచ్చి చాలా నిరాశగా సోఫాలో కూర్చుంటాడు. ‘సౌర్య ఏమంది?’ అంటూ సౌందర్య, హిమలు ఆత్రంగా అడుగుతారు. ‘తను రాదు సౌందర్యా.. ఇంతకాలం తను ఎవరో తెలియనప్పుడే బాగుంది. ఏదొకరోజు వస్తుందిలే అనే ఆశ ఉండేది. కానీ ఈ రోజు ఆ ఆశ కూడా లేదు’ అంటూ అల్లాడిపోతూ చెబుతాడు ఆనందరావు.

జ్వాల ఇంట్లో వంట చేస్తున్న హిమ :

ఇక సీన్ కట్ చేస్తే.. జ్వాల ఇంటికి వచ్చేసరికి తలుపు కొద్దిగా తీసి ఉంటుంది. ‘అదేంటి? పిన్నీ బాబాయ్ వాళ్లు బయటికి వెళ్తాం అన్నారు.అప్పుడే వచ్చాశారా?’ అనుకుంటూ తలుపు తీస్తుంది. ఎదురుగా హిమ కూర్చీలో కూర్చుని గుత్తి వంకాయ వండేందుకు మసాలాను వంకాయల్లో పెడుతూ ఉంటుంది. అది చూసి జ్వాల కోపంగా హిమ దగ్గరకు వెళ్లి..‘హేయ్‌ నువ్వేంటే ఇక్కడా?’ అంటుంది. ‘వంట చేస్తున్నా సౌర్యా అంటే నా ఇంటికి వచ్చి వంట చేయడానికి నువ్వు ఎవరే?’ అంటూ అరుస్తుంది సౌర్య. ‘ఎంతైనా మనం వంటలక్క కూతుళ్లమే కదా?’ అంటుంది హిమ నవ్వుతూ. వెంటనే ఆ వంకాయలను, మసాలాను ఎత్తి విసిరికొట్టి హిమను బయటికీ లాక్కుని వెళ్లేందుకు ప్రయత్నిస్తుంది.సౌర్య ఆగు నువ్వు నన్ను సరిగా అర్థం చేసుకోవడం లేదు అంటుంది హిమ ఆవేదనగా. ‘నా జీవితానికే అర్థం లేకుండా చేశావ్‌..’ అంటుంది జ్వాల కోపంగా. వెంటనే హిమ జ్వాల చేతుల్ని విసురుగా వదిలించుకుని సౌర్యా.. డాక్టర్‌ సాబ్‌తో నీకు పెళ్లి చేసే బాధ్యత నాది అంటుంది.

డాక్టర్ సాబ్ తో జ్వాల పెళ్లి చేస్తా అంటున్న హిమ:

‘నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావ్? నాకు డాక్టర్ సాబ్‌తో పెళ్లి చేస్తావా? ఎలా కనబడుతున్నాను నీకు?మీరు పెళ్లి చేసుకోబోతున్నారు.. శుభలేఖలు కూడా వచ్చేశాయి. అసలు నీది నోరేనా?’ఆ మాట ఎలా అంటున్నవ్ అంటుంది సౌర్య కోపంగా. దాంతో హిమ నవ్వుతుంది పెద్దగా. ‘హేయ్ ఏంటే నవ్వుతున్నావ్.. నా బతుకు నీకు నవ్వులాటగా మారిందనా? అంటుంది సౌర్య. నీకు తోడబుట్టింది నీకు ద్రోహం చేస్తుందని ఎలా అనుకుంటున్నావ్ సౌర్యా? ఒక్కసారైనా ఆలోచించలేదా? చిన్నప్పటి నుంచి కలిసి తిరిగాం.. కలిసి పెరిగాం.. నువ్వు ఎవరివో నాకు తెలిశాక కూడా నిన్ను నేను ఎలా మోసం చేస్తాను సౌర్యా’ అంటుంది హిమ ఎమోషనల్‌గా.మోసం చేసేవాళ్లు ఎవరు పది దేశాలు దాటి రారు.. మనవాళ్లే.. మన అనుకున్నవాళ్లే మనల్ని తెలివిగా మోసం చేస్తారు అంటుంది జ్వాల.ఇక హిమను బయటకు లాగేసి తలుపు పెట్టేస్తుంది జ్వాల.పాపం హిమ..సౌర్యా నా మాట విను ప్లీజ్’ అంటూ తలుపు కొడుతూ ఉంటుంది.సౌర్య మాత్రం తలుపు తియ్యదు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో సౌర్య తలుపు తీసేసరికి హిమ వర్షంలో తడుస్తూనే ఉంటుంది.అది చూసి సౌర్య షాక్ అయిపోతుంది.


Share

Recent Posts

Intinti Gruhalakshmi 19August: సామ్రాట్ ముందే నందు, లాస్య తులసిని తిడుతున్న మౌనంగా ఉండిపోయడా..

తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…

47 నిమిషాలు ago

మెగాస్టార్ బర్తడే సందర్భంగా మెగా ఈవెంట్ ప్లాన్ చేసిన నాగబాబు..!!

వచ్చేవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మెగా ఫాన్స్ రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పెద్దగా జరపలేదు. అయితే…

2 గంటలు ago

ఆగస్టు 19 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 19 – శ్రావణమాసం - శుక్రవారం మేషం దైవ చింతన పెరుగుతుంది.ఉద్యోగవిషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో…

4 గంటలు ago

ఆ మూవీని రూ. 75 వేల‌తో స్టార్ట్ చేసిన పూరి.. చివ‌ర‌కు ఏమైందంటే?

టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్ల లిస్ట్ తీస్తే.. అందులో పూరి జ‌గ‌న్నాథ్ పేరు ఖ‌చ్చితంగా ఉంటుంది. దూరదర్శన్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి పూరి జ‌గ‌న్నాథ్‌.. ఆ త‌ర్వాత…

5 గంటలు ago

త‌గ్గేదే లే అంటున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. బ‌న్నీని బీట్ చేసేస్తాడా?

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ త్వ‌ర‌లోనే `లైగ‌ర్‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరీ జగ‌న్నాథ్…

6 గంటలు ago

విజయ్ దేవరకొండ “లైగర్” కి సెన్సార్ షాక్..!!

"లైగర్" సినిమా మరో వారం రోజుల్లో విడుదల కానుంది. ఇటువంటి తరుణంలో తాజాగా సెన్సార్ బోర్డ్ "లైగర్" ఊహించని షాక్ ఇచ్చింది. విషయంలోకి వెళ్తే సెన్సార్ బోర్డ్…

8 గంటలు ago