NewsOrbit
న్యూస్ సినిమా

Karthika Deepam : మందు తాగి రచ్చ రచ్చ చేసిన వంటలక్క… దీపలో మరో కోణాన్ని చూసి షాక్ లో కార్తీక్..!

Karthika Deepam : బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘కార్తీకదీపం’ సీరియల్ ఈరోజు ఎపిసోడ్ మంచి రసవత్తరంగా సాగింది.గత ఎపిసోడ్‌లో కార్తీక్‌, దీప, పిల్లలు అందరూ కలిసి హోటల్ ముందు వంట చేసుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. దీప మాత్రం మందు బాటిల్ తెచ్చి చేతిలో పెడుతుంది. ‘మీ కోసమే బ్యాగ్‌లో పెట్టాను డాక్టర్ బాబు..’ అంటుంది నవ్వుతూ.. ‘ఆహా.. ఇలా అర్థం చేసుకునే భార్య ఉండాలే కానీ మగాడికి భూమి మీదే స్వర్గం ఉంటుంది తెలుసా అంటాడు నవ్వుతు.. ఈరోజే ఆఖరి రోజు అయినా చాలు అనిపిస్తోంది’ అంటాడు కార్తీక్. అయ్యో డాక్టర్ బాబు అలా అనకండి అంటుంది దీప.కానీ ప్రోమోలో మాత్రం దీప,కార్తీక్, హిమ చనిపోయినట్లు చూపించడం అభిమానులు జిర్ణించుకోలేకపోతున్నారు.ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏమి జరిగిందంటే..

Karthika Deepam : సౌందర్య భయం నిజం కానుందా..?

సౌందర్య.. బాధగానే కూర్చుని దీప, కార్తీక్‌ల గురించి, పంతులు చెప్పిన మాటలు గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఆనందరావు ప్రేమగా నచ్చజెబుతాడు.. ‘వాళ్లకి ఏం కాదు’ అని ధైర్యం చెబుతాడు.సీన్ కట్ చేస్తే.. చిక్ మంగుళూర్ గెస్ట్ హౌస్‌లో దీప మాత్రం కాస్త ఊగుతూ సోఫాలో కూర్చుంటుంది. ‘ఇంకో పెగ్ వెయ్యి దీపా ఏం కాదు’ అంటాడు కార్తీక్.‘వద్దు డాక్టర్ బాబు.. నా చేత వదన్నా తాగించారు అంటుంది దీప కాస్త ఊగుతూ… ‘ఏం కాదులే మేడమ్ తాగండి’ అంటూ ఇంకో పెగ్ వేస్తాడు. అయితే దీప దాన్ని అందుకుని దించకుండా తాగేస్తుంది. మేడమా..? హూ మేడమ్.. యూ డాక్టర్ బాబు.. ఐ వంటలక్క.. మధ్యలో మేడమ్ ఎక్కడ నుంచి వచ్చింది? యూ టెల్.. ఐ హియర్.. అంటూ దీప తూలుతూ మాట్లాడుతుంటే భలే కామెడీగా ఉంటుంది. ఎలా ఉంది దీపా’ అంటాడు కార్తీక్. ‘ఎలాగో ఉంది డాక్టర్ బాబు’ అంటుంది దీప.అలా వాళ్ళ మధ్య కాస్త ఫన్నీ సీన్స్ జరుగుతాయి.

Karthika Deepam : కార్తీక్ వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలుసుకున్న మోనిత :

సీన్ కట్ చేస్తే.. మోనితకి ఎవరో ఫోన్ చేసి. దీప, కార్తీక్ వాళ్ళు చిక్ మంగుళూర్ వెళ్లారు అనే విషయం చెప్తారు. ఇక మోనిత కోపంతో కార్తీక్ చిక్ మంగుళూర్ వెళ్లావా? నన్ను వదిలేసి కుటుంబ సమేతంగా తిరుగుతున్నావా నువ్వు ఎక్కడుంటే నేనూ అక్కడే కదా కార్తీక్’ అంటూ కోపంతో రగిలిపోతుంది.ఇక దీప చీర మార్చేసి వైట్ షర్ట్, ఫ్యాంట్ వేసుకుని ఊగుతూ కార్తీక్ వెనుకే నడిచి రావడం చూపిస్తారు బయట నలుగురు డాన్స్ చేస్తూ ఉంటారు. ‘డాక్టర్ బాబు మీరు నా డాన్స్ చుడండి.మందు లేకుండానే మీకు కిక్కు ఎక్కుతుంది అంటూ డాన్స్ చెయ్యబోయి పడిపోతుంది. ‘ఓ.. ఓ.. ఆగు ఆగు’ అంటూ పట్టుకుంటూ చుట్టూ చూసుకుంటాడు కార్తీక్. ‘నేను స్టడీ డాక్టర్ బాబు.. నువ్వే స్టడీగా ఉండాలి’ అంటుంది దీప నవ్వుతూ..దీప ప్లీజ్ కొంచెం కంట్రోల్‌లో ఉండు అంటాడు.వెంటనే దీప కార్తీక్‌ని తోసేసి.. ‘మీ మగాళ్లు అంతే ఆడవాళ్లని కంట్రోల్‌లో పెట్టాలని చూస్తారు..’ అంటూ మగాళ్లు వంటి మాయగాళ్లే సాంగ్ అందుకుంటుంది. ‘దీపా ఏం అయ్యింది నీకు.. నేనేం అంటున్నా నువ్వు ఏం అంటున్నావ్ అంటాడు కార్తీక్.

పచ్చబొట్టు వేయించుకున్న సౌర్య, హిమలు :

ఇంతలో హిమ, సౌర్యలు కార్తీక్ వాళ్ళ దగ్గరకు వచ్చి అమ్మా చూడు పచ్చబొట్టు వేయించుకున్నాం.. అంటూ వస్తారు. దీపని చూసి షాక్ అయ్యి అమ్మా ఫ్యాంట్ వేసుకున్నావా అంటే దీప నవ్వుతూ ఏదో చెప్పబోతుంది. కార్తీక్ వెంటనే ‘ఆగు.. ఆగు’ అంటూ.. దీపని పట్టుకుని.. పిల్లలకు అర్థం కాకుండా కవర్ చేస్తాడు.‘ఏంటమ్మా పచ్చబొట్టు వేసుకున్నారా’ అంటాడు. ‘అవును డాడీ.. హిమ పేరులోని హెచ్ నా చేతి మీద వేయించుకున్న అలాగే ‘నేను సౌర్య పేరులోని ఎస్ నా చేతి మీద వేయించుకున్నాను డాడీ’ అంటుంది హిమ.

దీప మందు తాగిన విషయం పిల్లలు కనిపెడతారా..??

దాంతో దీప తూలుతూ పచ్చబొట్టు చెరిగిపోదులే నా సామీ.. అంటూ ఊగుతూ పాడుతుంది. ‘డాడీ అమ్మకి ఏమైంది అలా అంటే.. కార్తీక్.. దీపని గట్టిగా పట్టుకుని.. ‘ఏం లేదమ్మా నిద్ర మత్తులో ఉంది’ అంటూ కవర్ చేస్తాడు. తరువాత డాన్స్ చేసి రచ్చ రచ్చ చేస్తుంది దీప.చివరికి దీపను కార్తీక్ మోసుకుని వెళ్తాడు.ఇక తెల్లారే దీప మంచంపైన చీరలోనే నిద్రపోయి ఉంటుంది. దీపని చూసి గతంలో సంఘటనలు గుర్తుచేసుకుని ముద్దుపెట్టాలని మీదకు వాళతాడు.కానీ దీప కార్తీక్ ను తన మీదకు లాక్కుని బెడ్ మీద పడేలా చేస్తుంది నవ్వుతూ.. ‘డాక్టర్ బాబు రాత్రి ఏమైనా ఎక్కువ చేశానా’ అంటుంది దీప.ఏం చేసినా నాకు సంతోషాన్నే ఇచ్చావ్ దీపా చాలా బాగుంది’ అంటాడు నవ్వుతూ.. దీప సిగ్గుపడుతూ కార్తీక్ గుండెల మీద తలపెట్టి నిజం చెప్పండి డాక్టర్ బాబు అనడంతో ఎపిసోడ్ పూర్తవుతుంది.!

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!

Saranya Koduri

Sr NTR: వాట్.. సీనియర్ ఎన్టీఆర్ మొట్టమొదట రాముడు వేషం వేసింది తెలుగులో కాదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Jagadhatri April 19 2024 Episode 209: కౌశికి హార్డ్ డిస్క్ పట్టుకునే ప్రయత్నంలో ల్యాండ్ ని కోల్పోతుందా..

siddhu

Trinayani April 19 2024 Episode 1217: నైనిని చంపడానికి తిలోత్తమ వేసిన ప్లాన్, ఉసిరి దీపాలను ఎగరగొట్టిన సుమన.

siddhu

Krishna Mukunda Murari April 19 2024 Episode 449: సంగీత అనుమానం..కృష్ణ కి ప్రమాదం తలపెట్టిన ముకుంద..కృష్ణ బాధ.. ఆదర్శ్ ప్రేమ..

bharani jella

Brahmamudi April 19 2024 Episode 388: బాబుకి ప్రమాదం.. నిజం చెప్పక ఇంటికి దూరం కానున్న రాజ్ .. నిజం బయట పెడతానన్నా సుభాష్.. అంతా తెలుసుకున్న కావ్య..

bharani jella

Naga Panchami: పంచమి కడుపులో బిడ్డను తీయించుకుంటుందా లేదా

siddhu

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?